“చార్లీ చాప్లిన్” “ది గ్రేట్ డిక్టేటర్”నేటికీ సంచలన చిత్రంగా,
విజయదుందుభి మోగించే ఇంగ్లీష్ సినిమా “ది డిక్టేటర్”.
ఈ చలన చిత్రం అన్ని కోణాలనుండీ
సంచలన రికార్డులకు మారుపేరుగా నిలిచింది.
ఈ English Movie ఆబాలగోపాలానికీ అభిమానపాత్రుడైన మహా నటుడు
“ఛార్లీ చాప్లిన్” కీర్తి కిరీటంలోని కలికితురాయి.
ఈ చిత్ర కథ, చాప్లిన్ ఫ్యాన్స్ కి అందరికీ తెలుసు.
జర్మనీ దేశాన్ని, జర్మని జాతి వారు –
ఆర్య వారసత్వ మూలములు 'తమ కలిమి గా 'కలిగిన వారని ,
త్రికర్మణా నమ్మాడు హిట్లర్.
తన మూఢ విశ్వాసాలను అత్యంత క్రూరంగా
అత్యంత హేయంగా యావత్ ప్రపంచము నెత్తిన రుద్దాలని యత్నించిన
నియంత హిట్లర్ పోకడలకు వ్యంగ్య రూపకమే
1940 సంవత్సరము నాటి "The Great Dictator".
ఈ మూవీ రూప కల్పనకి నాంది అనుకోకుండా పలికిన సందర్భం వింత ఐనదే!
Alexander Kord అనే స్నేహితుడు,
“నీ ముఖంలోని ముక్కట్లు (= పోలికలు)”
కొన్ని యాంగిల్సులో హిట్లర్ లాగా ఉన్నాయి.” అన్నాడు.
మిత్రుని మాటలతో – ఛార్లీ అద్దంలో తన బింబాన్ని పరిశీలించుకునాడు.
ఫొటోలలో తన Face ను, పోలికలనూ పరిశీలనగా మళ్ళీ మళ్ళీ గమనించుకున్నాడు.
Alexander Korda,వాక్కులు ఆతని అద్భుత చిత్రానికి చిత్రంగా ముహూర్తం ఐనది.
హిట్లర్ ఆశయాల ఆచరణలో కూరిన అసంబద్ధత- ఆతని మూర్ఖత్వమూ –
ఛాప్లిన్ యొక్క ప్రతిభా వ్యుత్పత్తులకు గీటురాయిగా నిలిచేలాగా –
‘న భూతో, న భవిష్యతి ’ అన్న చందంగా ఛాప్లిన్ చేతిలో రూపొందినది.
మాటలు, దర్శకత్వం, స్క్రీన్ ప్లే – ఒకటేమిటి?
అన్ని కోణాలలోనూ సర్వతోముఖంగా – నిర్మించబడినది.
ప్రపంచ దేశాల బొమ్మను వేసిన గాలి బుడగ – సన్నివేశం
ఛార్లీ చాప్లిన్ కళాభినివేశానికి ప్రతిరూపం,
సినీ చరిత్రలో శిఖరాగ్ర స్థాయిలో సుస్థిరమైన చిత్రీకరణ అది.
బుడగను బ్యాలెన్స్ చేస్తూ ఆడిన నియంత ఆట – నాట్యంగా
ప్రేక్షకుని కంటికి ద్యోతకమయ్యే రీతిగా ఆ అమోఘ దృశ్యము ..........
ఆహా!
ఆ మహా నటుడు ప్రశంసా వర్షంలోనిలువెల్లా తడియడంలో ఆశ్చర్యం ఏమున్నది?
“The Dictator” లో మహా నియంత,
అశేష జర్మనీ ప్రజానీకాన్ని మేధో విమూఢ చిత్తులనుగా చేసేసి ,
వారిని విపరీతమైన హింసా దౌర్జన్యాల చర్యలకు పురికొల్పిన పద బంధాలు అవి.
ఆ ప్రజలు నిర్హేతుకంగా, నిర్దయా హృదయులై
తమ ప్రవర్తనతో సకల మానవాళినీ పెను ముప్పులోకి నెట్టివేసిన దుష్ట లగ్నము అది.
అంత ప్ర భావవంతమైనది హిట్లర్ ప్రసంగం.
సరే! ఇప్పుడీ అప్రస్తుత ప్రసంగం ఎందుకని చదువరుల సందేహం? ఔనా?
సినీ సమీక్షా వర్గాలకు – ప్రత్యేకించి- సినిమాలోని - హిట్లర్ స్పీచ్
ఆసక్తి గొలిపే అంశంగా పరిణమించినది.
చార్లీ చాప్లిన్ – హిట్లర్ వేష ధారణతో – మైకు ఎదుట నిల్చుని,
అనర్గళంగా మాట్లాడాడు,
"అప్పుడు చార్లీ చాప్లిన్ ఉరఫ్ Adolf Hitler -
తన డైలాగులను ఏ లాంగ్వేజీ లో మాట్లాడాడు? "
ఇదీ ఆ ప్రశ్న.
ఆ shot లో చాప్లిన్ - Esperanto Language ని
ఉపకరణంగా మలుచుకున్నాడు – అని
సినీ వర్గాల భావన.
ఎస్పిరాంటో భాష అంటే ఏమిటి?
Esperanto language ఏ కంట్రీ citizens వ్యావహారికంలో ఉన్నది?
Dr L.L. ZamenhOf అనే యూదు వ్యక్తి ఈ భాషకు బీజావాపనం చేసాడు.
Dr. Lazarus Ludwig Zamenhof పోలండ్ యూదుడు(a Polish physician )
(15 Dec 1859 to 14 Apr 1917)
"ప్రపంచ భాష "అనే యోచనతో , సార్వ జనీన భాషకు శ్రీకారం చుట్టాడు.
హిందు దేశములో - ప్రాచిన కాలములో
సకల భారతీయ భాషలను అనుసంధానించిన ప్రయోగమే - సంస్కృత భాష.
మన దేశములో గీర్వాణ భాష ఆవిర్భావ భావన వంటిదే
ఇలాగ ఈ Esperanto language.
1887 లో “ Unua Libro”అనే పుస్తకము ఈ విషయ సంబంధిగా
ముద్రితమైన మొదటి పుస్తకమని పేర్కొనవచ్చును.
ఎస్పిరాంటో – భాషను మాట్లాడే అభిలాష ఉన్నవారు ప్రపంచవ్యాప్తంగా –
ఒక లక్ష నుండి పది లక్షల మంది దాకా ఉన్నారని అంచనా.
కొన్ని సినిమాలు కూడా Esperanto భాషలో నిర్మించబడినాయి కూడా!
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
esperanto language,Dr L.L. ZamenhOf
కలికితురాయి (Link 1)