1, జూన్ 2010, మంగళవారం

"వల్లతోళ్”“ మలయాళమహా కవి

"వల్లతోళ్” అనే నామ ధేయముతో సుప్రసిద్ధుడైన “మహా కవి

అసలు పేరు నారాయణ మీనన్ (16-10-1878 - 18-8-1957).
మలయాళీ కవితా సారస్వతానికి మేలి మలుపు నొసగిన కవివరేణ్యుడు.

చెన్నర– అనే గ్రామములో(16-10-1878) జన్మించెను.

కుమారన్ ఆశాన్, వల్లతోళ్ నారాయణ మీనన్, ఉళ్ళూర్ పరమేశ్వర అయ్యర్ –
ఈ కవి త్రయము మేధా సంపత్తి, కల్పనా నైపుణ్యత,
సమాజము పట్ల అవగాహనా స్పందనలు ,
మాతృ భాష పట్ల ఎన లేని మమకారములతో
కదిలించిన కలములతో,
కేరళ సాహితీ ప్రపంచము ఆధునిక యుగములోనికి ముందడుగు వేసింది.
=======================================

ఈ ముగ్గురిలో ఒకరైన వల్లతోళ్ ,కవియే కాదు, సంఘ సంస్కర్త కూడా.
మహాత్మా గాంధీజీ అంటే ఆతనికి అమిత ఇష్టము.
గాంధీ భక్తునిగా , సంఘములోని మూఢ నమ్మకాలను తొలగించడానికై,
శ్రమ దమాదులను లెక్క చేయకుండా, నిర్భయంగా ముందుకు సాగాడు.
ఆ నాటి సమాజాన్ని ధైర్య స్థైర్యాలతో సంస్కరించే ప్రయత్నాలలో సఫలీకృతులైనారు;
కథాకళీ నాట్యాన్ని సనాతన వాదుల నుండి అట్టడుగు వర్గాల వారికి,
నిమ్న కులస్థులకు అందుబాటులోనికి తెచ్చిన గొప్ప సంఘ సంస్కర్త.


==========================================

1910 లో వల్లతోళ్ జీవితంలో ఒక సంఘటన తటస్థ పడింది.
సాఫీగా సాగి పోతూన్న ఆతని బ్రతుకు బండికి ఒక్క సారిగా కుదుపులకు లోనైనది.
తిరుచూరులో నివసిస్తూన్న రోజులు అవి. ఒక రోజు అతడికి బాగా పడిశము పట్టింది.
జలుబు కారణముగా అతని చెవులు దిబ్బిళ్ళు అయ్యాయి.
ఉన్నట్టుండి చెవుడు వచ్చింది. ఈ హఠాత్పరిణామముతో వల్లతోళ్ కి గంగ వెర్రులెత్తినట్లైనది.
అనేక మంది వైద్య శిఖా మణుల వద్దకు వెళ్ళాడు.
ఆ నిస్సహాయ స్థితిలో జ్యోతిష్యులను “ తన ఆరోగ్యము యొక్క భవిష్యత్తు”ను గురించి అడిగే వాడు.
భగవంతునితో మొర పెట్టు కున్నాడు;
అనేక పద్య పుష్పములతో దేవుళ్ళకు విన్నపములు చేసాడు;
కానీ
ప్చ్!!!!!!!!!........... నిష్ఫల ప్రయత్నములే అయ్యాయి.

ఐతే ..........
ఈ విపరిణామము ,
మలయాళ ఆధునిక సాహిత్యమునందు
ఒక అద్భుత కవితా గుచ్ఛమును చేర్చేసింది;
అదే “ బధిర విలాపం”.
భారతీయ సాహిటీ లోకమునకు “ బధిర విలాపం” అనే ఆత్మాశ్రయ కావ్యము లభించినది.
==========================================
మన ఆంధ్ర దేశములో కూడా ,తెలుగు భాషా సారస్వత జగత్తులో ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది.
“ దేవుల పల్లి కృష్ణ శాస్త్రి గారు, throat operation వలన స్వర పేటిక తీసి వేయ బడినది;
మూగ వాడైనందున ఆ భావ కవి పడిన వేదన అంతా ఇంతా కాదు;

“శిధిలాలయమ్ములో
శివుడు లేడోయీ .”
ఇత్యాదిగా పఠితల మనసులను కదిలించే కవితలు
ఆయన హృదయాంతర్భాగాల నుండి వెలువడినాయి.

( English poet అయిన milton చూపు కోల్పోయిన తర్వాత ,
మహా కావ్యాలను వెలువరించాడు.
మిల్టన్ మహా కవి “On His Blind” సంవేదనా భరితమైన ఆతని హృదయానికి నిలువుటద్దము,
కనుకనే మిల్టను రచనలు
ఆంగ్ల సాహిత్యానికి అపురూప కానుకలు ఐనాయి. )
=====================================
"బధిర విలాపము " (A Deaf Man's Lament )
వళ్ళతోళ్ మనో బాధను కళ్ళకు కట్టినట్లు ఉంటుంది.
తన " బధిర విలాపము " లో ఇలాగ అనుకుంటాడు ;

“ ఈ భీకరమైన అవస్థ, వినికిడి లేదు,
ఈ చెవుడు రేపు తొలి ప్రొద్దుకే తగ్గుతుంది కదా!’
అని అనుకుంటూ, రాత్రి హాయిగా నిద్ర పోయాను;
ఉదయం వచ్చేసింది;
కానీ నిరాశ మాత్రమే మిగిలింది.............”

ఈ రీతిగా సాగింది ఆ కవిత .
ఇంకా అంటాడు కదా.........

“ సాటి కవులను కలిసి నప్పుడు
వారు కవితలు చదివినప్పుడు;
చెవిని చేరక, అందలి భావమేదో అరయ నేరక ;
మనసు విల విల లాడినది!”..........

ఏది ఏమైనప్పటికీ, మలయాళములోని
ఆత్మాశ్రయ కవితా సరస్వతి పట్టు చీరకు -
జిలుగు అంచుగా ఈ “ బధిర విలాపం” చేకూరింది .

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...