23, జూన్ 2010, బుధవారం

New wonders in India -- ( వెబర్ ప్రణాళిక)

హెరిడోటస్, కాలిమచస్ ( 484 బి.సి. - 425 బి.సి.)
[Herodotus (484 BC – 425 BC) and Callimachus (305 BC – 240 BC)
అనే వారికి కలిగిన ఆలోచనతో ప్రపంచములోని అత్యున్నత ప్రమాణాలు గల మానవ నిర్మాణాలను,
ఏడింటిని సెలెక్ట్ చేసే ప్రయత్నం మొదలైనది.
Canadian-Swiss Bernard Weber[1] చేసిన ప్రయత్నం ద్వారా,
మళ్ళీ ప్రపంచ దేశాలన్నీ, ప్రజలందరి దృష్టినీ ఆకర్షించింది.
new 7 wonders project వలన అన్ని దేశాలలోనూ
పిన్నలనూ, పెద్దలనూ, ఆ బాలగోపాలమూ
పెల్లుబుకిన దేశభక్తితో ప్రతిస్పందించారు;
ఎంపికలో తమ తమ ప్రాంతాలలోని
అద్భుత కట్టడాలు ఉండాలని పరితపించారు;
అతి విచిత్రంగా అందరిలోనూ చరిత్ర పట్ల అవగాహనను పెంపొందింప జేసింది.
తమ స్థానిక ప్రకృతి వింతల పట్ల ఆసక్తిని,
నవ్యోత్సాహాన్ని ఇనుమడించేలా చేసిన అపూర్వ సంఘటన ఇది "
అని ఒప్పుకోవాల్సిందే!

కెనడా - స్విస్ , బెర్నార్డ్ వెబెర్,
గవర్నమెంటు పర్యవేక్షణలో కొత్తగా ప్రపంచ వింతలను సేకరించింది.
ఈ ఐడియా కొత్తగా, ప్రజాభిప్రాయ సేకరణలపైన ఆధారపడి కొనసాగింది.
మొబైల్ ఫోన్లు ద్వారా ఈ కార్యక్రమాన్ని,
ప్రణాళికా బద్ధంగా విజయవంతంగా నిర్వహించారు.
గవర్నమెంటు పర్యవేక్షణలో, ప్రైవేట్ సంస్థ ద్వారా;
కెనడా - స్విస్ , బెర్నార్డ్ వెబెర్,
కొత్తగా సేకరణ పద్ధతి ద్వారా సేకరించిన ప్రపంచ వింతలను ప్రకటించింది

" Times of India " మున్నగు పత్రికలు, ఔత్సాహికులు ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా,
ఇండియా లోని ఏడు వింతలుగా select ఐనవి;

1.హంపీ ;

2. ఒరిస్సాలోని కోణార్క దేవళము ;

3. నలందా విశ్వ విద్యాలయము;

4. పంజాబ్ లోని అమృతసర్ నగరములోని "Golden Temple" "స్వర్ణ దేవాలయము ;

5.శ్రావణ బెళ గొళా ,గోమఠేశ్వర విగ్రహము ( మహా బాహు మూర్తి,కర్ణాటక రాష్ట్రము );

6.ఖుజురాహో దేవాలయాలలోని శిల్పాలు ;

7. ఆగ్రాలోని తాజ్ మహల్ ;
వీనిలోని "తాజ్ మహల్" ,అటు UNESCO యొక్క పాత లిస్టులోనూ,
గవర్నమెంటు పర్యవేక్షణలో, ప్రైవేట్ సంస్థ ద్వారా ప్రకటితమైన నవీన పట్టికలో కూడా ఉన్నది

ప్రపంచ వింతలు - వెబర్ ప్రణాళిక
___________________

కెనడా - స్విస్ , బెర్నార్డ్ వెబెర్,
కొత్తగా సేకరణ పద్ధతి ద్వారా సేకరించిన
ప్రపంచ వింతలను ప్రకటించింది

ఈ ప్రాజెక్టుకు Swiss-originated Canadian filmmaker and aviator
సెప్టెంబర్ 1999 లో శ్రీకారం చుట్టారు.

2001 నుండి ఒక కెనెడియన్ సైట్ కి 700 డాలర్లును రుసుముగా వెబెర్ (
Mr. Weber )చెల్లించాడు,
వెను వెంటనే వారు ప్రజలు అందరూ విరివిగా ఈ ఓటింగులో పాలు పంచుకున్నారు .
100 మిల్లియన్లు మంది ఈ voting లో పాల్గొన్నారు;
దీన్ని బట్టి " New Seven Wonders of the World " అనే
ఈ కాన్సెప్టు జనాలను ఎంతగా ఆకర్షించిందో బోధ పడుతుంది.
కార్య రంగంలోకి దిగారు.
వారు నిశిత పరిశీలనలు చేసి, అనేక వడ పోతల తర్వాత చేసిన ఎంపికలు ; ;

New seven Wonders ,
పోర్చుగల్ లోని లిస్బన్ పట్టణంలో
జూలై 7, 2007 న విజేతలను ప్రకటించారు.
New seven Wonders

July ,2007 లో ఇండియా లో భారత దేశములోని అద్భుతాలను ఎన్నిక
చేయడానికై యావన్మందీ జిజ్ఞాసతో పాల్గొన్నారు.
రేడియో స్టేషన్లు, టి వి చానెళ్ళు,మొబైల్ కంపెనీలు ,సెలెబ్రిటీలు
అనేక మంది స్వచ్చందంగా ఉదార పూర్వకంగా భాగస్వాములు అయ్యారు.

*********************************************************

By kadambari piduri, - Feb 5 2010 6:01AM

2 కామెంట్‌లు:

ramnarsimha చెప్పారు...

Very interesting..

Thanq..

kadambari చెప్పారు...

రామ నరసింహ గారికి,
నా వ్యాస అంశములు మీకు నచ్చినందుకు కృతజ్ఞతలు.

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...