26, సెప్టెంబర్ 2017, మంగళవారం

ఆర్యకుడు ; in పట్టణంగా మారుతూన్న పల్లెటూరు

ఆర్యకుడు స్నేహితులు మాట్లాడుకుంటున్నారు. వర్తమాన విషయాలు, సంఘంలోని ప్రజల ఈతిబాధలు -
వివిధ విషయాల పైన చర్చలు చేసుకుంటున్నారు.
అసమర్ధ రాజు, దుష్టుడైన రాజు యొక్క బావమరది ఆగడాలు, పన్నుల భారంతో 
ప్రజలు విలవిల - సంభాషణలలో సాగుతూండగా - రాజభటులు, శకారుడు వచ్చారు. 
"యువరాణి - పెంపుడు పిల్లి పుట్టిన రోజు - కనుక పన్నులు కట్టండి." అన్నారు. ఆర్యకుడు, ఇతరులు - 
"క్రిందటి వారమే - ఇంట్లో స్త్రీల నగలు , అమ్మి మరీ మీకు - సుంకం చెల్లించాము. మా వల్ల కాదు." 
శకారుడు ఆగ్రహంతో "ఆర్యకుడా! నిన్ను చెరసాలలో వేసి, కొరడా దెబ్బలు కొట్టిస్తాను." అంటూ వెళ్ళి పోయాడు. 
"రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా - అని పెద్దలు అన్నారు, ఇందుకే" 
;
;"సంవాహకా! మూట ముల్లె సర్దుకుని, ఎక్కడికి వెళ్తున్నావు?" అడిగాడు ఆర్యకుడు.
"మన పల్లెలో భుక్తి లేదు." 
"ఐతే ముక్తి కోసం పట్నం వెళ్తున్నావన్న మాట."
రచ్చబండ మీద కూర్చున్న వారిలో నుండి లేచి, నిలబడ్డాడు శర్విలకుడు, 
"ఆగు, సంవాహకా! నేను కూడా వస్తున్నాను. 
పనీ పాటా లేకుండా గాలి తిరుగుళ్ళు తిరుగుతున్నావని - 
ఇంటా బయటా నన్ను  - అందరూ ఆడిపోసుకుంటున్నారు. 
అక్కడైతే ఏదో ఒక పని దొరికితే, నా తిప్పలేవో నేను పడతాను." 
అందరూ నిర్ఘాంత పోతారు. 
"అరె, శర్విలకా! ఎంతైనా మనం పుట్టిన గడ్డ ఇది,  ఈ నేల మన కన్నతల్లి. 
పురిటి గడ్డని విడిచి పోవచ్చునా!?  ఆగు, శర్విలకుడా, నిలు నిలు, సంవాహకుడా!" 
మిత్రులందరూ అన్నారు. 
"ఇక్కడే ఉండి పస్తులు ఉండమంటున్నారే!? భలే వాళ్ళే"                                          ఇద్దరూ ఎడ్ల బడిని ఎక్కారు.బండి చక్రాలు తిరుగుతూ ఉన్నవి.
*********************************************;

;   అధ్యాయ శాఖ ;- 1 ;-  ఆర్యకుడు ; in పట్టణంగా మారుతూన్న పల్లెటూరు ;-  
Tag ;- వసంతసేన వసంత సేన కోణమానిని, 

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...