1763 లో, 17 సంవత్సరాల వయసులో విలియం జోన్స్లాటిన్ భాషలో ఒక పద్యాన్ని వ్రాసాడు.658 లైన్లు ఉన్న ఆ పోయెం పేరు "Scacchia, Ludus" ;Marco Girolamo Vida 1527 ల్) ఆ పద్యాన్ని పబ్లిష్ చేయించారు.భారత దేశంలో ఉదయించిన గృహ క్రీడయే "చతురంగము".ప్రపంచ క్రీడా పటములో సుస్థిర స్థాన్నాన్ని ఆర్జించినది మేధా శక్తికి పదును పెట్టే ఈ "చదరంగము".ఈ చెస్ ఆటకు గల పౌరాణిక గాథా రూపాన్నిజోన్స్ తన Latin poem" ద్వారా వెలుగులోనికి తీసుకు వచ్చాడు .మొదట లాటిన్ భాషలో రాసిన, తన పద్యానికి అతడే ఇంగ్లీష్ లో కూడా రచించాడు.ఇందులో - ఇమిడ్చిన కథ ఇది;మార్స్ యుద్ధ దేవుడు. కైసా యక్ష కన్యక. మార్స్ ఆమె ప్రేమిస్తాడు.అందుకు అతని స్నేహితుడు " CHESS game " ను సృష్టించి, బహుమతిగా ఇచ్చాడు."గులేబకావళి" అనే తెలుగు సినిమాలోఎన్.టి.రామారావు కథానాయిక 'జమున'ను చదరంగంలో గెలుస్తాడు.అదే పద్ధతిలో, మార్సు కూడా కైసాను చెస్స్ గేము లో ఆమెను గెలిచాడు.ఆనాటినుండీ, Caissa "goddess" of chess"గా (చదరంగ క్రీడకు అధిదేవతగా) పేరుగాంచినది.ఐతే మనము సర్ విలియం జోన్సును ఇంకా మెరుగైన విశేషముల వలనజ్ఞాపకం చేసుకొన వచ్చును.ఇండో-యూరోపియన్ భాషల గురించి అమోఘమైన కృషి చేసిన మహనీయుడు అతను.దక్షిణ భారతీయములగు -తెలుగు, కన్నడ, తమిళ. మళయాళ భాషలు ఆర్య భాషలకుకొంత విభిన్నమైనవని కనుగొన్నాడు.ద్రావిడ భాషా వర్గములకు చెందినవని నిరూపించాడు."ఆసియాటిక్ సొసైటీ"ని నెలకొల్పాడు.ప్రాచీన భారత దేశమును గురించి అవిరళముగా అధ్యయనం చేసినాడు.గ్రీకు, లాటిన్, హీబ్రూ, అరబిక్, చైనీస్ భాషలను ప్రాధమిక మూలాలను నేర్చుకోవడం మొదలిడినవిలియం జోన్సుకు క్రమేణా అనేక లాంగ్వేజ్ ల పట్ల ఆసక్తి, మక్కువ పెరిగాయి.28 ఏళ్ళు ప్రాయం నాటికి 13 భాషలలో పట్టు సంపాదించి,hyperpolyglot గా చిరకీర్తిని గడించాడు.ఆతనికి "ఇండియా" పట్ల గౌరవము పెరిగింది.1783 నుండి కలకత్తాలో నివసించసాగాడు.అనేక అంశాల మీద ఎన్నో ప్రామాణిక గ్రంధాలుగానిలువ దగిన పుస్తకములను రాసాడు.కలకత్తాలో ఏప్రిల్ 27, 1794 లో కీర్తిశేషుడైనాడు .
Telusaa!
చదరంగ క్రీడకు అధిదేవత ;
By kadambari piduri, Jun 8 2010 11:18PM
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి