26, సెప్టెంబర్ 2017, మంగళవారం

కోవెలలో నర్తకి

వసంతసేన నాలుగు కాళ్ళ మండపంలో - నృత్యం చేస్తున్నది.
ఆమె కాలి గజ్జెలలోని ఒక మువ్వ జారి, దొర్లుతూ కింద పడింది.
"మీ మువ్వ."  అంటూ -
తన ముందు పడిన మువ్వను ఇచ్చాడు రోహణుడు.
నాట్య రూపకంలో సంభాషణలో కలిపేస్తూ
"ఆర్యుల నామధేయములు తెలుసుకొనవచ్చునా!? ...... "
ఆ ప్రశ్నకు బాల రోహణుడు సమాధానం ఇచ్చాడు.
"నా పేరు రోహణుడు, ఆర్య చారుదత్తుల కుమారుడిని,
మా జనని నామం ధూతమాంబ."
నవ్వుతూ అటు చూసిన వసంతసేనకు చారుదత్తుడు కనిపించాడు. -
"ఆహా, ఎంత రూపసి. ధూతా దేవి ఎంత భాగ్యశాలి." అనుకున్నది.
;
నాట్యం పూర్తి ఐనది.
వసంతసేన పై వ్యామోహం కలవారు ముందుకు వస్తున్నారు.
వసంతసేన తల్లి వారిని నిలుపుతూ, కన్నెరిక శుల్కం ఎవరు ఎక్కువ కట్టగలరో తెలుపండి.
రాబోయే శ్రావణ మాసం, పౌర్ణమి నాడు ఏర్పాటు చేస్తున్నాము ....... 
 వేలం పాటను, 12 లక్షల వరహాలు చెల్లించగల వారు మాత్రమే వేలంలో పాల్గొనడానికి రావొచ్చును."
ఆ ప్రకటన విని అందరు జారుకున్నారు.
శకారుడు, మరి కొంతమంది తమలో తాము మాట్లాడుకుంటూ నిలబడ్డారు.
వసంతసేన కళ్ళు మాత్రం -
అక్కడి నుండి వెళ్ళి పోయిన చారుదత్తుని కోసం అన్వేషిస్తున్నవి. ;  
;
*************************************************;
కోవెలలో నర్తకి ;- అధ్యాయ శాఖ ;- 4  ;
;

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...