శ్రీ కృష్ణార్జున యుద్ధము ; అజిబీధ-పపా విశ్వేసకి(1963) |
; "అజిబీధ- పపా - విశ్వేసకి" -
ఈ పేరు ఎవరిదో గుర్తు పట్టగలరా?
అలనాటి సినిమా శ్రీ కృష్ణార్జున యుద్ధం లోనిది.
శ్రీ కృష్ణార్జున యుద్ధం - లో గీతరచన కూడా వారిదే!
(కె.వి.రెడ్డి సుందరమైన పనితనంతో- పింగళి పద వైచిత్రీ నైపుణ్యాలు తోడైనది.
1963 లో విడుదలైన ఈ తెలుగు మూవీ అద్భుత విజయాలతో నిర్మాతలకు
కాసులపంటలను పండించింది).
ఇలాటి చమత్కార పదాల సృష్టి కర్త వేరెవరో కాదు, పింగళి నాగేంద్ర రావు.
పింగళి పద చిత్ర కవితా విన్యాసాలకు నోచుకున్నట్టి-
మాయాబజార్, పాతాళభైరవి, మిస్సమ్మ-
అలాగ ప్రతి చలనచిత్రమూ ఆణిముత్యము అని
సకలాంధ్ర జనులకూ విదితమే!
"వచ్చిన వాడు అర్జునుడు, ఫల్గుణుడు,
సుభద్రా పరిణయమే ముఖ్య గమ్యము"
బావ శ్రీకృష్ణపరమాత్మ అందదండలు ఉండనే ఉన్నాయి.
ఇక యతి వేషంలో కోటలో పాగా వేయడమెంతసేపు?!
ఔరా! ఆహాహా! ఇంతటి చమత్కార కథ లభిస్తే
గమ్మున ఊరుకుంటాడా మన పింగళి నాగేంద్ర రావు వారు!?
సంభాషణలలో ఆయన హస్తవాసి అమోఘమైనదని నిరూపించేసారు.
* * * * * *
ఇంతకీ పాఠక మహాశయులారా!
"అజిబీధ- పపా - విశ్వేసకి"
ఈ పద నామధేయానికి మూలము ఏమిటో మీరు కనిపెట్టారా?
ఉరుము ఉరిమితే, మెరుపు మెరిస్తే ఫస్టు ఫస్టుగా
ఒక వ్యక్తి పేరును తలుస్తారు. ఏకైక మనిషి నామమది,
"జయమ్" - అనే పేరుతో వేదవ్యాస మహర్షి రచించిన
మహేతిహాసమే మహాభారతము.
మహాభారతములోని పాండవ మధ్యముడు అర్జునుడు.
మేఘాడంబర వేళలలో, సౌదామినీ ఝలక్ ల తరుణాలలో భయం వేస్తే
(పాత రోజులలో లెండి!) గబగబా గభాలున ఉచ్ఛరిస్తారు ఆతని పది పేర్లనీ!
నిజానికి అన్ని పేర్లూ నుడవాలి గానీ,
అత్యధిక ప్రజలకు మొదటి రెండు మూడు పేరులు మాత్రమే నెమరుకు వస్తాయి.
(అర్జున, ఫల్గుణ - పార్ధ, కిరీటి......అంటూంటారు)
తర్వాతి పేర్లన్నీ గాలిదేవుడికన్న మాట!
సరే! మరి ఇప్పుడు అర్జునుని ఎన్ని పేర్లతో పిలిచారు?
కొంచెం పరికించుదము!
1) పార్ధ= పృధా తనయుడు- పార్ధుడు. అలాగే కుంతీ పుత్రుడు "కౌంతేయుడు"(కుంతీ దేవి మొదటి పేరు పృధ- ఆమె దత్తత తీసుకోబడిన పిమ్మట "కుంతీ దేవి" ఐనది)
2) జిష్ణు= ఎవరూ అర్జునిని జయించ లేరు,
3) కిరీటి = ఇంద్రుడు -కిరీటము-ను సుతుని శీర్షమున ఉంచి, అలంకరించాడు.
దగ ద్ధగాజమాన కిరీటము కలిగినందున- "కిరీటి".
4) శ్వేతవాహన= తన రథమునకు తెల్లని రంగు కల గుఱ్ఱములను పూన్చిన వాడు
5) బీభత్స= రణరంగములో శత్రువులను వణుకు పుట్టించే వాడు ;
6) విజయ - విజయము సాధించే వాడు;
7) ఫల్గుణ= ఉత్తర ఫల్గుణ- అనే నక్షత్రమున జన్మించిన వాడు;
8) సవ్యసాచి = కుడి, ఎడమ,-రెండు చేతులతోనూ
బాణములను సంధించే ప్రావీణ్యత అర్జునుని సొమ్ము
9) ధనంజయ= (धनन्जय) = గొప్ప సంపదలను గడించిన విజేత
10) గాండీవి= గాండీవము- అనే నామము కల ధనుస్సు కలిగిన వ్యక్తి అర్జునుడు;
అర్జునుని ఇతర పేర్లని కూడా చూద్దాము.
అర్జున= తెల్లని వాడు
కృష్ణ= నల్లని మేని వన్నె కలవాడు
(కుంతీదేవి, కృష్ణుని పై భక్తితో తన తనయుని "కృష్ణ" అని పిలిచినది)
గుడాకేశ= దట్టమైన కేశములు కలవాడు
కపిధ్వజుడు= రధముపై ధ్వజ చిహ్నము 'హనుమంతుడు'
భారత= కురు వంశ మూలపురుషుడు (scion)
శకుంతలా దుష్యంతుల కొడుకు "భరతుడు"- పేరును అర్జునుడు పొందాడు.
పరంతప= తన ఏకాగ్రతతో రిపులను గెలిచే వాడు
కృష్ణ= నల్లని మేని వన్నె కల వాడు
సన్యాసి గారికి బారసాల చేసారు మన పింగళి వారు.
ఇంకా "పాండవ మధ్యమ, మహా బంధు, పరంగం, కౌంతేయ" ఇత్యాది
సమాస విశేషణ నామధేయాలు అర్జునినికి అనేకము ఉన్నవి.
ఇన్ని పేర్లలో- పది పేర్లను సెలెక్ట్ చేసి
"అజభీదపపావిశ్వేసకీ స్వామి"ని సృష్టించారు
పింగళి నాగేంద్రరావు గారు.
అదీ సంగతి.
అది సరే గానీ, ఆ పేర్ల మొదటి అక్షరాలతో అల్లిన దండ కదా
ఈ మాయా ఋషి 'వరుని' పేరు! పింగళి నాగేంద్ర రావూజీ
అందులో ఇమిడ్చి, ఇరికించిన దశ నామావళి స్ఫురణకు వస్తున్నవా?
ఇప్పుడు చిటికెలో ఆ దశ నామావళినీ పట్టేసారు కదూ!
అవి ఇవిగో, కనండి!
"అజిబీ- ధపపా - విశ్వేసకి" -
10 పేర్లలోని మొదటి అక్షరాల సొగసరి, గడసరి కూర్పు ఇది.
అర్జునుడు, జిష్ణు, బీభత్స, ధనుంజయ (ధనము+ జయము),
ఫల్గుణ, పార్ధ, విజయ, శ్వేతవాహన, సవ్యసాచి, కిరీటి
ఇవీ పింగళి శంఖములో చేరిన తీర్ధ జలములు.
అంతేనా? అంతే కాదు, అర్జున, శ్రీకృష్ణులు-
"నర నారాయణులు" అవతారసంభూతులు.
ఈ ద్వయ నామాలలో "నర/నరుని" అంశయే
సాంప్రదాయం ప్రకారం ఆశ్రమములలో
సన్యాసాశ్రమమును స్వీకరించే అర్హతను పొందిన వారికి
ఋషి/ మఠాధిపతులు నూతన నామమును అనుగ్రహిస్తారు.
పింగళి నాగేశ్వరరావు |
;
;
కానీ పింగళి నాగేశ్వరరావు బలరాముని దుర్గమును చేరి,
గడ్డాలు, మీసాలతో దొంగసన్యాసిగా మారిన అర్జునునికి
సరి కొత్త పేరును పెట్టారు!
చప్పట్లోయ్! చప్పట్లు!!!!!!!!
"అజిబీ- ధ పపా - విశ్వేసకి" - గారికీ జై జై జోహార్లు.
అజిబీధ- పపా - విశ్వేసకి (newAvakAya- web mag)
User Rating: / 1
Member Categories - మాయాబజార్
Written by kadambari piduri
Saturday, 23 June 2012 13:33
;
3 కామెంట్‌లు:
ఈ "అజిబీ- ధ పపా - విశ్వేసకి" అనే పేరు పెట్టినది తానని శ్రీసింగీతం శ్రీనివాసరావుగారు మొన్ననే ప్రచురితమైన ఒక వ్యాసంలో అన్నారు. వారి గురువులు శ్రీ కె.వి.రెడ్డిగారిని గురించి వారి వ్రాసిన వ్యాసం మొన్ననే ఈనాడు వరు ప్రచురించారు.
శ్రీ సింగీతం శ్రీనివాసరావుగారు చెప్పినట్లు-
రాసి ఉన్న - ఆ వ్యాసాన్ని నేనూ చదివానండీ!
ఐతే ఈ "అజిబీ- ధ పపా - విశ్వేసకి"
అంతకుముందే రాసి,పంపినది- వెబ్ పత్రికలో
Saturday, 23 June 2012 13:33 ప్రచురితమైనది,
దానినే నా బ్లాగులో వేసేసాను.
అదనపు పాయింటుగా-
మీరు చెప్పిన ఆ వాక్యాలను నేను బ్లాగించి ఉండవలసి ఉన్నది,
అలాగ సవరణ చేయక -
ఇలాగ కోణమానిని- లో వేసేయడము-
చిన్నపాటి పొరపాటే!
కాబట్టి, మరి కొంచెం ఆలస్యానంతరమైనా- మీ సూచన ప్రకారము,
చిన్న మార్పులను వేస్తాను.
శ్రద్ధాసక్తులతో-
సలహాలను సూచించిన మీకు నా కృతజ్ఞతలు శ్యామలీయగారూ!
;
కామెంట్‌ను పోస్ట్ చేయండి