10, అక్టోబర్ 2017, మంగళవారం

సారధి - ఊరి వాళ్ళతో యోచన

మేడమీద కిటికీలో నుండి - మామిడి చెట్టు కనిపిస్తున్నది. వసంత సేన 
"మదనికా! పిక గానం బాగుంది కదూ!" 
"చారుదత్తుల వారి ఇంటిలో గానం చేసి, ఆ కోకిల ఇక్కడికి వచ్చినట్లుంది దొరసానీ! 
అందుకే దాని పాట బహు బాగున్నది." నవ్వింది మదనిక. 
"ష్! అమ్మ వింటుంది." 
"చిత్తం." ముసిముసి నవ్వులతో కిటికీ తోరణాల దుమ్ము దులుపుతున్నది మదనిక.
ఇద్దరికీ గతం గుర్తుకు వచ్చింది.
**********************************: & 
నెల రోజుల క్రిందట జరిగింది ................ 
;
FLASH BACK = నేపథ్యం :- 
పౌర్ణమి నాట్యం చేయుటకై వసంత సేన 
ఉద్యానవనములోనికి పరిచారిక మదనికతో వెళ్ళినది.

బైట నిలబడి ఉన్నది వసంత సేన బండి. 
ఆ బండిని తోలే వాని పేరు తుందిలుడు. 
&
ఇంతలో సారధికి కోలాహలం కనిపించింది. -
"మన గ్రామంలో ప్రజలందర్నీ రాజ భటులు కొట్టారు. ఇట్లాగ ఎన్నాళ్ళని, ఈ హింసలను భరిస్తాం?"
"ఆర్యకుని బంధించారు, హింసలు పెడ్తూ, తీసుకెళ్ళారు, చెరసాలలో వేసారు. 
మన రాజ్యంలో -  నిజం మాట్లాడితే తప్పు, న్యాయం కోసం ప్రశ్నిస్తే ఆ దండన ఒక్కటే .. అందరికీ తెలిసిందే!"
"ఏమిటీ, మన ఆర్యకుని చెరసాలలో డేసారా!?" 
"నువ్వెవరవు?" 
"నేను తుందిలుణ్ణి. మన ఊరు నుండి పట్టణం చేరాను. ఇక్క ఒకరి వద్ద - శకట సారధిని. యజమానులకు చెప్పి వస్తాను. మన ఊరి ప్రజలు చాలామందిని ఆ శకారుడు - ఈ రీతిగా చెప్ప నలవి కాని రీతులలో బాధిస్తున్నాడు. పేనుకు పెత్తనం ఇచ్చాడు - అసమర్ధ ప్రభువు. రాజా వారి బావమరది ఐనంత మాత్రాన విచక్షణ మరచిపోవాలా? స్థాన బలమె కాని తన బలము కాదయా - అని పెద్దలు అన్నారు అందుకే!"
"తుందిలా, ఇప్పుడేం చేయగలం?"
- మనం అందరం సమైక్యతతో ఉండాలి. కష్ట కాలంలో - ఐకమత్యమే మన బలం - కలిసి ముందుకు కదులుదాం."   ''''' 
"నా స్నేహితుడు చెరసాలలో కాపలా కాస్తాడు. 
"కోటలో వెనుక మూల చీకటి కొట్టు ఉన్నది. బందీలను అక్కడ ఉంచుతారు.
అక్కడికి చేరే ఉపాయాన్ని అలోచన చేద్దాం.
రాత్రికి మనం ఊరి శివార్ల వద్దగుడిలో కలుద్దాము. మంచి ప్రణాళికను ఆలోచిద్దాం." 
"సరే తుందిలుడా, అందర్మూ ఈ బాట వద్ద ఇట్లాగే గుమిగూడి కనిపిస్తే తంటాలు.

డుగో, శకారుడు వస్తున్నాడు. సెలవు."   
"సంతోషంగా ఉంది. అనుకోకుండా మాకు - నీ వంటి ధీరుని సహకారం లభించింది. 
మళ్ళీ మాకు పైనున్న ఆ  భగవంతుని పై నమ్మకం పాదుకొంటున్నది."
అటుగా బౌద్ధ సన్యాసులు కొందరు వెళ్తున్నారు. 
;
"బుద్ధం శరణం గచ్ఛామి,
సంఘం శరణం గచ్ఛామి,                                                                            ధర్మం శరణం గచ్ఛామి||

బౌద్ధ బిక్షువులు వెళ్ళేదాకా అందరూ కాస్సేపు ఆగారు.  
ఊరి వాళ్ళు  తుందిలునికి వీడ్కోలు చెబుతూ, వేగంగా వెళ్ళి పోయారు.  
తక్కిన వాళ్ళు వేరే దిశగా వెళ్ళగా, 
తుందిలుడు కూడా తోట దగ్గరికి బయలుదేరాడు. 
*****************************************;
;
REF : తుందిలుడు, ఊరి వాళ్ళతో యోచన ; 
అధ్యాయ శాఖ ;- 8 ;- సారధి - ఊరి వాళ్ళతో యోచన  ;
;

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...