"లిపిక"- ఈ పేరు సంస్కృతములోని "లిపి" నుండి వచ్చినదే అనిపిస్తూన్నది కదా!
ఐతే చిత్రముగా -మధ్య యూరోపులో ప్రఖ్యాతమైనది.
"అశ్వ హృదయ పరిజ్ఞానులు" అందరికీ ఆప్యాయత పొందిన పేరిది.
సరే! ఇంతకీ ఇది దేని నామధేయమో సెలవివ్వాలి- అంటే- ??????
సమాధానము:- "శ్రేష్ఠమైన తురగ జాతి name ఇది."
"బెన్ హర్"( 1959, హీరో:- Charlton Heston ) సినిమా గొప్ప హిట్,
14ఆస్కార్డు అవార్డులను గెలుచుకున్న మూవీ కదా!
ఇందులో chariot race చిత్రీకరణ "న భూతో, న భవిష్యతి".
రధాలకు పూన్చిన గుర్రాలు తెరపైన నిజంగానే పరుగులు తీసాయేమో.... అనిపిస్తాయి.
రధముల పందెములలో - హీరో బెన్ హర్ ఎక్కిన రధానికి- శ్వేతాశ్వాలను కట్టారు.
కథానాయకునివి (ఛార్ల్ టన్ హెస్టన్) తెల్ల గుర్రాలు ఐతే-
ప్రతినాయకుడు (/ villain") "మెసాలా" రధానికి కట్టినవి - నల్ల గుర్రాలు.
మన ప్రాచీన నాటకములలో వలెనే -
బెన్ హర్ దర్శకులు - తెలుపు - నలుపు రంగులను -
పాత్రల స్వభావోచితముగా - ప్రతీకాత్మకముగా ఉపయోగించుకున్నారు.
ఇటలీలో అధికముగా సినీ షూటింగు చేసారు. ఐనప్పటికీ -
ఇటలీ దేశములోని గుర్రాలను వాడలేదు.
ఈ సీను కోసమని-
"ప్రత్యేకముగా స్లోవేనియా దేశము (Slovenia) నుండి -
"గుర్రములను" తెప్పించినారు;
అవే "లిపిక అశ్వరాజములు".
(Lipizzaner horses/ lipica and arabic horse breeding in the stud farm 1580 )
తుషారము (= Snow పొగమంచు) వన్నె కలిగి,
ఉత్తమ జవనాశ్వములని- ప్రపంచ ప్రఖ్యాతి గాంచినవి.
స్లోవేనియా ( Slovenia ) లోని "లిపిక" అనే ప్రాంతము వీనికి - బ్రీడింగు సెంటరు.
మే 19 వ తేదీని స్లోవేనియా ప్రజలు "లిపిజ్జనీర్ డే" పండుగను జరుపుకుంటారు - అంటే
వారికి "లిపిక తురగ గమన, తురగ వల్గనముల" పట్ల ఎంత ఆరాధనా భావమో బోధపడ్తుంది."
ఆర్చ్ డ్యూక్ ఛార్లెస్ 1580 May 18 న
శ్రీకారము చుట్టిన అంశము ఇది, Day of Lipizzaner .
ఆస్ట్రియా ప్రభు వర్గీయుడు ఛార్లెస్ -
స్పెయిన్ దేశము నుండి కొనితెచ్చిన ఈ శ్రేష్ఠమైన గుర్రములు-
16 వ శతాబ్ది- నుండీ ఆరంభమై, స్లావేనియా దేశ చరిత్రలో- సుస్థిరమైనవి.
పిల్లలకు పెట్టే పేరుల లిస్టులో ఎక్కువగా ఉన్నదీ అంటే -
"లిపిక" కు - ఈ నామమునకు ఎంత క్రేజ్ ఉన్నదో అవగతమౌతుంది.
నేడు "పందెపు గుర్రములలో మేటివైనవి" గా
మార్కెట్టులో, విపణివర్గాలలో పరిగణించబడ్తూన్నవి.
"లిపిక" - బెన్ హర్ ఇటలీ సరిహద్దులలోను వియన్నా ఇత్యాది
యూరప్ కంట్రీలలో లిపికా తురంగ స్వారీ శిక్షణా కేంద్రాలు పేరెన్నిక గన్నవి.
అనేక పాశ్చాత్య మూవీలలోనూ, టి. వి. షో లలోనూ ఈ అశ్వరాజాలదే అగ్రస్థానం.
;
క్వాడ్రిగా రథాలు :-
ఇవి రోమన్ చారియట్స్, నాలుగు గుఱ్ఱాలు ఈ తేరులకు పూన్చ బడతాయి,
ఈ చతుర్ తురగ రథముల సవారీలు, horse races
ఇంగ్లీష్ హిస్టారికల్ కథావస్తు సినిమాలలోనూ,
టెలివిజన్ షూటింగులలోనూ విరివిగా ఉపయోగించబడినవి.
బెన్ హర్ (Ben Hur, 1953) సినిమా వలన
ఈ లిపికా అశ్వధాటి ప్రపంచ వ్యాప్తంగా గుర్తిపు వచ్చింది.
original home of the snow-white
"Lipizzaner" horses - Slovenia;
Lipica, Slovenia
;
;
ఈ అంశాల విశేషాలు కూడా ఆసక్తిదాయకమైనవే!
The Quadriga was a four-horse chariot
first driven by the Titan god (Link)
2012 A to Z Challenge series : (Link)
konamanini viwes (51544)