10, జులై 2011, ఆదివారం

ఉదాహరణ వాఙ్మయమును వెలుగులోకి తెచ్చిన నిడదవోలు వెంకట్రావు

 

                                                                                                              ఆధునికసారస్వతములో- ప్రాచీన సాహిత్యముపై, ముఖ్యంగా ఉదాహరణ వాఙ్మయముపై విశేష కృషి చేసిన దిగ్దంతులలో ఒకరు నిడదవోలు వెంకట్రావు. "మహాశ్వేత" కొక్కొండ వెంకటరత్నం మొదటి నవల- ఇత్యాది  నిర్దిష్ట ప్రామాణిక అభిప్రాయాలను  వెలిబుచ్చిన వ్యక్తి నిడదవోలు వెంకట్రావు.మయూర కృత “సూర్య దండకమ్”ను, “శివ స్తవమ్ ” లను వెలుగులోకి తెచ్చిన ఘనత వీరిదే! 
"ప్రథిత వేదము వేంకట రాయ శాస్త్రి ;                                                                                                    పొందగా బుట్టిన కళాప్రపూర్ణ బిరుదు;  సార్ధంబయ్యె సాహిత్య జగతి నేడు ;నిడుదవోల్వేంకట రాణ్మనీషి వలన." 

1973 లో సన్మాన పురస్కారలతో, కవుల కైవారములను ఈలాగున అందుకున్నారు. “కళా ప్రపూర్ణ”, “పరిశోధన పరమేశ్వర” మున్నగు బిరుదులను పొందారు. నిడదవోలు వేంకటరావు ఉదాహరణ  వాఙ్మయ చరిత్రను రచించారు. తరువాత విశ్వనాథ సత్యనారాయణ బోటి ఉద్ధండులు, మరుగున పడిన ఈ ఉదాహరణ శాఖపై దృష్టి సారించి, ఆ రచనలను చేసారు. 35 మంది పైన కవులు ఇలాగ ఉదాహరణ వాఙ్మయములో రచనలు చేసారు. అందువలననే - “ఉదాహరణ వాఙ్మయోద్ధారక” అని కీర్తించబడ్డారు. “జంగమ విజ్ఞాన సర్వస్వము”, “ఏక సంథాగ్రాహి”, “కళా ప్రపూర్ణ”, “పరిశోధన పరమేశ్వర” మున్నగు బిరుదులను పొందారు.తిరుపతి ఓరియంటల్ కాలేజీ లైబ్రరీకి వారు అనేక పుస్తకాలను దానం చేసారు.. ఆయన హైస్కూలు, ఇంటరు చదువు విశాఖపట్నంలోనూ, బి.ఎ. విజయనగరంలోనూ పూర్తి చేసారు. 1925లో బి.ఎ. పట్టం అందుకుని ఆర్థికపరిస్థితులు కారణంగా పైచదువుకి వెళ్లలేక, ఇంపీరియల్ బాంక్ (ఈనాటి స్టేట్ బాంక్) లో గుమాస్తాగా చేరేరు 1926లో. ఒకసందర్భంలో తిరుమల రామచంద్రగారు “వెంకటరావుగారు కారణాంతరాలవల్ల ఎం.ఏ. చెయ్యలేదు” అంటే సమాధానంగా వెంకటరావుగారు, “కారణాంతరాలవల్ల యం.ఏ. చేసాను” అన్నారుట. "ఎలా?" అని అడిగితే "ఇలా.." అని వివరించారు ఆయన...“ఈనాడు విశ్వవిద్యాలయములలో నున్నవారికి నాకు నొకటే బేధమున్నది..బ్యాంకు అంకెలమయము. సాహిత్యము అక్షరమయము. నేను అంకెలనుండి అక్షరములలోనికి రాగా, నేటి  విశ్వవిద్యాలయమున నున్నవారు అక్షరములనుండి అంకెలలోనికి వచ్చినారు.” అన్నారు, చమత్కరిస్తూ.వెంకటరావుగారు 1944 నుండీ 1964వరకూ మద్రాసువిశ్వవిద్యాలయంలో జూనియర్ లెక్చరర్‌గా మొదలుపెట్టి, తెలుగుశాఖ అధ్యక్షులుగా పదవీ విరమణ చేశారు. ఈవిషయంలో “నన్ను విరమింపజేసినారు” అని ఆయన రాసుకున్నారు - అంటే యూనివర్సిటీవారు ఒత్తిడి చేసేరనే అనుకోవాలి."బలి, దానం చేత (పొట్టి అయాడు) అడుగున పడిపోయాడు. బలిదానంచేత శ్రీ పొట్టి శ్రీరాములు పొడుగైనాడు" మున్నగు స్ఫూర్తిదాయక నుడువులు ప్రశస్తి  పొంది, ప్రచారము లోనికి వచ్చాయి.
నిడుదవోలు వెంకటరావుగారి సాహిత్యంమీద నిష్టల వెంకటరావుగారు పరిశీలన చేసారు.  
ఆధారము:-
[యువభారతి- ప్రచరణ వ్యాస సంకలని] 

                Link - Web patrika 


 

ముద్దు పేర్లు - మొద్దు పేర్లు

"బుజ్జీ! చంటీ! బన్నీ! చిట్టీ! కాఫీ తాగుదురు గాని రండి! టిఫిన్ కూడా రెడీ."  ; తరళ, ఆమె సోదరి లవంగిక తమతమ పిల్లల్ని ఎలుగెత్తి పిలి...