15, డిసెంబర్ 2017, శుక్రవారం

వసంతసేన ఇంటికి ......

మైత్రేయుడు ;- మార్గుడా, చారుదత్తుల వారి బండి -
నీ అలంకరణతో కొత్త అందం 
సంతరించుకున్నది.
మార్గుడు ;- మా అన్న వర్ధమానుడే నాకు నేర్పాడు.
మైత్రేయుడు ;- 
మీ సోదరుడు వర్ధమానుడు 
ఐతే బహు నిమ్మళం, నెమ్మదస్థుడు.
అడపాదడపా ఏదో ఒక పని ఉన్నదంటూ, వెళ్తుంటాడు, 
నిన్ను ఇక్కడ పనికి అప్పగించి మరీ వెళ్తాడు.
నిన్ను చూస్తే గుండెలో నాకు బెరుకు.
మార్గుడు ;- 
 అదేంటయ్యా, అంత మాట అనేస్తున్నారు. 
నా పనికి ఇంతదాకా ఎవరూ పేరు పెట్ట లేదు, వంక చెప్ప లేదు.  
మైత్రేయుడు ;-  సరే, నేను కాదన్నానా, ఇంతకీ చారుదత్తుల వారి ఆనతి - గుర్తున్నది కదా.
మార్గుడు ;- వసంతసేనా దేవిని ఊరి శివార్లలోని ఆ తోటకు - తీసుకురమ్మన్నారు.
మైత్రేయుడు ;- రహస్యంగా - అని నొక్కి చెప్పారు కదా.
మార్గ ;- అట్లాగా, ఎందుకని?
మైత్రేయుడు ;- వసంత దేవి యొక్క తల్లికి కోపం,  
చారుదత్తుడు బీదరికంలో ఉన్న మనిషి, 
వీని 
పంచన చేరితే - గిట్టుబాటు కాదని.
మార్గ ;- ఆ, గుర్తు వచ్చింది, 
అందుకనే కాబోలు, వసంతమ్మ ఇంటికి నేరుగా వెళ్ళకూడదు, అన్నారు.
మైత్రేయుడు ;- ఔను, పెరటి గుమ్మం వద్ద బండిని నిలిపి ఉంచు, 
ఇప్పటికైనా నీ మట్టి బుర్రకు 
బోధ పడింది - అని అనుకుంటున్నాను.
మార్గ్ ;- మరైతే నాకొక అనుమానం.
మైత్రేయుడు ;- నువ్వొక ఆలోచనల పుట్ట - 
నీ పనికి మాలిన ధర్మ సందేహాలను తీర్చడానికే  
ఈ 
మైత్రేయుడు ఉన్నాడు, 
ఆ మనో వల్మీకం నుండి, వెయ్యి సందేహాలని - బైట పడెయ్యి.
మార్గుడు ;- ఈ తతంగం - ధూతమ్మ గారికి తెలీకుండానే జరుగుతూ ...
మైత్రేయుడు ;- ఆవిడ సతీ అనసూయకు వారసురాలు. 
భర్త ఏది చేసినా - భక్తితో ఆమోదిస్తూనే 
ఉంటుంది. 
ఐనా, అవి పెద్దవాళ్ళ ఆంతరంగిక విషయాలు.
మార్గ్ ;- బహిరంగ రహస్యాలున్నూ. 
మైత్రేయుడు ;- యజమానుల వ్యక్తిగత సంగతులని - సేవకులు ప్రశ్నించ కూడదు, తప్పు.
మార్గ ;- చిత్తం, చిన్న ప్రభువా. రౌరవాది నరకాలని పట్టి పోతారట. [పకపకా నవ్వుతూ] 
ఇది మా అన్న వర్ధమానకుడు  - నాకు బహూకరించిన ఛెర్నాకోల, 
ఇక చూడు, ఈ ఎడ్లు ఎట్లాగ పరిగెడుతాయో ......... ఛల్ ఛల్ డుర్ర్  .........
మైత్రేయుడు ;- ఈ మార్గుడు - కానరాని తుంటరి, 
వీనితో మాట్లాడే టప్పుడు నేను కాస్త అహమికతో మెలగాలి. 
;
**************************; 
శ్లోకమ్ ;-
శాస్త్రజ్ఞః కపటానుసార కుశలో వక్తాన చ క్రోధనః|
తుల్యో మిత్ర పరస్వకేషు చరితం దృష్టైన- దత్తోత్తరః|
క్లీ బాన్ పాలయితా శరాన్ వ్యధయితా ధర్మ్యోన లోభాన్వితో| 
ద్వార్భావే పరతత్వ బద్ధ హృదయో రాజ్ఞశ్చ కోపాపః||  
[9-5] ;; 
శూద్రకుడు - తన నాటకం - మృచ్ఛకటికమ్ - లో తెలిపిన - 
న్యాయాధికారి వ్యక్తిత్వం - నిర్వచనం ;  in -  మృచ్ఛకటికమ్ - start to her house
;
అధ్యాయ శాఖ ;- 25 ; వసంతసేన ఇంటికి ......  ;;
previous ; అధ్యాయ శాఖ ;- 24 ; డిసెంబర్ పోస్ట్ ;- వస్త్ర ప్రపంచం, బోణీ బేరం ;
;

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...