"సరే, ఇక సెలవు, మళ్ళీ పున్నమికి
మదనిక, శర్విలకుల సమావేశం. సరేనా!?"
;
"ఒళ్ళు మర్దన చేస్తాం. మీ మేనికి మిసమిస, ఒళ్ళు మర్దన చేస్తాం."
వీధిలో అరుస్తూ చెబుతూ, వెళుతున్నాడు సంవాహకుడు.
"ఓ సంవాహకుడా ....... నేను శర్విలకుడిని."
"సంవాహకుడా! బాగున్నావా,
మన పల్లెలో అందరూ కుశలమా, త్వరగా చెప్పు చెప్పు."
"ఇంకా మన పల్లెసీమ గురించి తలుచుకుంటూనే ఉన్నావా,
నేను మళ్ళీ వెనకకు వెళ్ళనే లేదు కదా."
"ఔరా, ఐతే మనకు పుట్టిన నేలకూ ఋణం తీరినట్లేనా"
నిట్టూర్చాడు శర్విలకుడు .
"అది సరేగాని, సంవాహకుడా!
మర్దన క్రియలు - ఈ కొత్త పనిని ఎప్పుడు నేర్చుకున్నావు!?"
"చారుదత్తుల దగ్గర చేస్తుండే వాడిని. ఆయన చాలా మంచివారు.
గొప్ప దాత. దాన ధర్మాలు చేసి, నిర్ధనులైనారు.
ఇక నాకు గత్యంతరం ఏమున్నది, ఇదిగో - పొట్ట చేత పట్టుకుని,
వీధులలో పడ్డాను. నీకు ఒళ్ళు పట్టమంటావా!?"
నవ్వుతూ అడిగాడు సంవాహకుడు.
"జోగీ జోగీ రాసుకున్నట్లున్నది. ఎర్ర ఏగాణీ లేని వాణ్ణి అడుగుతున్నావు.
నాకు శుశ్రూష చేస్తే నీకు ఏమివ్వగలను, శూన్యహస్తాలు ..... "
"ఫర్వా లేదులే. మిత్ర శర్విలకుని నుండి ప్రతిఫలం అక్కర లేదులే.
హాయిగా మన చిన్ననాఈట్లను నెమరేసుకుందాం.
అవే మన ఉభయులకు ప్రస్తుత పారితోషిక నిధులు. ఏమంటావు!?"
"అంతకంటేనా, ఇన్నాళ్ళకి నా మనసు సేద దీరున్నది."
"అది సరే గాని మిత్రమా, శర్విలకా,
ప్రఖ్యాత నర్తకి వసంతసేన ఇంటి నుండి వస్తున్నావు,
ఏదైనా రహస్యం గానీ ఉన్నదా."
"మదనిక వసంతసేన వద్ద ఉన్నది.
ఆమె పరిచారిక మదనిక చాలా మంచి కన్యక,
బహు ఓరిమి కలిగిన పడుచు. ........... "
బోధపడింది, ఈ సంవాహకుడు - ఇక నుండీ నీకు బోధ గురువు నీకు అండదండ ....."
"ఐతే నాకిక బెదురు, బెరుకు లేవు. ఇంత మంచి స్నేహితుడు
కుడి భుజంగా ఉన్నపుడు నాకిక ఎదురేమున్నది ..... " అనేసి నవ్వాడు.
ఇద్దరూ ముచ్చట్లు చెప్పుకుంటూ ముందుకు నడుస్తున్నారు.
;
****************************************************,
అధ్యాయ శాఖ ;- 6 ; సంవాహకుడు - శర్విలకుడు ;
Tags ;- వసంతసేన వసంత సేన కోణమానిని, నాటకం తెలుగు,

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి