30, సెప్టెంబర్ 2011, శుక్రవారం

“అక్షరార్చన” సాహిత్య వ్యాస సంకలనము

వైజయంతి మాలిక
“అక్షరార్చన” 
ప్రాచీన సాహిత్య వ్యాస సంకలనము,
36 వ్యాసముల రత్న మాలిక. 
పాటిబండ మాధవ శర్మగారి 
షష్ఠి పూర్తి సన్మాన సంచిక ఇది. 


ఈ పొత్తములోని వ్యాసముల జాబితా:-


1) సాహితీ సంపత్తిః (జమ్ములమడక మాధవరామశర్మ );
2) ప్రమేయము-ప్రమాణములు(డా. ధూళిపాళ శ్రీరామమూర్తి);
3) సంస్కృత వ్యాకరణంలో మహేంద్ర మహేశ సంప్రదాయాలు 
                                   (శ్రీ ఎస్.పి.ఎస్. వేంకటేశ్వరాచార్యులు);
4) మేఘ దూతకు రామాయణంతో ఉన్న సంబంధం;
5) కాటయ వేముడు-కవ్వడి:- (శ్రీ చెలమచెర్ల రంగాచార్యులు)
6) బాలసరస్వతి- తిరుమల బుక్కపట్టణం శ్రీవాసాచార్యులు:- 
                                             ఆచార్య డా.బి. రామరాజు;
7) The Name of the Sanskrit Poetics :- Dr. P. Sriramachandrudu;
8 ) రసము – లోకము :- (డా. తుమ్మపూడి కోటేశ్వరరావు);
9) రసము – కెథార్పిస్ :- ఆచార్య డా. కాకర్ల వెంకటరామనరసింహము;
1). Riti and Guna :- (Dr. P. G. Lalye);;
11) శ్రీ మహా భారతమున వేదవ్యాసుడు:- (డా. కేతవరపు రామకోటిశాస్త్రి);
12) ఉదంకుడా? ఉదంకులా? :- ఆచార్య శ్రీ ఖండవల్లి లక్ష్మీ నిరంజనం;
13) నన్నయ యతి ప్రాసలు:- నిడదవోలు వేంకటరావు ;
14) ఎఱ్ఱాప్రెగడ నృసింహ పురాణమునకు మూలము:- (డా. యశోదా రెడ్డి) ;
15) హంస డిభకోపాఖ్యానము – సంవిధాన శిల్పము :- (డా. జి. వి. సుబ్రహ్మణ్యం);
16) వీరభద్రవిజయము – ప్రకృతి వర్ణనలు :- ( శ్రీ పి. వి. చలపతిరావు) ;
17) పారిజాతాపహరణ ప్రబంధ రచనా కాలము :- (డా. పల్లా దుర్గయ్య) ;
18) మన సంకీర్తన భాండాగారము :- (డా. వేటూరి ఆనందమూర్తి) ;
19) శ్రీ శివ శంకరుల పద్య నాటికలు :- ( శ్రీ నోరి నరసింహమూర్తి) ;
2). అమర సింహ చరిత్రము :- ( శ్రీమతి వి. సీతా కళ్యాణి ) ;
21. బ్రహ్మశ్రీ పోకూరి కాశీపత్యావధానులు గారు :- ( డా. హరి శివకుమార్) ;
22. ఆంధ్ర విమర్శ వాఙ్మయము :- (ఆచార్య డా. దివాకర్ల వేంకటావధాని) ;
23. సాహిత్యము – యాదార్ధ్యము :- (శ్రీ ఇరివెంటి కృష్ణమూర్తి ) ;
24. అపవాదు :- (శ్రీ కొత్తపల్లి శ్రీ ఆంజనేయ శర్మ ) ;
25. హాస్యము – గురజాడ :- (శ్రీ ఎల్. మోహన్) ;
26. కవిత్వ తవ విచారము :- (శ్రీ ఎస్వీ. జోగారావు);
27. వర్తమాన సాహిత్య విమర్శ: పరికరాలు, ప్రమాణాలు :- ( డా. అడపా రామకృష్ణరావు ) ;
28. మాండలికాలు :- (శ్రీ పోరంకి దక్షిణామూర్తి );
29. తెలుగులో ‘ అని ’చేసే పని :- ( డా చేకూరి రామారావు );
30. తెలుగు భాషలో మార్పులు-చేర్పులు :- డా. శ్రీ మతి నాయని కృష్ణకుమారి ;
31. ఆదికవి పంపడు – :- (శ్రీ ఎం. ఎన్. మహాంతయ్య ) ;
32. హిందీలో లక్షణ గ్రంధాలు :- ( డా. భండారం భీమసేన జ్యోస్యులు ‘నిర్మల్ ’) ;
33. ప్రసన్న కుసుమాయుధము :- ( శ్రీ కె. శ్యాం ప్రకాశ రావు ) ;
35. శ్రీ పాటిబండ మాధవ శర్మ గారి రచనల విశిష్టతలు :-
౧] అనువాదములు – వ్యాఖ్యానములు :- ( డా. హరిశివ కుమార్ )
౨] రాజ శిల్పి – ఇంద్రాణి :- శ్రీ ఎల్. చంద్రమోహన్
౩) చారుణి :- (శ్రీ ఉత్పల సత్యనారాయణాచార్య )
౪] ఆంధ్ర మహాభారతము – ఛందశ్శిల్పము :- ( డా. జి. వి. సుబ్రహ్మణ్యం ) ;
36. కవితా నీరాజనము:- ( ప్రముఖ కవులు)


ఈ గ్రంథములోని పరిజ్ఞానమునకు మచ్చుతునకగా 
ఒక వ్యాసమును గమనించుదామా? 
డాక్టర్ హరి శివకుమార్ విపుల సోదాహరణ వ్యాసములోని 
ఈ అంశమును గమనించండి! 
“అక్షరార్చన” లోని ప్రతి అక్షరమూ 
సుధా రస బిందు తుల్యానుభూతికి యోగ్యత కలదేనని బోధపడుతుంది. 


ద్వాదశ రాసులను, అంశములను ఆధారముగా చేసుకొని 
పోకూరి కాశీపత్యావధానులు రాసిన పద్యంలో చిత్రితమైన చమత్కారము.


“ఆమె కన్య” కాబట్టి-  కవి, కన్యా రాశి నుండి ప్రారంభించిన వర్ణన ఇది.


“పై గేరి నొక యింటి పడుచు నీ యెలనాగ;
యందంబుచే సిగ్గు నొందఁ జేసి
దాని మూడవ యింటి దానిని బొమలచే;
వంచె నాల్గవ యింట మించు దాని;
జంఘలచే గుల్ల సలిపె నైదవ యింట;
గల దానిఁ జనులచే వెలితిఁ జేసె;


నాఱవ యింట బరగు దానిఁ
గౌనుచే నోరుఁ దెరిపించెఁ గడమ వాటి
నెదురఁ బని లేదు గాని తొమ్మిదవ యింటి
దాని కెనగాక నీ కేలు బూనదలఁచె.”


“సిద్ధయోగి చరిత్రము” 
తారక, సాంఖ్య, అమనస్కాది యోగములు ఉన్నవి. 
వేదాంత పరమైన ఈ పొత్తములో – భాగవతములో ఎన్నెన్ని పోకడలు ఉన్నాయో 
అన్నన్ని రకాల పోకడలు ఉన్నవి. 
అందుచేతనే “సిద్ధయోగి చరిత్రము”నకు 
“పిల్ల భాగవతము” అని ప్రసిద్ధి వచ్చింది. 
బ్రహ్మశ్రీ బిరుదాంకితులు పోకూరి కాశీపత్యావధానులు 
రచించిన “సిద్ధయోగి చరిత్రము” 
అయిదు ఆశ్వాసముల కావ్యము. 


“సిద్ధయోగి చరిత్రము” లో కథానాయిక గూర్చి చేసిన 
ఊహా కల్పనకు అద్దం పట్టిన ఈ పద్దెము పోకడలను చూడండి.


సిద్ధుని భార్య అచ్చాంబీ దేవినివసిస్తూన్న 
ఊరు చాలా గొప్పది. 
అందులోని స్త్రీలు బహు సౌందర్యరాసులు. 
అందులోనూ- అచ్చాంబీ దేవి ఉన్నట్టి వీధికి – 
పై వీధిలో ఉన్నవారు అందగత్తెలు; 
అచ్చాంబీ దేవి:- 
ఆ వీధిలోని మొదటి యింటిలోని సుందరిని 
సిగ్గు పడేటట్లు చేసినది. 
దాని మూడవ ఇంటిలోని దానిని- 
అచ్చాంబీ దేవి తన కనుబొమ్మలచే ఓడించినది. 
నాలుగవ గృహములోని వనితను- 
అచ్చాంబీ దేవి తన జంఘలచే ఓటమిపాలు చేసినది. 
ఐదవ ఇంటిలోని పడుచును- 
అచ్చాంబీ దేవి తన స్థనములచే వెలితి పడేటట్లుగా చేసినది. 
ఆఱవ ఇంట ఉంటూన్న యెలనాగను, 
తనకు పై వారి ఇంటిలో కలిసేటట్లు చేసినది అచ్చాంబీ దేవి. 
పదకొండవ (పదునొకండవ) నివాసములో ఉన్న అతివను- 
అచ్చాంబీ దేవి తన కౌను/ మేనుచే ఓటమిపాలు చేసినది.
తక్కిన ఇళ్ళలో ఉన్న వారలు- 
ఏమంత సొగసులు లేనివారలు- 
కానీ…. ఆ ఒక్క తొమ్మిదవ ఇంటిలోని అచ్చాంబీ దేవిని మాత్రము జయించజాలక
సిద్ధని వివాహం చేసుకొనడానికి పరిణయం చేసుకొనగా-
ఆమె నీ కేలు పట్టుకొన నిశ్చయించినది.
ఈ భావము మన జ్యోతిష్య శాస్త్ర బద్ధ ద్వాదశ (12)రాసులకు అన్వయిస్తూ 
కవికి గల అగణిత విజ్ఞాన పరిచయములకు తార్కాణముగా నిలుస్తూన్న 
ఈ పద్యము :- 
5 వ ఆశ్వాసములోని 62 వ పద్యరత్నము. 
ఇప్పుడు కవి కలము చేసిన ఆ అన్వయ చమత్కారములను పరికించుదాము.


భావ విపులీకరణ:-
అచ్చాంబీ దేవి పెళ్ళి కావలసిన కన్య.
కాబట్టి కవి ఇక్కడ- అక్కడి నుండే ఆరంభించిన వైనం ఇది.
1) మొదటి ఇంటిలోని “కన్య” ను – అచ్చాంబీ దేవి తన అందముచే సిగ్గిలజేసినది.
2) దానినుంచీ- మూడవ రాశి ఐనట్టి “ధనుస్సు”ను – 
అచ్చాంబీ దేవి తన కనుబొమ్మలచే వంగిపోయేట్లు చేసినది.
3) నాలుగవ ఇంట నుండు “మకరము”ను జంఘలచే గుల్ల చేసెను; 
    అనగా మొసలి పై భాగము గుల్ల గుల్లగా ఆయెను.
4) అయిదవ ఇంటి దానిని చనులచే/ స్థనములచే వెలితిపడజేసెను.
5) ఆరవ రాశి మీనరాశి. అచ్చాంబీ దేవి తన కనుగవతో- 
చేపను (వారి=)జలములలో కలియఁ జేసినది.
6) పదకొండవది “సింహ రాశి”. 
ఆమె సింగమును తన కౌను చేత నోరు తెరిపించినది. 
తక్కిన రాశులను గురించి వేరే చెప్పనక్కరలేదు గాని,


ఒక్క తొమ్మిదవ రాశి ఐనట్టి “మిథునము” ను ఓడించలేక పోయింది ఆవిడ. 
అందుకనే ఆ అచ్చాంబీ దేవి:-
" మిథున రాశి పైన సైతము – గెలుపు సాధించి తీరెదను” 
అనే దృఢసంకల్పముతో ఒక నిర్ణయాన్ని తీసుకున్నది-
అదే “సిద్ధా! నీ కేలును పట్టుట (= వివాహం చేసుకొనుట)” 
మాచర్లలో నివాసి - బ్రహ్మశ్రీ పోకూరి కాశీపత్యావధానులు గారి 
అముద్రిత గ్రంథములూ, 
ఇతర వివరాలతో పాటు పాఠకులకు అందించిన 
ఇట్టి వ్యాస రత్నాలతో సమకూర్చిన పొత్తము ఈ “అక్షరార్చన”.


ఈ పుస్తకం – 328 పేజీలతో, 
సారస్వత దిగ్గజములు అందించిన అద్భుత వ్యాస సంకలనము. 


ఎడిటర్స్:- 
దివాకర్ల వేంకటావధాని ,
పల్లా దుర్గయ్య, 
డా. జి.వి. సుబ్రహ్మణ్యం 
సంపాదక వర్గము ఈ అమూల్య సంకలనాన్ని వెలువరించినారు.


The Secretary,
Dr.P. Madhava Sarma shahithi Puthi Sanmana Sangham,
SriVani; 1-8-702/105 ;
Nallakunta, Hyderabad- 50044
Pub:- 1972, price:- 20/- ;


***********************************


“అక్షరార్చన” సాహిత్య sept, 2011 


 పుస్తకం » తెలుగు, పతాక శీర్షిక, పుస్తక పరిచయం, వ్యాసాలు
“అక్షరార్చన” సాహిత్య వ్యాస సంకలనము
17 SEPTEMBER 2011 93 VIEWS 
రాసిన వారు: పి.కుసుమ కుమారి
;

28, సెప్టెంబర్ 2011, బుధవారం

70 కథలు,"శుక సప్తతి", పాల వేకరి కదిరీపతి


"శుక సప్తతి" తెలుగు సేత కర్త - 
పాల వేకరి కదిరీపతి - ఇంటి పేరు, ఊరు, సీమలు :- 


ప్రాంతాలను , సీమలను, దేశాలనూ 
పరిపాలించిన వ్యక్తులే,  
మహా పద్య, వచన కావ్యాలను వెలయింపజేయడం గొప్ప విశేషమే!
కరవాలమును పట్టిన చేతితోనే, 
ఘంటం కూడా చేత పట్టి, 
రచనలు చేయడం మాననీయము.
అతి ప్రాచీన కాలం నుండీ- 
చక్రవర్తులు, తత్ అధికార గణములోని వారూ- 
అనగా మంత్రి, సేనాధిపతి ప్రభృతులు 
కవులుగా కూడా తమ జీవిత పరమార్ధ భాగ్యాలను  
ఇబ్బడి ముబ్బడిగా ఇనుమడింపజేసుకోవడం జరిగింది.


రాజకవులు గణనీయ సంఖ్యలో పరిఢవిల్లి, 
మన దేశ చారిత్రక గగనాన్ని, 
మనోజ్ఞ భాషా ప్రాభవములతో 
పరిపూర్ణమైన కావ్య కాంతి కిరణముల 
తేజో యశస్సులను ఆర్జించి, నింపినారు.
మనకెంతో గర్వకారణమైన కవి చక్రవర్తుల, 
రాజకీయ రంగములోని కవుల పట్టిక పెద్దదే ఔతుంది.
తప్పకుండా ఈ కోణంలోని 
ఈ విశేషం గిన్నిస్ బుక్ రికార్డులలో తలమానికమౌతుంది.
కాబట్టి, చరిత్ర, సాహిత్య అభిమానులు- 
ఈ లిస్టును సోపపత్తికంగా సమర్పిస్తూ-  
గిన్నీస్ రికార్డ్ లో స్థానం సమకూర్చే  మహత్కార్యము 
పరిశోధకులకు గొప్ప పనియే ఔతుందనడంలో సందేహం లేదు.
సరే! ప్రస్తుతం ఒక రాజ కవిని గమనించుదాము. 
పాల వేకరి కదిరీపతి మహా రాజు అలాటి రచయిత.
సంస్కృతంలో ప్రసిద్ధి కెక్కినది 
"శుక సప్తతి" అనే శృంగార కావ్యము.
అద్దానిని పద్య ప్రబంధముగా, 
తెలుగులో 
మొట్టమొదటి అనువాదం చేసిన కీర్తి- 
శ్రీ పాల వేకరి కదిరీపతి కి దక్కినది.
పంచదార పలుకుల రామ చిలుకమ్మ- 
కథానాయికకు వరుసగా ప్రతి రాత్రీ వివరించినట్టి 
70 కథలు మించి - ఉన్నవి.
10 వ శతాబ్దానికి మున్నే లోకవ్యవహారంలో ఉన్నవి - 
గ్రంథస్థములైన కథారూపాలను సంతరించుకున్నవి.    
పాల వేకరి కదిరీపతి ఎవరు? 
ఈయన ఎప్పటి వాడు? ఇత్యాది విషయాలు- 
అనేక క్రొత్త సంగతులను ఆవిష్కరించినవి.
1-20, 21 పద్యలలో 
"... భోగసుత్రాముడు తాడిగోళ్ళ పుర ధాముడు 
శ్రీ పెద యౌబళుండిలన్"
1) వీరి ఇంటి పేరు మొదట- పాల వేకరి. 
     పెద ఔబళ రాజు- తాడిగోళ్ళ నగరమును చేరిన నాటినుండి- 
   "తాడిగోళ్ళ" వారైనారు.
2) ఆశ్వాసాంత గద్యలు- అన్నింటిలోనూ - 
    రెండు గృహనామములు కూడా వ్రాసాడు 
    కవి పాల వేకరి కదిరీపతి.
3) "అచ్యుత గోత్రుడను, చంద్ర వంశ క్షత్రియుడిని" అనినాడు.
             కంఠోక్తిగా వక్కాణించాడు. 
4) మూల పురుష గౌరవ స్థానమును అందుకున్న 
    పెద ఔబళ రాజు నుండి క్రమేణా- 
    వారి వంశ క్రమమును వర్ణించినాడు పాల వేకరి కదిరీపతి.


అ] పెద ఔబళ రాజు  తనయుడు - 
ఆ] నారపరాజు; 
           ఈతనికి తొమ్మిది మంది కుమారులు.
వారిలోని ఒకడు- 
ఇ] ఔబళరాజు, పత్ని బాలమ్మ.
వీరి పుత్రుడు:-  ఈ] కరె మాణిక్య రాజు- కు నలుగురు భార్యలు.
వీరికి నలుగురు సుపుత్రులు.
వీరిలోని రెండవ వాడైన - 
ఉ] రామ రాజు యొక్క తనూజుడు [ఊ] రఘునాథ రాజు.
అలాగే- నాలుగవ వాడు [ఋ] కదుర రాజు- యొక్క కుమారుడు [ౠ] "వెంకటాద్రి".
ఆరవ తరము  (6 th generation) వాడే - 
మన కృతికర్త ఐన పాల వేకరి కదిరీపతి.
ఇలాగ సంశయం లేకుండా, పాల వేకరి కదిరీపతి - 
కృత్యాదిలోనే విపులంగా వక్కాణించినాడు.
శ్రీకృష్ణ దేవ రాయలు పాలనాధికార వారసుడు - 
తరువాతి తరములలో - అళియరామరాయలు.
అళియ రామ రాయలు- కొనసాగించిన జైత్ర యాత్రలలో- 
పాల్గొన్న వీరుడు పెద ఔబళ రాజు.
అందువలన అళియ రామ రాయలుకు- 
పెద ఔబళ రాజు సమకాలీనుడు.

శ్రీకృష్ణదేవరాయలు - విజయనగర సామ్రాజ్యాన్ని
మూడు భాగాలుగా విభజించి, మువ్వురికి ఇచ్చాడు.
త్రిలింగదేశము:- "పెనుగొండ" రాజధానిగా 
శ్రీరంగ దేవరాయలు స్వీకరించాడు.
కన్నడ ప్రాంతము:- "శ్రీ రంగ పట్టణము" 
 రాజధానిగా "రామదేవరాయలు" గైకొన్నాడు;
ఈతని పేరోలగములోని వాడు, మరియూ 
సామ్రాట్టుకు "సరి గద్దె నెక్కిన గౌరవాలను" పొందిన వ్యక్తి - కరె మాణిక్యరాజు.
ఈ పాలనా కాలము 1618- 1630.
(చంద్రగిరి- కేంద్ర పట్టణంగా 
తమిళ ప్రాంతాధిత్యాన్ని నెరిపిన మూడవ వాడు వెంకటపతిరాయలు.)
వీరి పాలనాకాలము నాడు జరిగిన కొన్ని తిరుగుబాటులను అణుచుటలో - 
తాడిగోళ్ళ రామరాజు విశేష సహాయం, తోడ్పాటు ఉన్నవి.
రామరాజు మనుమడు, శుక సప్తతి కావ్య రచయిత ఐన పాల వేకరి కదిరీపతి.
ఇతను 17 వ శతాబ్దం ఉత్తరార్ధములో - 
సాహితీ కృషీవలత్వం చేసాడు.


తాడిగోళ్ళ :-
 పాల వేకరి కదిరీపతి నివాస స్థలము, 
తిరిగిన ప్రదేశ వివరాల గూర్చి జిజ్ఞాస సహజము.
ఆ) పాల వేకరి కదిరీపతి ధామము నామము “తాడి గోళ్ళ”. 
నేడీ తాడిగోళ్ళ ఒక కుగ్రామము.
కడప జిల్లాలోని నేటి - తాడిగొట్ల- కావొచ్చునని ఊహ.
తాడిగోళ్ళ పురము - 
కోలారు మండలములోనిది- అని వాదము ఒకటి.


కదిరి కోవెల 







కదిరి:- వీరి ఇలవేల్పు "కదిరినరసింహమూర్తి"..... ఆ నాడు కదిరి మండలము- అనంతపురము దక్షిణ భాగం నుండి - 
మైసూరు రాజ్యంలోని "శివ సముద్రము" దాకా వ్యాపించినది.
పెద ఔబళుడు ఏలికగా 
"కదెరాకమున "తెర్క" మొదలుగా కలిగిన ............. "
తెర్క ప్రదేశము :- కావేరీనదికి ఉపనది - గుండ్లు నది.
గుండ్లుపేట తాలూకాలో - "తెరకణాంబె" అనే పల్లె ఉన్నది. 
త్రికంబరి ఈశ్వరి కోవెల ఈ ప్రాంతాల ప్రసిద్ధి ఐన మహిమాన్విత దేవళము.
తెర్కణాంబె- యే – “తెర్క”ఐ ఉండవచ్చును.


శుకసప్తతి కావ్యములోని ఊళ్ళకు  ఆధారములుగా 
కొన్ని పద్దెములు  :-

ఉత్పలమాల:-
ఆ రసికావతంసకుల మాతృ సముద్భవ హేతుభూతమై
ధీరతఁ బాలవెల్లి జగతిం దగె దన్మహిమం బపారగం                    
భీర ఘనాఘ సంభరణ భీమ బల ప్రతిభాప్తిఁ గాంతు నం
చార యఁ బాలవేకరి కులాఖ్య వహించె ను సుదంచితోన్నతిన్.
                                                                      [1-20]
ఉత్పలమాల:-
ఆ మహితాన్వవాయ వసుధాధిపు లచ్యుత గోత్రపాత్రులు
ద్ధామ భుజా పరాక్రమ విదారిత ఘోర మదారి వీరులౌ
భూమి భరించి రా నృపుల భూతి మహోన్నతి నేలె భోగ సు
త్రాముడు తాడిగోళ్ళ పురధాముడు శ్రీ పెద యౌబళుండిలన్.       [1-21]

ఇదీ శుకసప్తతి కావ్యములోని ఊళ్ళకు  ఆధారములు.
ఇక పాల వేకరి కదిరీపతి స్వయంగా గొప్ప కవి.


సీస పద్యము:-
కావ్య నైపుణి శబ్ద గౌరవ ప్రాగల్భ్య
             మర్ధావనాసక్తి యతిశయోక్తి
నాటకాలంకార నయ మార్గ సాంగత్య
      సాహిత్య సౌహిత్య సర సముద్ర
సకల ప్రబంధ వాసన సువాక్ప్రౌఢిమా
న్విత చతుర్ విధ సత్కవిత్వ ధాటి
లక్ష్య లక్షణ గుణ శ్లాఘ్యతా పటిమంబు
నైఘంటిక పదానునయని రూఢి."

గనిన నీకు నసాధ్యంబె గణుతి సేయ
ధాత్రి శుకసప్తతి యొనర్పఁ దాడిగోళ్ళ
ఘన కులకలాప “కదురేంద్రు కదుర భూప” 
చెలగి వాక్ప్రౌఢిచేఁ గృతి సేయుమవాణి.

పాల వేకరి కదిరీపతి విద్వత్ కవి; రక్షణానుసంధాయకుడే కాదు,
తానే స్వయంగా ఘంటమును చేపట్టి, కావ్య రచన చేయగల మేధావి.
కనుకనే పాల వేకరి కదిరీపతి 
సంస్కృత – శుకసప్తతి – ని ఆంధ్రీకరణ చేయగలిగాడు.
కళాత్మకంగా తెలుగున “శుకసప్తతి”ని తీర్చిదిద్దిన, 
ఈ ప్రయత్నంలో ప్రథమ తాంబూలం పొంది, 
అటు చరిత్రలోనూ, ఇటు కావ్య చరిత్ర పేరోలగములోనూ 
ప్రత్యేక స్థానాన్ని గడించిన రాజ కవి ధన్యుడు.                                     

$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$


;
;

27, సెప్టెంబర్ 2011, మంగళవారం

వైవిధ్య భరిత వీణలు


రాగ వీణ 


విద్యల దేవత శ్రీ సరస్వతీ దేవి వాయిద్యము 
“కచ్ఛపీ వీణ”. 
కచ్ఛపి – అనగా “తాబేలు డిప్ప”. 
ప్రాచీన కాలాన మన హిందూ దేశంలో కూర్మము డిప్పకు తీగలను బిగించి, 
తంత్రీ వాయిద్యాన్ని తయారు చేసారన్న మాట!

హైందవ సంస్కృతిలోని అవినాభా సంబంధం కలిగి ఉన్నది వీణ – 
ఆది వాయిద్య పరికరము, 
ప్రపంచ తంత్రీ సంగీత పరికరాలకు మూల రూపిణి. 
శృతి సుభగమైన స్వరాలను 
నెలకొల్పిన ఘనత వీణదే! 
కాబట్టి శ్రీ వాణి ఆప్యాయంగా మీటే వాయిద్యంగా – 
సుస్థిర స్థానాన్ని సముపార్జించినది.
(కన్నడము- ವೀಣೆ )
(Tamil: வீணை)
ప్రజలు సరస్వతీ దేవి ని అర్చన చేసేటప్పుడు 
ఆ పూజా విధానాలను సొగసుగా 
మన “వీణ”కూడా "వర వీణ"గా అందుకున్నట్లే కదూ! 
తద్వారా సంగీతాది లాలిత్య కళలూ, విద్యలూ కూడా పూజ్యనీయాలు ఐనాయి, 
ఈ పరిణామం మన దేశ సంస్కృతికి ఒక విభిన్నతను సమకూర్చినాయి.


ఇలాటి ఘనతను గడించిన వీణియలలో 
అనేక నవ్య స్వరూపాలను గడించి, 
శతాధిక నామావళితో చారిత్రక స్థానాన్ని పొందాయి.


కల్హార వాసిని, వర వీణా మృదుపాణి ఐన 
శ్రీ శారదా దేవి 'కచ్ఛపి' – శ్రీ కూర్మము యొక్క పై డిప్ప కాయను 
వీణ ఒళుసుగా మలచబడినదని చెప్పుకున్నాము కదా!


వీణలోని భాగాలు:


1. ప్రవాళము = వీణ ఒళపు 
(Tha Neck of Lute)  ;


2) కకుభము / ప్రసేవకము =  కరివె 
(The Belly below the Neck of Lute) ;


3) కోలంబకము = వీణ తంత్రి, ఒళగు 
మొదలైన మొత్తము (The Body of Lute);


4) ఉపవాహము = నిబంధనం = 
వీణా తంత్రులు కట్టబడు చోటునకును మరియు బిరడాలను 
కలిపి పిలిచే పేరు ; (The Tie);


5) కోణము = కొడుపు (Bow) - వీణ వగైరాలను వాయించే కొడుపు, 
దీని సామాన్య నామమే – కోణము.


వీణకు పర్యాయ పదాలు అగణితాలు. 
వీణ, వీణియ, వల్లకి, విపంచి, తీగలు బిగించబడిన వాటిని 
తంత్రీ వాయిద్యాలు – అంటారు. 
సితార, ఏక తార, గిటారు మున్నగునవి. 
వీణాది తంత్రీ వాద్యాల నుండి వెలువడే స్వరాలకు 
సాహిత్యంలో అందమైన పర్యాయ పదాలు ఉన్నవి. 
క్వణము, నిక్వణము, నిక్వానము; 
ఉదాహరణకు – వీణా నిక్వణము. 
ఇలాగే ప్రక్వణము, ప్రక్వాణము ఇత్యాదులు 
వీణా ధ్వనుల వైవిధ్య సూచిత పద వల్లరి.


మన సంగీత ప్రపంచానికి ( ప్రపంచ సంగీతానికి కూడా ) పునాదులు 
సప్త స్వరములు వీణ తొండము నుండి  
వీణ  కంఠమునందు దాకా ఉద్భవిస్తూ, విస్తరిస్తూ ఉండే 
ఈ స్వరములే సప్త స్వరములు స-రి-గ-మ-ప-ద-ని-స - లు. 
వీనికి స్వభావ స్వరూపాలను అనుసరించి, 
పరివ్యాప్తిలో ఉన్న పేర్లను గమనించండి. 
అవి - షడ్జమము, ఋషభము, గాంధారము, 
మద్యమము, పంచమము, దైవతము, నిషాదము. 
ఈ ధ్వనుల సారాంశమును గురించిన చర్చలు 
ఎంతో విపులీకరతను ఆశిస్తూ, 
సంగీత శాస్త్రజ్ఞులకు మరెంతో ఆప్యాయకరమైనవి.


ఇక వీణా వాయిద్యాన్ని గురించి కొంచెము పరిశీలింతము. 
పాల్కురికి సోమనాథుడు తన "బసవ చరితము"లో 
అనేకానేక వీణలను నామములతో ప్రస్తావించెను. 
పరమేశుడు కైలాసములో, 
తన భక్తులు వాయిస్తూన్న 
అనేక రకాల వీణా నాదాలను వింటూ 
ఆనందించిన నాదలోలుడు.


వీణలు:- 


1. రావణ హస్తము; 2. బ్రహ్మ వీణ; 3. కైలాస వీణ; 
4.ఆకాశ వీణ; 5.పినాక/కి వీణ; 6. సారంగ వీణ; 
7.కూర్మ వీణ; 8.స్వాయంభు వీణ; 
9. గౌరీ వీణ; 10. కిన్నెర వీణ;


భక్తులు ఈ వీణా వాదనంలో 
ఒక సారి వాయించిన దండెలను మార్చి, 
కొత్త రాగాలతో సంగీత అర్చన చేస్తూన్నారు.


1.మొగచాళము; 2.నవరాణము; 3.సవఠాణము; 
తాళ పట్టి; 4.కత్తరి; 5.సారణి - వంటి రాగాలు
వాతావరణాన్ని మనోజ్ఞ భరితముగా, హృద్యంగమంగా చేస్తూన్నవి.
ఈ రాగాలతో 
"సకలేశ! నిత్య కళ్యాణి, అవధరించవయ్యా! 
ప్రాణ నాయక! నాద మూర్తి!..... " 
అని రాగం పలికిస్తూ ఉండగా, 
దానికి తగిన తాళానికి అనుగుణముగా సప్త స్వరాలలో 
"ఇరవై రెండు శృతులలో" ప్రభవిల్లుతూన్నవి.


అలాగ కూర్చిన శృతుల తగిన తాళానికి అనుగుణముగా 
సప్త స్వరాలలో"ఇరవై రెండు శృతులలో" ప్రభవిల్లుతూన్నవి. 
అలాగ కూర్చిన శృతులలో 
"నారాటకావుళము" అనే ఘనతర రవము , 
"చౌ దళము"అనే శరీరముతో 
అనిబద్ధ రీతిలో సంధించి,గమక సప్తకము పలికేటట్లు, 
మంద్ర, మధ్య, తారా స్థాయిలలో ఉత్పత్తి ఐనవి.
అలాంటి తారా స్థాయిలతో - "లయ" ను తప్పనీయక, 
శుద్ధ సాళగములు రూపొందే విధముగా - 
దేశి మార్గ సాంప్రదాయాలతో నవ్య గతులు వచ్చినవి. 
అవి - "ద్రుత, మధ్య, తాళ మాన గతులను" చూపుతూ సాగినవి.


ధాతుల సంగతులను, జాతుల రీతిని గూర్చి 
నిబద్ధ రూపంలో వైళము, తాళము, సాళి, వెళ్ళావెళ్ళ, 
జాయానుజాయి, సంచితము, పంజళము, ఖచరము, 
విషమము, గ్రహ మోక్షణము, భజవణి, రవణి, భరణి, మిఠాయి, 
నిజవణి, నివళము, నిచయము, వైధసము, నిగతి, 
సుధాయి, సన్నిహితము, మిశ్రమైన గ్రహ త్రిత్రయము, 
అంశుక లలిత గాఢము, రాగ కాకువు, గాఢము, 
దేశికాకు, సింధు, కరుణాకాకు, నఖకర్తరి, హళువాయి, 
దరహర, సమవాయి,గుండాగుండి,  భ్రమర లీల, గురుడి, 
మోడామోడి, పొరిరవాళము, అక్షాయి హొయలు, 
"రిక్ఖల విళగు చొక్కాయి" మొదలైన ఠాయములు  వెలువడిన 
“నాద జగత్తు” అక్కడ వెలసి, 
ప్రేక్షకుల శ్రవణ, వీక్షణాది పంచేంద్రియాలతో పాటుగా 
సర్వేంద్రియాలనూ మిరుమిట్లు గొలిపించినది.


దేశాక్షి, ధన్వాసి, దేశి, మలహరి, సకల రామ క్రియ, 
లలిత సాళంగ, నాట, గుజ్జరి, మేఘరంజి, వేళావుళి,
చిత్ర వేళావుళి, మాళవి, సిరి, వరాళి, కాంభోజి, 
గౌళ పంచకము,బంగాళ గురిజ, భైరవి ద్వయం, 
నారంగబడ పంజరము, గుండ క్రియ, కౌశిక, 
దేవ క్రియ, మధ్యమావతి, తోడి, యావసతము మున్నగునవి – 
స్త్రీ రాగ, పురుష రాగములు.


ఇంతటి సువిశాల సంగీత ప్రపంచాన్ని 
తన ప్రబంధంలో విపులీకరించిన సోమనాథుని వంటి మహా సంగీతజ్ఞుడైన కవి, 
"బసవ చరితము" రచయిత పాల్కురికి సోమనాథుడు 
మన తెలుగువాడు అవడము మనకెంతో గర్వ కారణము కదా!


ఆధునిక కాలంలో వీణ:-


ఆధునిక కాలంలో కూడా వీణియది సర్వోన్నత స్థానమే! 
ఈమని శంకర శాస్త్రి, చిట్టి బాబు మున్నగు వారు భ్రమర గీతము, 
కోకిల నాదములు, బృంద వాయిద్య రచనలతో వీణా నాద మాధుర్యాన్ని 
పాశ్చాత్య మ్యూజిక్ జగతికి పరిచయం చేసి, 
వారిని మంత్ర ముగ్ధులను చేసారు.


వీణా వాయిద్యానికి సోదరీ మణులుగా పేర్కొనదగినవి – 
సితార, గిటార్, తంబురా మున్నగునవి.
సంగీత ప్రపంచములో ‘గ్రామీ అవార్డు’
అత్యుత్తమమైనది. 
1968 లో యెహుదీమెనూహిన్ తో కలిసి, రూపొందించిన 
“East meets West”  అనే ఆల్బమ్ కు గ్రామీ అవార్డ్ లభించినది.


అలాగే 1994 లో గ్రామీ అవార్డు విశ్వ మోహన భట్  కు లభించినది. 
“మోహన వీణ” ను  కనిపెట్టిన వ్యక్తి ఈయన. 
గిటార్ విద్వాంసుడైన విశ్వ మోహన భట్ సృజించినట్టి 
“మీటింగ్ బై ది రివర్”(“Meeting by the River”) 
అనే ఆల్బమ్ నకు Grammy award దక్కినది.


పాశ్చాత్య ప్రజలకు మన ఇండియా లోని  
సాంప్రదాయ సంగీత శ్రావ్యత గురించి 
ఆసక్తి కలుగుటకు అది ప్రథమ సోపానము. 
Western Music World నకు 
మన హిందూ దేశ సంగీతములోని 
సున్నిత మాధుర్య పరంపరల యొక్క ఔన్నత్యాన్ని పరిచయం చేసి, 
వారికి ఆ అంశముపై అవగాహనలను కలిగేట్లు చేసినది. 
వీణా నాద స్వరాలు ఎంతో శ్రవణపేయమైనవి. 
కావుననే సాహిత్యం:- లో 
భావ వీణ, రాగ వీణ, మనో వీణ, హృదయ వీణ ఇత్యాదిగా 
అనుపమానమైన, అద్వితీయ స్థానాలను పొందినవి.


అనేకానేక సినిమాలలో వీణ మీద పాటలు, 
బ్యాక్ గ్రౌండ్ లో వీణా నాద సృజనలతో ప్రేక్షక హృదయాలు 
సునిశితమైన సున్నిత అనుభూతులతో రాగ భరితాలౌతూ రంజిల్లినవి.


“ఓ వీణ సఖీ! నా ప్రియ సఖీ! 
  నా చక్కని రాజెట దాగెనో?”


“వీణలోనా? తీగలోనా? – ఎక్కడున్నదీ రాగము? – 
  అది ఎలాగైనది గానము?.......”


ఇలాగ లెక్కలేనన్ని పాటలు 
ఈ నాటికీ వర్ధమాన గాయకుల పెదవులపై 
నవనీత సుధా సదృశంగా రంగరించబడుతూనే ఉన్నవి కదా!


(This article was originally published in 
భావ వీణ - March 2007 - Page 57 )



సప్త స్వరములుః స రి గ మ ప ద ని
షడ్జమము, ఋషభము, గాంధారము, మధ్యమము, 
పంచమము, దైవతము, నిషాదము


@@@@@@@@@@@@@@@@@@@@


వైవిధ్య భరిత వీణలు (లింక్; వెబ్ పత్రిక)
Member Categories - తెలుసా!
Written by kadambari piduri   
Tuesday, 06 September 2011 05:03
;

24, సెప్టెంబర్ 2011, శనివారం

థాయిలాండ్ లో డెకరేషన్స్


Buddhist ceremony, Thailand
కొబ్బరాకులతో పెళ్ళి మండపాలను కట్టడం 
మనకు అలవాటే!  
థాయిలాండ్ దేశంలో palm leaves తో చేసిన 
ఈ అలంకరణలను నయనానందంగా తిలకించండి.
బౌద్ధ పర్వ దిన శుభ వేళలందు 
ఈ డెకరేషన్ లను థాయ్ ప్రజలు తయారుచేస్తున్నారు.


Buddhist ceremony లను 
Thailand కు వెళ్లి చూడాలనిపిస్తూంది కదూ! 

*************************************\\\\\\

(Decorations made from palm leaves used 
during an outdoor Buddhist ceremony in Thailand)
;

22, సెప్టెంబర్ 2011, గురువారం

గులాబీల పండుగ- Roses Day




“ఓ ఫూలన్ దేవీ! ఈ అటవీ ప్రాంతాన్ని చిమ్మి బాగుచేయి” 
అని వనదేవత ఆదేశించింది.
ఫూలన్ దేవత అడవిని శుభ్రం చేస్తూన్నది. 
అక్కడ ఉన్న గురుకులములలోని బాలురు, విద్యార్ధులు 
అక్కడికి సమిధలను ఏరుకోవడానికి వచ్చారు. 
గురుకుల బాల, జనులు ఫూలన్ దేవత 
జటిలంగా ఉన్న కారడవిని పరిశుభ్రపరుస్తూ 
శ్రమ పడుతూండగా చూసారు. వారు కూడా సాయం చేసారు. 
చేయి చేయి కలిపితే ఎంతటి పనులైనా ఇట్టే సాధించవచ్చును కదా!
అరణ్యమును శుభ్రం చేసి, 
విద్యార్ధులు తమ తమ ఆశ్రమములకు వెళ్ళారు.
ఫూలన్ దేవత చెట్లనూ, లతలనూ- పూల గుత్తులతో అలంకరించసాగింది. 
ఇంతలో అక్కడి గుబురు పొదలలో నుండి మూలుగులు వినిపించాయి. 
“ఏమిటా? అవరివీ?”అనుకుంటూ పూ దేవత తొంగి చూసింది. 
అక్కడ ఒక అమ్మాయి ఉన్నది. ఆమె పేరు జటాత్రి. 
“రాణీవ" అనే ముని తపస్సుకు భంగం కలిగించాను. 
అందువలన ఆ ఋషికి ఆగ్రహం కలిగినది. 
ఆ తాపసి శాపం వలన, నా ఱెక్కలు విరిగిపోయినవి” 
అంటూ జటాత్రి రోదించింది.


పూల దేవత ఐన ఫూలన్ దేవతకు- జటాత్రి పట్ల సానుభూతి  కలిగి, 
తన మిత్రులు మనోతి, దక్షిణి,  ప్రభాస్ లను పిలిచి 
"జటాత్రికి ఈ గాయాలు మానే విధం చూసి, వైద్యం చేయండి" అని అప్పజెప్పినది. 


ప్రేమ దేవత ఐన మనోతి కొన్ని మంత్రములు పఠించింది. 
మంత్ర మహిమలతో కూడిన వన మూలికల లేపనమును 
జటాతి దేహమునకు పూసింది.
జటాతికి తన శక్తితో- సౌందర్య రూపాన్ని, ఆరోగ్యాన్నీ ప్రసాదించినది.


తర్వాత ఆమెను దక్షిణి వద్దకు తీసుకుని వెళ్ళినది మనోతి. 
ద్రాక్షా వనములపై సాధికారకత ఉన్న దక్షిణి 
తన మహిమలతో ఘుమ ఘుమల పరిమళములను ఒసగినది.


అటు పిమ్మట జటాతితో, ప్రభాస్ వద్దకు వెళ్ళినది. 
సూర్యదేవుని అంశ గల ప్రభాస్ తన కాంతిని జటాతిపై ప్రసరింపజేసాడు. 
కిరణములు సోకగానే జటాత్రి, సౌందర్య రాసిగా మారిపోయింది.


ప్రజలు ఆమె అందమును ప్రశంసలు కురిపిస్తూ గులాబీ- అని పిలువసాగారు. 
ఆ పిలుపులే- ఆమె నామధేయంగా అమరి, పూవులకు మహారాణి ఐనది గులాబీ.


*******
అదండీ "గులాబీ" జన్మ రహస్యం.


సెప్టెంబరు 22 ని పాశ్చాత్యులు - ROSES DAY పండుగ జరుపుకుంటారు. 
గిరిప్రాంతాలలో- అక్టోబరు, జూన్ ల నడుమ మొదలిడతారు. 
అలాగే మైదాన ప్రాంతాలలో సెప్టెంబర్ - ఫిబ్రవరిల మధ్య, 
గులాబీ మొక్కలు నాటడము, 
కొమ్మలను అంటు కట్టడానికి పూనుకుంటారు.


కొన్ని సంకేతములు కూడా ఈ పూలతో ఏర్పడినవి.


1) 12 పూవుల గులాబీ గుచ్ఛము :- కృతజ్ఞత తెలుపుట; 


2) 25 రొసెస్ కలిపి ఇచ్చే గులాబీ పూల గుత్తితో - శుభాకాంక్షలు అందిస్తారు.


3) అలాగే 50 పుష్పాల బొకే -  నిండు ప్రేమ, మమతలకు సంకేతము.




గులాబీల పర్వ దినమును వివరములు ఇన్నిన్ని ఉన్నవి. మరి ఇదండీ సంగతి!


*************************************\\\\\



గులాబీల పర్వ దినమును వివరములు ఇన్నిన్ని ఉన్నవి. మరి ఇదండీ సంగతి.!


నేడే ఈ నాడే, గులాబీల పర్వ దినం!
అందుకే ఈ కథ.
ఈ గ్రీకు దేశం పురాణాలలో - గులాబీ గురించిన కథ ఉన్నది.
మన వాళ్ళకు త్రరగా అర్థం ~~~ అవడానికని చెప్పి, నేను పేర్లను మార్చాను.
భారతీయ నామావళితో - ఈ కథను రాసాను.
బాల బాలికలకు బోధపడ్తుందని ఇలాగ రాసానన్నమాట.
పేర్లను రామాయణం, ఇతర ప్రతీకాత్మక పేర్లు పెట్టాను.


అసలు పేర్లు:-


@1.గ్రీకు పూల దేవత "క్లోరిస్" ;
ऽ. దేవదూత->
@3. ఆఫ్రొడైట్->
@4.వైన్ దేవత "డయానిసిస్" ->
@5.సూర్యదేవుడు "అపోలో"->
@6. పశ్చిమ మారుత దేవుడు వాయు దేవుడు;


ఇందులో , జటాతి- పేరును గుర్తు పట్టారా?
అదే - రామాయణంలో "జటాయువు", 
సీతమ్మ వారిని రావణుడు ఎత్తుకు వెళ్ళేటప్పుడు, పోరాడిన పక్షి.
దేవదూత- మూడు అంచెలలో:- 
దేహ బలము, సౌందర్యమునూ, 
సౌరభాలనూ, 
గులాబీ గా మారడమున్నూ ---
జరిగినవి.
ఇవాళ Date - September 22, 
పాశ్చాత్య దేశాలలో "గులాబీల పండగ" అనుకున్నారన్న మాట!
కాబట్టి ఇదిగో - ఈ కథ.


@@@@@@@@@@@@@@@@@


"గులాబీ" జన్మ రహస్యం
  
Member Categories - తెలుసా!
Written by kusuma ;  Monday, 19 September 2011 07:43 



{Chloris; Rose -Queen of Flowers -nymph;Aphrodite; Dionysus ; 
 Zephyr,the West Wind;Apollo ; }


Roses Day (Link 1)


రోజా పర్వము  (లింక్ 2)


21, సెప్టెంబర్ 2011, బుధవారం

దక్షిణ తిరుపతి ఉప్పిలి అప్పన్ దేవళము


The Moolavar Uppiliyappan (Srinivaasan)
ఉప్పిలి అప్పన్ దేవళము దక్షిణ తిరుపతి - గా  ప్రసిద్ధికెక్కినది. 
ఈ క్షేత్రానికి మరో పేరు తిరువిన్ నగర్ (Thiruvinnagar).  
తమిళనాట, తంజావూరు మండలములో ఉన్న 
తిరునాగేశ్వరం గ్రామ సీమ దరి లో ఉన్నది     
ఒప్పిలి అప్పన్ సన్నిధి -
విష్ణు మూర్తి అవతార మూర్తి.
108 దివ్య దేశముల పట్టికలో ఈ పుణ్యక్షేత్రము కూడా ప్రసిద్ధి కెక్కినది.

ఉప్పులేని చప్పిడి తిండి తినే దైవము ఉన్న ఊరు - తిరువన్ నగరము. 
ఈ దివ్య దేశ క్షేత్ర మూర్తి కే "ఉప్పిలి అప్పన్" 
అని పేరు ఉన్నది.
కుంభకోణం నుండి 7 కిలోమీటర్లు దూరంలో ఉన్నది.
"తిరునాగేశ్వరము" అనే శైవ పుణ్యక్షేత్రము చేరువలోనే 
ఈ గుడి నెలకొని ఉన్నది.
ఒప్పిలి అప్పన్ ఈ కోవెలలో 
శ్రీ వేంకటాచలపతి వలె, నిలబడి ఉండి, 
సౌందర్య రాశిగా భక్తులకు దర్శనము నొసగుతున్నాడు.



తిరువిన్ నగర్ స్థల మహాత్మ్యము


ఇందులో రెండు కథలకు అనుబంధం ఉన్నది.
1. తులసీ గాథ; 2. శ్రీ లక్ష్మీదేవి కుమార్తె;


తులసీ కథ:- 


తులసీ దేవి "స్వామీ! లక్ష్మీ దేవిని నీ ఉరమున  అలంకరించుకున్నావు. 
నన్ను కూడా అదే రీతిని కరుణించుము" అని అడిగినది.
"లక్ష్మీ దేవి నాకోసము వేల ఏళ్ళ నుండి తపస్సు చేస్తూన్నది. 
ఆమె భూలోకములో అవతరించినపుడు, 
నేను ఆమెను పరిణయం చేసుకోవాల్సి ఉన్నది.
ఆమె మరుసటి జన్మలో నీ ఒడిలో(నీడలో) ఉద్భవిస్తుంది. 
అందువలన నీవు ప్రజలచే సదా సర్వదా పూజింపబడుతావు. 
కనుక ఓ తులసీ! నీవు ముందుగా భూలోకములో మొక్కగా ప్రభవిల్లుము"   
స్వామి ఆదేశముతో, ఆమె ఉర్విపై తరువు ఐనది.
పవిత్రమైన మొక్కగా ప్రజలచే పూజలను అందుకో సాగినది. 


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~


ఋషి పుత్రికగా శ్రీ లక్ష్మీ దేవి:-



మృకండుడుఅనే ముని తనయుడు మార్కండేయుడు, 
మార్కండేయుడు శ్రీమన్నారాయణ మూర్తి కొరకు 
నిశ్చల తపస్సు చేసాడు 
శ్రీమహావిష్ణువును ప్రత్యక్షమైనాడు.
ముని "స్వామీ!  లక్ష్మీ దేవి నాకు కుమార్తెగా పుట్టాలి
నీవు నాకు అల్లుడివి అవాలి" అని కోరాడు.
భక్తుని కోరికను ఆమోదించాడు భగవంతుడు. 
మార్కండేయ మహర్షి యొక్క కుమార్తెగా లక్ష్మీ/ భూదేవి జన్మించినది.
తులసి మొక్క నీడలో పసిబిడ్డ ఐన లక్ష్మీదేవి దొరికినది. 
మార్కండేయుడు ఆమెను ప్రేమతో పెంచసాగాడు. 
ఆమెకు యుక్తవయసు వచ్చినది.
నారాయణుడు ఒక వృద్ధుని వేషంలో వచ్చి
"నీ కూతురును నాకు ఇచ్చి, 
పెళ్ళి చేయుము, మహా మునీ!"అని అడిగాడు.
కానీ ఋషి అందుకు అభ్యంతరం చెబ్తూ
"నా కుమార్తె ఇంకా చిన్నది. 
ఆమెకు సరిగా ఉప్పు వేసి, 
వంటలను రుచిగా చేయడం సైతం చేతకాదు.
 కాబట్టి మీరు ఏమీ అనుకోవద్దు."
అందుకు స్వామి అన్నాడు
"అలాగైతే- ఆమె అలా లవణం  లేకుండ వండితే, 
నేను అదే తింటాను" అన్నాడు. 
శంఖ చక్రములను ధరించి, 
తన నిజ రూపంతో విష్ణుమూర్తి ప్రత్యక్షమైనాడు.
స్వామికి సంతోషముతో కన్యాదానం చేసాడు.   
మార్కండేయుడు శ్రీమన్నారాయణుని తనకు అల్లునిగా పొందాడు.
మహర్షికి అలాగ వరము సిద్ధించినది. 
శేషశయనుడు "ఉప్పు లేని వంటకములనే సంతోషంగా నేను భుజిస్తాను"  
అని మునుపు నుడివాడు కదా!
కనుకనే ఆ స్వామీ లవణము లేని ప్రసాదమునే స్వీకరిస్తున్నాడు.
ఈ కోవెలలో ప్రతి ఆహారపదార్ధమునూ  ఉప్పు లేకుండా తయారుచేస్తారు. 
అలాగ వండిన " లవణ రహిత భోజన, ఆహారములను" 
క్షీరసాగరవాసునికి - నైవేద్య సమర్పణ చేస్తున్నారు.
అదే పద్ధతిని భక్తులు సైతము అనుసరిస్తారు.
ఐ దేవళము ఆవరణలో భక్తులు కూడా 
ఉప్పు లేకుండా తయారు చేసుకున్న 
ఆహారమును భుజిస్తారు. 


@@@@@@@@@@@@@@@@@@@@@




;

17, సెప్టెంబర్ 2011, శనివారం

దొడ్డ మఱ్ఱి చెట్టు, Bangalore


రామ హల్లి(= రామపల్లి) లో 
ఒక పెద్ద మఱ్ఱి చెట్టు ఉన్నది.
కర్ణాటక రాజధాని ఐన 
బెంగుళూరుకు 28 కిలోమీటర్లు దూరంలో ఉన్నది. 
400 ఏళ్ళ వయస్సు గల ఈ మహా వట వృక్షం - 
4 ఎకరముల మేర విస్తరించి ఉన్నది.
పిక్నిక్ స్పాట్, టూరిస్టులకు ప్రత్యెక ఆకర్షణ.
ఈ మర్రి చెట్టును "దొడ్డ ఆలద మర"
('Dodda Alada Mara'= Big  Banyan Tree ) కి 
అని పేరు.
'Dodda Alada Mara' = The Big Banyan Tree ;
spreads over an area of 4 acres; 
Ramohalli ; 400-year-old Banyan Tree ;





15, సెప్టెంబర్ 2011, గురువారం

అమితాబ్ పొడుగు హాస్యం


          Pyar ki kahani,Amitabh Bachchan

అతడేమో సన్నగా, రివటలా ఉన్నాడు, 
ఇతడేమో "మహా పొట్టి. "గడకర్రలాగా- ఇంత పొడుగు, 
ఇతనేమిటీ..... సినిమాలలో హీరోనా?" అని 
అప్పట్లో హిందీ సినీ విశ్లేషకులు లుప్చలు కొడుతూ అనుకున్నారు. 
అతనే అమితాబ్ బచన్ 
(Amitabh Harivansh Bachchan- Born on 11 October 1942).
RajBabu, Telugu comedian 






1967 లో "ప్యార్ కీ కహానీ" (తనూజ హీరోయిన్) సినిమాను 
shooting మొదలెట్టి సినిమాను తీస్తున్నారు. 
దీనికి మాతృక తమిళంలో సంవత్సరము పాటు థియేటర్ లలో ఆడి, 
ఎన్నో రికార్డులను నిలిపిన "పాశమలర్". 
తెలుగులో "మరపు రాని కథ"- సావిత్రి నటించిన పాత్రను వాణిశ్రీకి ఇచ్చారు. 
ఈ తెలుగు మూవీతో వాణిశ్రీ దశ తిరిగింది. 
అప్పటిదాకా కమెడియన్, చిన్నా చితకా పాత్రలతో 
కొట్టుమిట్టాడుతూన్నది వాణిశ్రీ.
వాణి లోని ఆమె అద్భుత నటనకు 
ప్రేక్షక లోకం నుండి అగణిత ప్రశంసలు 
ఆమెకు కొంగు బంగారం గా లభించినవి .    
వాణిశ్రీ అకస్మాత్తుగా 'తిరుగులేని కథానాయిక గా' 
తారాపథంలోకి దూసుకుపోయింది. 
"ప్యార్ కీ కహానీ" లొ తనూజ హీరోయిన్. 
ఈ హిందీ సినిమాలో ఇంకో తమాషా విశేషము కూడా ఉన్నది. 
అదేమిటంటే- రాజబాబు- ఒక బుల్లి వేషం వేసాడు.   

                          
మళ్ళీ అమితాబ్ బచన్- వద్దకు వద్దాం! 


తెలుగులో క్రిష్ణ నటించిన హీరో పాత్రకు ఇతను సెలెక్ట్ ఐనాడు. 
ఆ వామన రూపుని నామం "గణేశ్". 
అమితాబ్ బచన్ కి గణేశ్ మేకప్ అసిస్టెంట్. 
అమితాబ్ బచన్ మోకాళ్ళ దాకా కూడా కాదు, 
కిందకే ఉన్నాడు గణేశ్.


ఈ మరుగుజ్జు మేకప్ మ్యాన్, 
నేటి మన అగ్ర కథానాయకుడు -
అమితాబ్ బచన్ కి టచప్ ఇవ్వాల్సి వచ్చేది కదా మరి!


గణేశ్, ఈ  హీరో వదవారవిందానికి టచప్ ఇవ్వడానికని వచ్చేవాడు.
 ప్రతిసారీ అమితాబ్ బచన్ అతణ్ణి రెండు చేతులతో 
తన ముఖం వద్దకు వచ్చేలా ఎత్తుకునే వాడు. 
గణేశ్ టచప్ క్లాత్ తో సుతారంగా 
అమితాబ్ బచన్ మోముపై ఒత్తేవాడు. 
ఆ దృశ్యం అందరినీ పక పకల నవ్వులలో ఓలలాడించేది.


ఒక మారు, ఒక్కో సారి వామన గణేశ్ ని క్రేన్ పైన కూర్చుండబెట్టి, 
ఆ క్రేన్ తన face దగ్గరికి వచ్చేలాగా తోయించి, 
అమితాబ్ బచన్ టచప్ చేయించుకుని, 
అచ్చటి సిబ్బందిని నవ్వించే వాడు. 
"ఆతడి దగ్గరి గుడ్డను తీసుకుని, 
మీరే అద్దంలో చూసుకుంటూ మొహాన్ని అద్దుకోవచ్చును కదా!?" 
ఆ సలహాకు అమితాబ్ బచన్ ప్రత్యుత్తరం ఇది- 
"అది మామూలే! కానీ ఇందులోని తమాషా, ఆనందం, 
నవ్వుల్ నవ్వులూ పువ్వుల నవ్వులూ ఎక్కడ్నించి వస్తాయి?"


ఈ సమాధానం హాస్య స్ఫూర్తికి దోహదం చేసే 
అమితాబ్ బచన్ వ్యక్తిత్వానికి నిదర్శనం. 
అన్నట్టు ఆ జవాబును అమితాబ్ బచన్ 
తెలుగులో చెప్పేరు అనుకునేరు....
हिन्दी (హిందీ)లోనే చెప్పాడు లెండి!


అమితాబ్ పొడుగు హాస్యం : (Link 1)


Pyar ki Kahani, 1971 (1971)


Member Categories - మాయాబజార్
Written by kusuma ; Thursday, 08 September 2011 07:27 

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...