...............
లోక మందిరమునకు పునాది రూపాన్ని
అన్వేషించ యత్నించిన భావుకుడు మన దేవుల పల్లి క్రిష్ణ శాస్త్రి.
ఆ అన్వేషణా భారంతో ఎంతగా డస్సి పోయాడో కదా
పాపం! ఆ భావ కవీంద్రుడు.
"భావనా" గవేషణా లాలిత్య లయలతో
సాగిన ఆయన గీతం ఇది.
( లైబ్రరీలలో 4 నెలల పాటు గాలించీ ........ గాలించీ .......
హమ్మయ్య! ఇప్పటికి దొరికింది నాకు, ఈ పాట! )
పాఠక మిత్రులకై ఇదిగో! స్వీకరించండి! )
****************************************
శిథిలాలయమ్ములో శివుడు లేడోయి!ప్రాంగణమ్మున గంట పలుక లేదోయీ!దివ్యశంఖము గొంతు తెరవ లేదోయిపూజారి గుడి నుండి పోవ లేదోయి!చిత్ర చిత్రపు పూలు – చైత్ర మాసపు పూలుఊరూరా, ఇంటింట ఊరకే పూచేయి -శిథిలాలయమ్ములో శిల కెదురుగా కునుకుపూజారి కొకటేని పువ్వు లేదోయివాడ వాడల వాడె, జాడలన్నిట వాడెవీడు వీడున వాడె, వీటి ముంగిట వాడెశిథిలాలయమ్ములో శిల కెదురుగా కునుకుపూజారి వానికై పొంచి ఉన్నాడోయి************************************
SithilaalayammulO SivuDu lEDOyipraaMgaNammuna gaMTa paluka lEdOyI!divyaSaMKamu goMtu terava lEdOyipUjAri guDi nuMDi pOva lEdOyi!chitra chitrapu pUlu – chaitra mAsapu pUluUrUrA, iMTiMTa UrakE pUchEyi -SithilaalayammulO Sila kedurugaa kunukupUjAri kokaTEni puvvu lEdOyivADa vADala vADe, jADalanniTa vADevIDu vIDuna vADe, vITi muMgiTa vADeSithilAlayammulO Sila kedurugaa kunukupUjAri vaanikai poMchi unnaaDOyi***************************************
ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి
ఎంతో పట్టుదలతో ఈ కావ్య మల్లికా సుమ హారాలను -
1965 వ సంవత్సరంలో పుస్తక రూపంలోకి తెచ్చారు.
ఓరియంట్ లాఙ్మన్ లిమిటెడ్
3-6-272,
Hyderabad - 29 ;
వారు అచ్చు వేసారు.
2 కామెంట్‌లు:
Chaala Baagundi.
ఈ పాట MP3 రూపంలో (పాట రూపంలో) మీ వద్ద ఉంటే వీలైతే పోస్ట్ చేయగలరా
కామెంట్‌ను పోస్ట్ చేయండి