28, నవంబర్ 2017, మంగళవారం

శకారుని ఘోష యాత్ర

శకారుడు ;- విటూ, ఆ కాలి గజ్జెలు, ఆ అందెల సవ్వడి  ...
వసంతసేనవి అనిపిస్తున్నది ...
విరటుడు ;- చిత్తం ప్రభూ. ఆ కాలి గజ్జెలు, ఆ అందెల సవ్వడి  ... అవి అవే. 
శకారుడు ;- భేష్, ఐతే నా అనుచరుడు - 
ఈ విరటుడి చెవులు రెండు - బాగా పనిచేస్తున్నవన్న మాట.
విరటుడు ;- చిత్తం, ఈ విరటుని శ్రవణేంద్రియాలు బహు చురుకు. 
మీ మదిని రాపాడుతున్న ఆ వసంతసేన  జాడలను - 
ఇట్టే పసికట్టగలుగుతున్నవి.
శకారుడు ;- ఆ మదిరాక్షి వసంతసేనను లోబరుచుకులేకపోతున్నాను, 
నా రాజ పదవికి అవమానం.
విరటుడు ;- చిత్తం. గతంలో మూడు సార్లు వెంటపడ్డారు, ఫలితం శూన్యం. 
తుర్రుమని వెంట్రుకవాసిలో తప్పించుకున్నది. తప్పించుకో గలగడం 
ఆమెకు వెన్నతో పెట్టిన విద్య అనుకుంటాను. 
శకారుడు ;- తోటలో ఆ బాలుడు - చారుదత్తుని కొడుకు ఐ ఉంటాడు - 
ఇటు బయటికి రప్పించు, విటూ.
విరటుడు ;- బాబూ, ఇటు రా .....
రోహణుడు ;- నా పేరు రోహణుడు.
శకారుడు ;- రోహణూ! నీ బుల్లి బండి బాగుంది. 
ఇంతకంటే మంచి వెండి బండి బొమ్మను తెచ్చి ఇస్తాను నీకు, 
ఒక సంగతి చెప్పు. 
ఇప్పుడే మీ ఇంటి లోపలికి వచ్చింది, ఆమె మీ అమ్మ కదూ .
రోహణుడు ;- ఊహు, కాదు. మా అమ్మగారు ఊరికి వెళ్ళారు. ఈమె మా పిన్ని.  ;
శకారుడు ;- విటూ - పిన్ని - అని కూడా పిలిపించుకుంటున్నది, 
ఎంతైనా ఆ వసంతసేన జగజ్జాణ.
రోహణుడు ;- నా నేస్తాలు ఆటకి పిలుస్తున్నారు.
శకారుడు ;- విటూ, ఆ జగజ్జంత్రి -  వసంత సేన ఆ ఇంట్లోనే తిష్ఠ వేసింది. చూస్తాను, 
దీని పొగరు అణచకపోతే - నా పేరు శకారుడే కాదు, విటూ!
విర ;- చిత్తం, నాదొక చిన్న విన్నపం. విరాటుడని చక్కని పేరు నాది. 
మీరు - విటూ - అనేస్తున్నారు. వినడానికి ససిగా లేదు. విటుడు - అనే అర్ధం - వస్తున్నది.
[ఆర్యకుని దళంలోని వాళ్ళు - పరిగెడుతున్నారు, పట్టుకోండి, పట్టుకోండి]
శకారుడు ;- పద పద విటూ. దాక్కుంటూ పరుగు పెట్టాలి మనం. 
వాళ్ళ కంట పడితే మనకు ప్రమాదం.
విరటుడు ;- ఇతను శకారుడు, హ్హు 
ఈ మహా వీరునికి అనుచరుణ్ణిగా నేను, ప్రారబ్ధం.
శకారుడు ;- ఓ భటులారా, ఆ దళాలను తరమండి, వెంటాడండి. 
తరిమి తరిమి పట్టుకోండి 
[గట్టిగా అరుస్తూ, పక్కకు తిరిగి, లోగొంతుకతో] 
విటూ, మనం ఈ పక్క సందులో నుండి నెమ్మదిగా కోటకు చేరుదాం. 

విరటుడు ;- అట్లాగేనయ్యా, ఇట్లాగే - 
గమ్ముగా, గమ్మత్తుగా - జారుకుందాం, పదండి.  
;
 ♣♣♣ ♣♣♣ ♣♣♣ ♣♣♣ ♣♣♣  ♣♣♣ ♣♣♣ ♣♣♣ ♣♣♣ ♣♣♣ ;;
; అధ్యాయ శాఖ ;- 19 ;- శకారుని ఘోష యాత్ర ;
previous ;- ; అధ్యాయ శాఖ ;- 18 ;- మళ్ళీ చారుదత్తునికి ఇంటికి ఆమె  ;
+ matter REF - Sakaaruni GOsha ;- link ;- 
 శకారుడు పలికే ప్రాకృతంలో శ-ష-స మూడు వర్ణాలకు శ-కారమే  .

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...