29, ఆగస్టు 2009, శనివారం

గుండె-గుప్పెడు అటుకులు ( aavakaaya.com )

పువ్వాడ శేషగిరిరావు గారు విజయవాడలో ఉన్నారు.
బెజవాడలోని , S.K.P.V.V.school లో టీచరుగా పని చేస్తున్నారు.
ఆ ఉన్నత పాఠశాలకు "విద్యా ప్రమాణాల తనిఖీ" జరగబోతున్నది.
పేరయ్యశాస్త్రి గారు ఇనస్పెక్షను డ్యూటీ చేయడానికి వచ్చారు.
"మీ సైన్సు పుస్తకములను తెఱిచి చూడండి."విద్యార్ధులను అడిగారు పువ్వాడ.
"అందులో గుండె బొమ్మ ఏ రూపంలో, ఎలా ఉన్నదీ చెప్పండి." అని అడిగారు. పిల్లలు జవాబు ఇచ్చిన తర్వాత, కొనసాగిస్తూ, తన పాఠాన్ని ఇలాగ వివరణాత్మకంగా నుడివారు పువ్వాడ.
"శ్రీ కృష్ణ పరమత్మకు కుచేలుడు గుప్పెడు అటుకులను బహుమానంగా ఇచ్చాడు. అంటే సుదాముడు అనబడే ఆ కుచేలుడు, పిడికిలి ఆకారములో ఉన్న హృదయాన్నే తన బాల్య మిత్రునికి అర్పించాడు - అన్నమాట."
ఈ వివరణాత్మక స్పర్శకు పేరయ్యశాస్త్రి ముగ్ధులు అయ్యారు అని వేరే చెప్పనవసరము లేదు కదా !

kadambari piduri

24, ఆగస్టు 2009, సోమవారం

బట్టలకొట్టులో మాటల ఖరీదు

దుస్తుల అంగడిలో బేర సారాలు ------> (click on SIrshika ) ;;;;;
------------------------------------------------------------------
"పట్టాభి సీతా రామయ్య ఖద్దరు షాపు " ను పెట్టారు.
ఓక రోజు వారి బాట్టల అంగడికి ఒక స్త్రీ వచ్చినది.ఆమె వచ్చినప్పటి నుంచీ, అలమార్లలో నుండి దింపించిన దుస్తులు అన్నింటికీ లోపాలు ఎంచుతూనే ఉంది .
"ఈ గుడ్డకు ఆ చీర లాంటి అంచు కావాలి. ఈ వస్త్రానికి ,ఆ దుస్తులకు ఉండిందే...అలాంటి కొంగు డిజైను కావాలి. అలాంటి దుస్తులకు ఇలాంటి పువ్వుల బుటాలు ఒత్తించండి........."ఇలాగ ఆమె బేర సారాలు అంతు పొంతూ లేకుండా సాగి పోతూనే ఉన్నాయి.
చూసి చూసి,పట్టాభి ఇలాగ అన్నారు. "అమ్మా! మీకు పెళ్ళి అయ్యిందా?"
"అయ్యిందండీ! " తల ఊపుతూ, సమాధానం ఇచెప్పింది.
"ఆ ! మరేం లేదూ ,మీ శ్రీ వారికి ఫలానా ఆయన లాంటీ క్రాఫూ, ఈయన లాంటి రంగూ, మరొహ మనిషి లాగా ఒడ్డూ పొడుగూ

వగైరాలు కావాలని పెళ్ళి చూపులు జరిగిన రోజున అడిగారేమోననీ."
పట్టాభి తనకు వచ్చిన సందేహాన్ని వెలి బుచ్చారు.

20, ఆగస్టు 2009, గురువారం

ప్లేటో మహోన్నత భావాలు

"భూతల స్వర్గము" ( ఉటోపియా ) ఆతని తీపికల. ఆ కలను సాకారం చేసుకునేటందులకై ఆతడు ఎంతో శ్రమించాడు. పాశ్చాత్య దేశములలోని తత్వ శాస్త్రములకు ఆది గురువు వంటి ప్లేటో క్రీస్తు పూర్వము 427 లో జన్మించాడు. ఏథెన్సు నివాసి అయిన ఈతని విశ్వ విఖ్యాత రచన"ది రిపబ్లిక్". రచనా శైలిలో పూర్తి విభిన్నతను రంగరించుకున్నది"ది రిపబ్లిక్". కావ్యవేదికపైన ఒక సరికొత్త శైలిని అంకురార్పణ చేసింది ఈ ఉద్గ్రంథం.

గురువు ప్లేటో, తన శిష్య పరమాణువులకు కలిగిన సందేహాలను తీర్చుతూండే వాడు. అలా వారి మధ్య జరిగిన ప్రశ్నోత్తర కార్యక్రమములు అన్నీ, పూస గుచ్చినట్లుగా, ప్రతి సన్నివేశమునూ అక్షరబద్ధం చేయబడి,"ది రిపబ్లిక్"గా విద్యావేత్తలకూ, సామాజిక ప్రగతికాంక్షా పరులకూ అమూల్య వరంగా ఒనగూడినది. చర్చరూపంలో, సంభాషణా శైలితో సమకూర్చబడిన ఈ గ్రంథమును చదివితే, "శాస్త్ర, శాస్త్రీయ, పరిశోధనా గ్రంథాలను కూడా, ఏకబిగిని చదివించగల శక్తి గలది ఈ శైలి" అని బోధపడుతుంది. "Philosophers should be kings".

ప్లేటో తాత్విక గురువైన సోక్రటీసు మరణానంతరం, ప్లేటో దేశాటన చేసాడు. "భూతల స్వర్గము" (ఉతొపీ) ఆతని తీపికల. ఆ కలను సాకారం చేసుకునేటందులకై ఆతడు ఎంతో శ్రమించాడు. అతడు మెగారా నగరానికి వెళ్ళి, ఇటలీ, సైరీని, సిసిలీ, ఈజిప్టు ఇత్యాది పరిసర దేశాలలో పర్యటించాడు.

'ఏథెన్సు' లో 388 B.C. లో యూనివర్సిటీని నెలకొల్పాడు. ఆ విశ్వవిద్యాలయము తర్వాతి
తరాలవారికి, విద్యాలయాల రూపకల్పనకు మార్గదర్శకము ఐనది. ప్లేటో తన మధుర
"యుటోపియా"ను సాకారం చేసుకోవడానకై ఎంతో పరితపించాడు. కానీ, తన ఆదర్శాలను
అమలు చేయడంలో విఫలమైనాడు. తదుపరి, ఆ లక్ష్య సాధనకై విరామము ఎరుగని శ్రమ, కృషిలతో కొనసాగిన ఆయన జీవనయానము, ఆతని 60వ ఏట, 348 A.D.లో అస్తమించినది.
ప్లేటో ఉద్గ్రంథాల తీరు తెన్నులలో కొన్ని ముఖ్యాంశాలు గోచరిస్తాయి. తాను చెప్ప దలుచుకున్న అంశాన్ని పాఠకుల మీద బలవంతంగా రుద్దాలని యత్నించడు. "దీనినే ఖచ్చితంగా మీరందరూ ఆచరించి తీరాలి" అని పట్టు బట్టడు. "ఇదే అంతిమ సిద్ధాంతము" అంటూ, నిర్ధారణ చేసే స్వభావం కాదు అతనిది.

నిజమే కదా! ఏ భావ జాలమైనా ఆచరణాత్మకమైనవి అయితేనే, అందరి చేత ఆమోదించబడతాయి. ఒక వేళ గురువులు గానీ,
నాయకమ్మన్యులు గానీ వెలిబుచ్చిన అభిప్రాయాలూ, ఆదర్శాలున్నూ, స్వాభావికతతో,
సమాజంలోని జనుల మనుగడ యొక్క భద్రతకు మద్దతునూ, హామీని ఇచ్చినంతవరకే అవి అన్నీ ప్రజామోదాని పొందుతాయి. అప్పుడే కాలానికి ఎదురీది, కాలక్రమేణా అవి ప్రజాబాహుళ్యము చేత నీరాజనాలు పొందుతాయి. ఈ వాస్తవమును గుర్తించిన ప్లేటోను తత్త్వవేత్తయే కాదు, గొప్ప మానసిక తత్వజ్ఞుడు అని కూడా చెప్ప వచ్చును. దేనినీ "ఇతమిత్థము" అని అంటూ ఆజ్ఞాపించడు, తీర్పును ఇవ్వడు. తుది నిర్ణయాన్ని యావత్తూ చదువరి బుద్ధిని పదును పెట్టే పద్ధతిలో అట్టి పెట్టేస్తాడు. వాదనలు, ఖండన మండన రూపంలో సాగుతూండే సంభాషణలు, గ్రంథ రూపమును పొందాయి. మధుర కావ్య ఫణితిలో ఉన్న ఈ శైలి, పాఠకుని ఏక బిగిని చదివేలా చేస్తున్నది. కనుకనే, నేటికీ The Republic తాత్వికశాస్త్ర జగత్తులో సుస్థిర స్థానమును పదిలపరచుకున్నది. మనోజ్ఞ సమాజ
నిర్మాణమును వాంఛించే నేతలకు, సంఘ సంస్కర్తలకు, అందు బాటులో 'జఏయ్ గంటలు' ఇవి. ప్లేటో భావాలు రచనా ప్రపంచములో చ్యుతి లేని దివ్య తారలు, మసక వేయని సూర్య బింబ కాంతులు. అవి నిత్యోద్బోధకములు. తత్ స్వభావ ప్రభావం సోకనటువంటి, పాశ్చాత్య
దార్శనికుడు ఒక్కడైనా లేడు."అంటూ హిందూ తాత్విక పరిశీలకులు అభిప్రాయ పడ్డారు. అంతే కాదు! "ఆ 'జేగంటలు' మన భారతీయ దార్శనికులకు ఉపనిషత్తుల వంటివి."అని తలచారు.

ప్లేటో అనంతరం వెల్వడిన తాత్విక సిద్ధాంతాలు యావత్తూ పడమటి సంధ్యా రాగములే! ఆ
మేధావి భావనలకు టుఫ్టీకలే! ప్రొఫెసరు వైట్ హెడ్ ఇలాగ సెలవిచ్చాడు,"యదార్థంగా ఆయా
భావాలను, ప్లేటో రచనలు ఎంత వరకు ప్రతిపాదిస్తున్నవో, అలాగే పాఠకుని బుద్ధీ, ఆలోచనలూ ఆయా భావాలను ఎంత వరకు నిర్ధారిస్తూన్నవో విభజించి తెలియ జెప్పడము కష్ట సాధ్యము."
తత్పూర్వము ఉన్నట్టి పైథాగరస్, ఫార్మనీడ్స్, హిరాక్లిటస్,సోక్రటీసు మున్నగు గ్రీకు తత్వవేత్తల ప్రభావం ప్లేటో మీద అత్యధికంగా ఉన్నది. తనకు పూర్వమే నెలకొని ఉన్న అభిప్రాయ సరళిలోని మంచిని గ్రహించి, తన తదుపరి ప్రపంచానికి అమోఘ గ్రంథరత్నంగా అందీయగలిగాడు ప్లేటో.

"మేలైన సమాజం నిర్మాణమునకు పునాది వంటిది విద్యయే!" అని గ్రహించిన కుశాగ్రబుద్ధి ఐన ప్లేటో మహనీయుడు -"చదువు"గురించి ప్రతిపాదించిన సూక్తి కిరణములను చూద్దాము.
విద్య సంప్రదాయ సిద్ధంగా ఉన్నదే మంచిది, దాని కన్నా మేల్తరమైనది లేదు.

శరీర సౌష్ఠవమునకు అవసరమైనది వ్యాయామము.
ఆత్మానంద పరిణతికై 'సంగీతము,నాట్యము, లలిత కళలు' అత్యంత ఆవశ్యకములు.

విపరీత గుణబోధిత కథలపై, పైత్య ప్రకోపిత భావజాలమను ప్రోత్సాహించే రచయితల యొక్క "చే వ్రాతలపై" ఆంక్షలను విధించడము ప్రథమ కర్తవ్యము. ఈ అభిప్రాయ పరంపర, మన భారతీయ ఆత్మకు సన్నిహితంగా ఉన్నది. చతుష్షష్ఠి కళలను మన దేశములో ఒక కాల్పనిక అవసరముగా గుర్తించారు హిందూ తత్వ వేత్తలు. ముఖ్యముగా మన అలంకార, లాక్షణిక రూప శిల్పులు..కనుకనే వారు, "సంగీతమపి సాహిత్యమ్, సరస్వత్యా స్థన ద్వయమ్ ఏక మాపాత మధురమ్, అన్యదాలోచనామృతమ్" అంటూ నిర్ద్వంద్వంగా ప్రకటించారు. ప్లేటో"ఆరోగ్య పరి రక్షణకూ, తద్వారా మాతృదేశ రక్షణకూ మనుష్యులకు వ్యాయామము తప్పని సరి"అంటూ ఘంటాపథంగా ఎలుగెత్తిచాటాడు. వ్యాయామం విషయంలో, మన పూర్వీకులకూ, ప్లేటో భావములకూ విభిన్నత కాన వస్తూన్నది. సాత్విక రూపములో మలచబడినవి మన వ్యాయామములు. సూర్య నమస్కారములు, యోగాసనములు వంటివి సూత్రీకరించ బడినాయి. అంతే కాదు, అవి నిబద్ధతతో పాటించగల
ఆచారములుగా అనుకూలించ బడి, నిత్య జీవనములో అవిభాజ్య శైలులుగా అనుకూలించ బడినాయి.
(అయితే- గుర్రపు స్వారీ , మల్ల యుద్ధము వంటివి సైనికులు, రాజ వర్గము వఱకే
పరిమితమైనాయి.)

ప్లేటో ఉవాచను గమనించండి...
"ప్రాచీన కాలములోని గ్రీకు కావ్యములలో,
కొన్ని కథలు విపరీతముగా ఉన్నవి. వాటిలో కొన్నింటిలో-'తల్లిని దండిస్తూన్న తండ్రి,
వివాహ సమయములో మీకు దీవెనలు ఒసగిన దేవుడు, స్వయంగా కుమారుణ్ణే వధించుట'ఇలాంటి
వానిని సర్వత్ర నిషేధించాలి. ఇలాంటి రూపకములను, నాటకములను ప్రదర్శించ రాదు."{*1}
ప్లేటో వాక్కులు గుర్తించండి...
"ప్రాచీన కాలములో ఏమి జరిగెనో, మనకు
తెలియదు. ప్రపంచములోని మనమంతా అసత్యాన్ని సాధ్యమైనంత వఱకు "సత్యము" వలెనే భాసింప
జేసి, ఉపయోగించు కుంటున్నాము" అంటూ, ప్లేటో "పౌరులలో సాత్విక, సమ శీలతలను పాదు
కొల్పే అంశాలనే స్వీకరించాలని" అభిప్రాయ పడ్డాడు.
"మన రక్షకులు,యదార్ధంగా దైవ
భక్తులై ఉండాలలి" మనము ఆకాంక్షిస్తున్నాము. అందు వలననే, ఇలాంటి నిషేధిత విపరీత
సంఘటనలను ఉపాధ్యాయులు గమనించి, వాటిని బాలలకు చెప్పరాదు. బాల బాలికల సుశిక్షణ కోసము
అలాంటి దృశ్యాలను ఉపయోగించరాదు. వీటిని ఎల్లప్పుడూ శాసనల వలెనే పాటించ వలెను.
దేవతల యందు, తల్లిదండ్రుల పట్ల
భక్తి ప్రపత్తులను ప్రజానీకంలో నెలకొల్పే దిశగా, ప్రాచీన కావ్యాలలోని అంశాలను
పరిగ్రహించాలి. మన దేశంలో వలెనే, అనేక ప్రాంతాలలోని ప్రజలు ఆయా సీమలలోని వారికి,
సముచిత ఆచారాల ద్వారా సమున్నత సమాజాన్ని అందీయ గలిగిన వారిని ఎంచుకుని,
ఆరాధిస్తూంటారు. ఆదర్శ వ్యక్తిత్వం కలవారిని,"దైవ స్థానము"లో ప్రతిష్ఠించి,
పూజిస్తారు. "ఎలాంటి వ్యక్తిత్వం
కలవారిని దేవునిగానూ, లేక దేవతలకు ప్రతి రూపములుగానూ స్వీకరించి అర్చిస్తారు?"అనే
విషయం, ఆయా ప్రజానీకపు హృదయ సంస్కృతీ, సంస్కార విస్తృతిపైన ఆధారపడి,
విస్తరిల్లుతుంది .
సాధారణంగా పురుషోత్తముల గాథలే ప్రచారాన్ని పొంది, క్రమంగా వారే
ఆరాధ్యనీయులౌతారు. కాలక్రమేణా ప్రజాబాహుళ్యము యొక్క మూర్తిమత్వములను, ప్రవర్తనా సరళినీ రూపొందించగలిగిన"అజ్ఞాత కారణాల ప్రభావం"గా వారి ఆదర్శ వ్యక్తిత్వాలే
శాశ్వతంగా అలరారుతూంటాయి. ఇలాటి
హేతువుల సంపుటియే "ప్లేటో అద్భుత భావ వల్లరి". ఆ గ్రీకు గురువు అధ్యాపకుడు అంటాడు కదా,"తప్ప త్రాగుట, రహస్య కామములు, ధన లుబ్ధత, పేరాస, లంచములు వగైరా కార్య
కలాపములు, ఇట్టి గుణములను దేవతలకు, ఉత్తమ పురుషులకు ఆపాదించ రాదు."సహజమే కదా!
ఇలాంటి సర్వ సద్గుణాలతో విలసిల్లే విలాస పురుషులను "ప్రతి నాయకులు"(విలన్లు)
అవుతారు గానీ, "కథానాయకులు"(హీరోలు) గా ఎలాగ పరిగణించ గలము? ఇలాంటి సంస్కారమే"శ్రీ
రామచంద్రుని వంటి పురుషోత్తములను 'దైవములు' గా ప్రజలు కొలిచేటట్లు చేసినది కదా!"
ప్లేటో నిర్దేశనలో చదువు......
విద్యను ఆరంభించినప్పుడు, వర్ణ సమామ్ణాయము
అంతా నేర్పించవలెను.అక్షరములు ఎలాంటి కలయికలో ఉన్నప్పటికీ, ఏ ప్రమాణములతో ఉన్నా, ఆ సారాంశాన్ని గ్రహించగలిగినప్పుడే, సంతృప్తిని పొందగలుగుతాము. అంతే గానీ, వర్ణాలు, లిపి చిన్నవా? మరి పెద్దవా? అని చూడము. కనిపించిన చోట నెల్లా వాటిని చదవడానికి యత్నిస్తాము. అక్షరములు, నుడులు ఎక్కడ గోచరించినప్పటికిన్నీ, అవ్వానిని గుర్తించ గలిగినప్పుడే కదా! పఠన యోగ్యత సిద్ధించినట్లు?
ప్లేటో తను ఉన్నట్టి ఆనాటి సమాజంలో"దేశాన్ని పరిపాలించే చక్రవర్తులను సత్ప్రవర్తన కలవారినిగా తీర్చిదిద్దే సద్విద్య కావాలని" అభిలషించాడు. భవిష్యత్ పాలకులైనా సరే! మన వద్ద శిక్షణను పొందేటప్పుడు, వారిలోని ప్రధాన లోపాలు, ఏ సంశ్లిష్ట రూపాలుగానో ఎక్కడ
గోచరించినపటికిన్నీ; చిన్న పెద్ద వానిలో కనిపించినప్పటికిన్నీ, వాటిని, అనగా
ప్రవర్తనాపరమైన లోపాలను అలక్ష్యము చేయరాదు. అంటే, రేపటి పాలకులుగా ఉంటూ, ఈనాడు విద్యార్ధిగా వచ్చిన బాలురిలోని లోపాలను ఉపాధ్యాయుడు గుర్తించాలి. అవన్నీ సంస్కరించ బడాలి. సత్ప్రవృత్తి , ఒకే కళకు, శాస్త్రానికి చెందినవనే విశ్వాసాన్ని పొందనంత
వఱకూ, వారిని అంటే భవిష్యత్తులో పాలకులుగా మార బోతున్న విద్యార్ధులను 'విద్యా
సమగ్రత, ఉత్తీర్ణతలు' పొంద లేదనే భావించాలి.
విద్యార్ధులు, యువకులు"సంగీతసాహిత్యాలను అభ్యసించాలి. అలాగే అంతే
ప్రాధాన్యంతో వారు అభ్యాసం చేయవలసినదీ వ్యాయామమును కూడా!"అంటూ దేహ దారుఢ్యము కొరకు పొందవలసిన క్రమశిక్షణ ప్రాధాన్యత గురించి కూడా నొక్కి వక్కాణించాడు. ప్లేటో వ్యాయామము,శరీర దారుఢ్యము యొక్క ఆవశ్యకతను గుర్తించిన గురువు. శారీరక పరిశ్రమను గురించి ప్లేటో ఎంతో విపులంగా చర్చించాడు. జైత్ర యాత్రలో తిండి మార్పులు, నీటి మార్పులు ఉంటాయి. అన్ని రకాల మార్పులకు యువకులు తట్టుకో గలగాలి, వేసంగి వెట్టకు
ఉడికి పోవాలి. చలిలో 'ఇవానికి '(శీతలత్వానికి)కొంగర్లు తిరిగి పోవాలి. అలాంటి
స్థితిలో కూడా వారు అనారోగ్యం పాలు కా కూడదు. "వ్యాయామ క్రీడాకారులకు
నిద్రమత్తు, సోమరితనము పనికిరాదు. ఉత్తమ వ్యాయామము ఆరోగ్యమునూ, దేహ దారుఢ్యాన్నీ పరిఢవిల్ల జేస్తుంది. ప్రజానీకము అందరికీ గరిష్ఠమైన సుఖము లభ్యము కావాలి. ఇదే మన ప్రధాన లక్ష్యము." స్త్రీల గురించి పాశ్చాత్య దేశాలలో ప్రముఖస్థానాన్ని ఏర్పరచగలిగినటువంటి దార్శనికుడు ప్లేటో. మహిళల విద్య గురించి ప్లేటో వ్యక్తీకరించిన అభిప్రాయాలను గమనించండి. "స్త్రీలు, బాలికలు కూడా గుఱ్ఱపు స్వారీని, యుద్ధ విద్యలను అభ్యసించాలి. వనితా మణులు కూడా సైన్యములో ఒక భాగముగా చేరినా, దాని పశ్చాద్గత శ్రేణిలోచేరినా, సైన్యానికి వారే అండ దండలు ఔతారు. స్త్రీలు కూడా పాల్గొనిన యుద్ధవ్యూహాల వలన, శత్రువులకు వారే సింహ స్వప్నమౌతారు. అలాంటి సైనికులే శత్రు భయంకరులు ఔతారు. అట్టి సైన్య బలగమే రిపులకు గుండెల్లో దడ పుట్టిస్తుంది. తత్వవేత్తలు అధిపతులుగా, రాజులుగా ఉంటే మేలు జరుగుతుంది."అని భావించాడు ప్లేటో. అందుకనే ఆ
మహాశయుడు, తన ఆదర్శసామ్రాజ్య చిత్రీకరణలో అతివలకు అత్యంత ప్రాధాన్యతను ఇచ్చాడు. మహిళలకు ఎంతో ప్రముఖస్థానాన్ని ఇచ్చిన ప్లేటో సుభాసితములు:
"చెప్ప వలసినది ఉన్నది కనుకనే మాట్లాడుతాడు వివేకి. ఏదో ఒకటి చెప్పాలని మాట్లాడుతాడు అవివేకి."అని నిర్వచించిన ప్లేటో వాక్కుల మహోద్గ్రంధమైనట్టి"ది రిపబ్లిక్"లోని ప్రతి అభిప్రాయ సుమమూ నిత్యోన్మేష పరీమళ భరితమే! ప్రతి ఉద్దేశ్యమూ నవ్య శ్వేత కిరణ బిందువునుండి ఉత్పన్నమౌతూన్న ఉజ్జ్వల ఇంద్ర ధనుస్సుల ఆకర్షణీయమైన వర్ణములే!

18, ఆగస్టు 2009, మంగళవారం

ఏం కావాలి? నాయనా !

1965 ల నుండి ఆకాశవాణి(అదేనండీ! రేడియో)లో భారత, భాగవత, రామాయణములను తెలుగులో వ్యాఖ్యానములను విపులముగా, వివరంగా చెప్పేవారు. అలాగే శ్రోతల కోసం "ప్రశ్నోత్తరములు" శీర్షిక సర్వ జనానురంజకముగా ఉండేది. విలక్షణ కంఠముతో పాప్యులారిటీని సముపార్జించారు, ఆయనే "ఉషశ్రీ".

మిమిక్రీ కళాకారుల ఐటమ్ లలో ఆయన గాత్రము, శైలి, ఉచ్ఛారణ ఉండేవంటే ఉషశ్రీ కంఠములోని వైవిధ్యత ఎంతగా ప్రజలను ఆకట్టుకున్నదో గ్రహించ వచ్చును.

విజయవాడలో రేడియో కేంద్రములో ఉన్న రోజులలో ఒక వింత సంఘటన జరిగింది. పనిలో తల దూర్చారంటే, ఉషశ్రీకి బయటి ప్రపంచము తెలిసేది కాదు. సాహిత్యాభిలాష మిక్కుటము కాబట్టి పరిసరాల గురించి ఉషశ్రీకి ఆట్టే పట్టేది కాదు.

ఒకతను రేడియో స్టేషనులో కాంట్రాక్టు ఉద్యోగము కోసము ఆశతో ప్రయత్నము చేసుకుంటున్నాడు. ఉషశ్రీ పని ఒత్తిడితో సతమతమౌతూన్నారు.

ఉషశ్రీ రికమెండేషనుకై ఆతడు ప్రయత్నం చేయసాగాడు. ఐతే కార్య భారము వలన ఒకింత విసుగ్గా ఉన్నారు ఉషశ్రీ. తన ఎదుట కొత్త మనిషి నిలబడి ఉన్నాడనే స్పృహ కూడా లేకుండింది. అటూ ఇటూ పరిగెత్తుతూన్నపుడు, రవ్వంత అతను గోచరించాడు
.
"ఏం కావాలి? నాయనా!"
"తమరేది ఇప్పించినా సరే!" - చేతులు నులుముకుంటూ అన్నాడు అతడు.

వెంటనే ఆఫీసు కుర్రాణ్ణి పిలిచి "వీరికి టీ ఇచ్చి పంపించు" అనేసి తిరిగి తన పనిలో

తల మునకలయ్యారు ఉషశ్రీ.

15, ఆగస్టు 2009, శనివారం

గాంధీ తాతకు జేజేలు!

మా గాంధి నామము మరువం!మరువం!
---------------- -----------------
1)కొల్లాయి గట్టితేనేమి
మా గాంధి-కులము ఏదీ ఐతేను ఏమి
(=కోమటై పుట్టితేనేమి? )
2)వెన్న పూస మనసు-కన్న తల్లి ప్రేమ
పండంటి మోముపై బ్రహ్మ తేజస్సు //
3)నాల్గు పరకల పిలక, నాట్యమాడే పిలక
నాలుగు వేదాల నాణ్యమెరిగిన పిలక //
4)బోసి నోర్విప్పితే -ముత్యాల తొలకరే!
చిరు నవ్వు నవ్వితే -వరహాల వానలే!//
మన భారత దేశమునకు స్వాతంత్ర్యమును ఆర్జించే దిశలో సాగిన పోరాటాలలో-సాహిత్యం వేసిన ఉరుకుల పరుగుల-ముందడుగులలో-ఎన్నెన్నో కవితల ఆణి ముత్యాలలో, ఇలాగ ఒకటి, రెండు గీతాలను మళ్ళీ జ్ఞప్తికి తెచ్చుకుందాము.
నా చిన్నప్పుడు,ఆకాశ వాణిలో, అదేనండీ రేడియోలో నన్న మాట, ఒంటి కాలి మీద నిలబడి మరీ పిల్లకాయలము, ఏక దీక్షగా, ఏకాగ్రతతో వింటూండే వాళ్ళము. ఆ రోజులలో, రేడియో అపురూపమైన వస్తువు. దానిని పాడు చేస్తారేమో ననే భీతితో, భయంతో పిన్నలకు అందకుండా పెద్దలు, అలమారలో భద్రంగా పై అరలలో పెట్టేవారు. బాల బాలికలు వినదగినవీ, వారి విద్యాభివృద్ధికీ, వారిలో దేశ భక్తిని పెంపొందింపజేయగల ఐటంసు అని వారు అనుకున్న ప్రోగ్రాములనూ విన నిచ్చే వారు. అందుకే ఆ కొన్ని కార్యక్రమాలనూ, ఒంటి కాలి తపస్సు చేస్తూ, దోరగా చెవులు అప్పగించి మరీ వినే వాళ్ళము.

11, ఆగస్టు 2009, మంగళవారం

మజాగా చేసిన మనువు

మజాగా చేసిన మనువు ::::
----------------
భాషకు సంబంధించిన హాస్య,చమత్కారములు,హృదయాహ్లాదకారకములే!ఆ దిశలో,భాషా గని నుండి అగణిత సంఘటనలు మనకు లభిస్తూనే ఉంటాయి.ఆ రత్నాలను,తుడిచి,మసక బారనీయకుండా,మరల మరల,అందరికీ మానస సీమలలో దృశ్యమానం చేయడమే,ఈ పౌనః పౌన్యత వలన లభించే ప్రయోజనం.
************************************************
స్వాతంత్ర్య సమరము అంటేనే,పూచిక పుల్లకి కూడా దేశభక్తినీ,ఆవేశాణ్ణీ,ఉత్తేజాన్నీ కలిగించే చారిత్రక సంఘటనల సమామ్నాయము.అదే దేశ భక్తి ప్రతి ఒక్క వ్యక్తిలో "ఈ సీమ నా మాతృభూమి,ఇందు ఉద్భవించిన ప్రతి అంశాన్నీ పరి రక్షించుకోవాలి."అనే తపన.
ఫలితంగా,సమాజమునకు లభించిన సాంస్కృతిక సంపదను భద్ర పరుచుకో సాగారు.అదే విధంగా,సంఘాన్ని పట్టి పీడిస్తూన్న,మూఢ నమ్మకాల బూజును దులిపి వేసి, నవ్య సామాజిక చిత్రణమును,నవీన వర్ణ భరితంగా చేయడానికి నడుం కట్టారు.ఈ మహోద్యమములో,ఎందరో,సంఘ సంస్కర్తలు తమ జీవితాలను ధార పోసారు.
వారి త్యాగమయ గాథలకు చలువ పందిళ్ళు వేసిన అలనాటి,స్వరాజ్య పోరాట కాలము ,మహనీయుల చేతలతో పునీతమైనది.
***********************************************
దుర్గా భాయి దేశ్ ముఖ్ మడమ తిప్పని యోధ వనిత.ప్రాణ భీతినెరుగని మహిళ.నేతి సీతా దేవి ఆమె జీవిత చరిత్రను అక్షర బద్ధము చేసారు.
దుర్గాభాయ్ ప్రజలలో అమితముగా వాసికెక్కినది.ఆట్టే ఫ్యాషన్లు తెలియని ఆ రోజులలో,"దుర్గా బాయ్ అంచు చీరలు-విపణి వీధులలో,(అదే లెండీ:మార్కెట్టులో అన్న మాట!)వచ్చాయి;స్త్రీలు"దుర్గా భాయి అంచు చీరలను కట్టు కున్నారు"అంటే,ఆమెకు ఎంతటి పేరు,ప్రఖ్యాతులు వచ్చాయో మనము అర్ధము చేసుకోవచ్చును.
"""""""""""""""""""""""""""""""""""""""""""""""""
గోరా భార్య పేరు సరస్వతి.కాకినాడ శానిటరీ ఇనస్పెక్టరు,దుర్గ,మున్నగు వారు కొద్ది మంది ఒక వితంతు వివాహాన్ని,చేయడానికి నడుం బిగించారు."నాస్తికులు"అంటూ,దూషించారు,సాంప్రదాయ వాదులు.ఆ పరిణయ వేదికకు,పురోహితులు ఎవ్వరూ రాలేదు.
తత్ఫలితంగా,మార్పును కాంక్షిస్తూన్న ,పురోగామి వర్గీయులు,వేసిన ముందడుగులు,గొప్ప ప్రభంజనాన్నే పుట్టించాయి.
అయ్యగారి అచ్యుత రామయ్య గారు,అర్జెంటుగా మంత్ర విధిని నేర్చుకున్నారు.
ఆయన పెళ్ళి మంత్రాలు చదివి,ఆ పెళ్ళిని చేసారు.
దుర్గ,ఆమె మరదలు తిమ్మా బాయి వీణతో హాజరయ్యారు.వారి సంగీత సామ్రాజ్యములో ఆ నాటి మేజువాణి వేడుక పరి పూర్ణమయ్యినది.

10, ఆగస్టు 2009, సోమవారం

భట్రాజీయం/భట్టు రాజీయం

క సభా వేదిక మీద ప్రముఖులు ఆసీనులై ఉన్నారు. ఆహ్వానితులలో పట్టాభి సీతారామయ్య, సి.పి.భట్ ఉన్నారు.
ప్రత్యేక అతిథిగా వచ్చిన C.P. Bhat వక్త. భట్టు గారు ఉపన్యసిస్తూ,"భోగ రాజు పట్టాభిరామయ్య ధర్మ గుణములో ధర్మ రాజు, త్యాగములో త్యాగరాజును మించిన మహోన్నత శీలుడు,....."అంటూ ఇలాగ పట్టాభి గొప్పదనాన్ని గురించి చాలా చాలా పొగిడాడు. ఈ పద్ధతిలో సాగిన ఆయన వాక్కులు యావత్తూ సీతారామయ్య గూర్చిన ప్రశంసా వాక్యాలతోనే నిండి పోయినాయి.
తదుపరి,సన్మాన గ్రహీత అయిన పట్టాభి సీత రామయ్య ప్రసంగిస్తూ ఇలా పలికారు.
"...నా సంగతేమో గానీ, ఇవాళ వారి మెప్పు ల వలన నేను ఆనందములో తడిసి, తరించి పోయాను. నా మీద అమిత అభిమానంతో, "భట్"గారు,"రాజు"లాగా నన్ను పొగిడారు."
పూర్వ కాలంలో చక్రవర్తులను, సామ్రాట్టులను పొగిడే వృత్తిలతో భట్రాజులు,
వందిమాగధులు మున్నగువారు ఉండేవారు.
"భట్రాజీయం"లోని శ్లేష అర్ధమైన సభికుల నవ్వులతో ఆవరణ కోలాహలంగా మారినది.
(kadambari piduri,
read my articles,songs for kids in ;
july,29,2009)

7, ఆగస్టు 2009, శుక్రవారం

గురువుకు తగ్గ శిష్యుడు

శా."నా మార్గమ్మును కాదు, శిష్యుడయినన్‌ నా తాత ముత్తాతలం
దే మార్గమ్మును కాదు; వీని దెదియో? ఈ వూర్గ మట్లౌటచే,
సామాన్యుండనరాదు వీని కవితాసమ్రాడ్వ్తమా హేతువై,
ఈ వుచ్చిష్యుని దా వరించినది, నేనెంతే ముదంబందెదన్‌ ."

సత్యనారాయణగారికి గుడివాడ ఎ.ఎన్‌.ఆర్‌. కాలేజీలో సన్మానం జరిగింది. ఆ సందర్భములో, చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రి గారు తొమ్మిది ఆశీర్వచన పద్యాలు చెప్పారు. వానిలోని ఎనిమిదవది పైన చెప్పిన శార్దూల ఛందస్సులోని పద్యము.
“నా శిష్యుడే అయినా, ఇతనిది నా పద్ధతి కాదు. నా తాత ముత్తాతల పద్ధతీ కాదు. (= మన పూర్వ కవులు) ఇతడిని సామాన్యుడు అని అనుకోకూడదు. కవితాసంరాడ్వ్తమాహేతువై ఈ నా శిష్యుడిని వరించింది. నాకెంతో సంతోషంగా ఉన్నది."
కోట సుందరరామశర్మగారు తమ కాలం నాటి తీపి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ,ఇలాగ సెలవిచ్చారు"చెళ్ళపిళ్ళవారి శిష్యుడిని అని చెప్పుకోవడం మా రోజులలో తెలుగు కవులకి, పండితులకీ ఒక certificate , యోగ్యతాపత్రం లాంటివే!. ఒక నెలో, రెండునెలలో చెళ్ళపిళ్ళ వారి దగ్గిర చేరి, వారి శిష్యుడినే అని వందలమంది గర్వంగా,ఆనందంతో చెప్పుకునేవారు.".
Aavakaya website lo చూడుము
By kadambari piduri,Jul 25 2009 1:35PM
("బాస, భాష" జొన్నలగడ్డ తో చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి సంభాషణ)

3, ఆగస్టు 2009, సోమవారం

పూల రంగడివి నీవేనయా!

నీవేమో పూల రంగడివి!
-----------------
వెన్నెలల పందిరిలో-
వెండి మబ్బుల్లు!
వెండి మేఘాల పైన-
జాబిల్లి ఠీవి చూడు !


మేఘ మల్హారం పాట-
హర్ష వర్షమే జగతికి!

కస్తూరి రంగయ్యా!-
కావేటి రంగయ్యా!-
మా బాలుడు 'టింగు రంగడు'!
నీవు' పూల రంగడివి' !

బాలలతో తారంగం-
ముద్దుల మురిపెమ్ములు!
ఆటలు ఆడేటందుకు-
వేగిరమే రావయ్యా! రంగ నాథ !
*********************************
*********************************
***************************************

శ్రీగంధము శ్రీపాద వస్త్రము

శ్రీవారి సేవలో ప్రతి అంశమూ నిత్య నూతనమే! ఆసక్తిదాయకమే!
గర్భ గృహము, స్వామి వారి శయన మందిరముల మధ్య ఉన్నది
"కుల శేఖర పడి". తిరుమలేశునికి ప్రతి శుక్రవారము అభిషేకములు చేస్తారు.
శుద్ధి పరచిన కర్పూరము, పసుపు ముద్దలను కలిపిన జలములను బయటే తయారు చేసి రజత కలశాలలో నింపి తీసుకుని వస్తారు. గర్భగుడికి తీసుకుని వచ్చి ఆ మధుర సన్నివేశాన్ని ప్రకటిస్తారు.
"ఇందిరా నిజ మందిరా!"
"హరి అంతరంగ శ్రీ లక్ష్మీ దేవి"
శయనవేళలలోన భోగ శ్రీనివాసునిగా భక్తుల హృదయారవిందములలో కొలువు దీరుతాడు శ్రీ వేంకట రమణుడు.
అందువలననే, భోగ శ్రీనివాసుని అలంకార సేవా విశేషములలో విశేషముగా ఎన్న దగినది శ్రీ గంధ సేవ.
ఆ భోగ శ్రీనివాసుని హృదయ భాగములో "శ్రీ గంధము రూపులో" లక్ష్మీదేవి కొలువు ఉన్నది.
"హృదయ లక్ష్మీ దేవికి గంధము"ను అద్దుతారు. ఆ గంధపు ముద్ద యొక్క పరిమాణములో సగము భాగమును పద్మావతీదేవికి అలదుతారు.
ఇలాగే శ్రీ వారి పాద కవచములను పునుగు నూనెను పూసి, వస్త్రముతో తుడుస్తారు.
ఈ వస్త్రమునే "శ్రీ పాద వస్త్రము"అని పిలుస్తారు."విశ్వ రూప సేవ"లో భక్తుల కళ్ళకు అద్దించి నుదుటికి తాకిస్తారు.
శ్రీ సప్త గిరీశ, శ్రీ వేంకటేశుని సేవలో వినియోగించిన వస్తు సంభారాలను స్పర్శించిన భక్తులకు లభించే పవిత్ర భక్తి భావనా తాదాత్మ్యతల విలువలు తులతూచ లేనివే కదా!
(See my articles);

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...