26, సెప్టెంబర్ 2017, మంగళవారం

మదనిక-శర్విలకుడు , వసంతసేన

కిటికీలో నుండి కోకిల పాట వినిపిస్తుంది. మదనిక అటు వెళ్ళబోతుంది. 
"మదనికా! ..... "  వసంతసేన  వసంతసేన గొంతు అది. 
యజమానురాలి కంఠధ్వని వినీ వినగానే, 
పరిచారిక మదనికలో  తత్తరపాటు.
"మదనికా! వేళ గాని వేళలలో - ఋతువు గాని ఋతువులలో - 
ఈ పిక గానం ఏమిటి?, తరచుగా వినిపిస్తూన్నది!?"  
నవ్వుతూ ప్రశ్నించింది వసంతసేన.
మదనిక ఉలిక్కిపడి ఆగింది. 
"అబ్బె, ఏం లేదమ్మా! ......... 
మన ఆవరణలో మామిడి చెట్లు చిగురులు వేశాయి.
ఉజ్జయినిలో అందానికి తలమానికం ఐన ఈ మా వసంతసేన ప్రతి రోజూ - 
ఆ చెట్టును నిమురుతూ ఉన్నారు కదా , 
ఆ ఆకులతో ఆప్యాయంగా మాట్లాడుతున్నారు కదా! 
ఇంత దోహదం లభిస్తున్నది కాబట్టే ఆ ఆమ్ర తరువు పల్లవిస్తున్నది.
చిగురులు వేసిన కొమ్మల గుబురులలో కోకిలలు దాక్కోవడం సహజమే కదమ్మా!"
"ఏమో అనుకున్నాను. భలే చమత్కారివే" 
"ఈ వసంతసేన గారికి ఇష్ట దాసి కదా ఈ మదనిక, 
అంత తావిలో ఇంత, గోరంత తావి అంటుకున్నది, - నాపై విరజిమ్మింది మరి." 
;                  
"సరే నేను మిద్దె పై గదికి వెళ్తున్నాను." 
ఓరగా కిటికీ బైట వంగి దాక్కుంటూ నిలబడిన మనిషిని గమనిస్తూ, 
మెట్లు ఎక్కసాగింది వసంతసేన.
"హుష్, నీకు  బుద్ధి లేదు శర్విలకా!"
మెట్ల మీది వసంతసేన "ఓహో, ఈతని పేరు శర్విలకుడన్న మాట" ;
"ఈ మదనికను తెగ ఇరకాటంలో పెడ్తున్నావు శర్విలకా! 
ఇట్లాగ - మాటి మాటికీ - దొంగతనంగా కలుసుకోవడం కుదరదు.
యజమాని వసంతసేన మనల్ని పసికట్టినట్లు ఉన్నారు."
"మరెట్లాగ, ఇట్లాగ తప్పడం లేదు మరి!? 
నిన్ను విడిపించాలంటే పరిహారం చెల్లించాలి కదా.
ఆ శుల్కం పెద్ద మొత్తం ఆయిరి, నువ్వు చెప్పినట్లు ఇక నేను దొంగతనాలు చేయాల్సిందే!" 
"మీ ఊరు నుండి ఇంత దూరం వచ్చింది, చోరునిగా మారడానికా,
అదిన్నీ ఈ మదనిక కోసం. నా మూలాన్న ఒక పల్లెటూరి బైతు -  అమాయక చక్రవర్తి - 
చోరునిగా మారితే, ఆ పాపం నాకు చుట్టుకుంటుంది, 
పైగా మాకు అప్రదిష్ట కూడానూ."

వసంతసేన తల్లి అందర్నీ పిలుస్తూ వచ్చింది.
"వసంతసేనా! ఎక్కడున్నావు? మదనికా, మదనికా! ఎవరూ కనబడరేం, 
సమయానికి దాసీలు - ఒక్కరూ అందుబాటులో ఉండరు కదా!?" 

"అమ్మో, దొడ్డ యజమాని వస్తున్నట్లు ఉన్నారు, వెళ్తున్నాను. ----- "
"ఈ మదనిక మహారాణి గారి మళ్ళీ పునర్దర్శనం - ఎప్పుడో ఏమో!?"
"ఎవరో వస్తున్నారు. సద్దు సద్దు, ఇక మరలిపో!"
**************************************************;
     అధ్యాయ శాఖ ;- 5  ;  
TAG :-  వసంతసేన వసంత సేన కోణమానిని, ప్రాచీన రత్న మాల, ;

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...