14, ఆగస్టు 2012, మంగళవారం

swagger stick పట్టుకున్న నెహ్రూ మామ


జవహర్ లాల్ నెహ్రూబోంబే కు వెళ్ళారు.
ఒక ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన అక్కడికి చేరుకున్నారు. 
బొంబాయిలోని “ తాన్సా ” (“Tansa near Bobay”) అనే చోటు అది.
మోహన్ సింగ్ బయాస్  భుజస్కంధాలపై- 
ఇండియా ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ  - యొక్క రక్షణ బాధ్యత డ్యూటీ - ఉన్నది. 
ఆయన జూనియర్ పోలీస్ ఆఫీసర్సు ఇన్ చార్జ్ గా 
ప్రముఖ ప్రభుత్వ మంత్రుల , అధికారుల సెక్యూరిటీ విధిని నిర్వహిస్తూన్నారు.
సరే! తాన్సా లోని ఇనాగ్యురేషన్ ముగిసినది. 
ముగింపు వాక్యం అవగానే – స్టేజీని దిగివచ్చారు (Dias) చాచానెహ్రూ.
అక్కడ చుట్టూతా - వెదురు బొంగులతో కట్టి ఉన్నవి బారికేడ్ లు.  
నెహ్రూజీ ప్రజలను కలవాలనే ఆకాక్షతో కంచెను దాటి వచ్చేశారు. 
మోహన్ సింగ్ బయాస్ తన విధినిర్వహణలో- 
వేదికను దిగి వచ్చిన జవహర్ లాల్ నెహ్రూను అనుసరిస్తూ
ముందడుగు వేయక తప్పలేదు. 
పోలీసులు, మోహన్ సింగ్ బయాస్  
గుంపులు గుంపులుగా జవహర్ లాల్ నెహ్రూ చుట్టూ 
మూగుతూన్న జనమును చెదరగొట్టవలసివచ్చింది.  
మోహన్ సింగ్ బయాస్- వాళ్ళను 
జవహర్ లాల్ నెహ్రూకు దూరంగా ఉంచేందుకు కష్టపడసాగాడు. 
ఫ్రజలను వెనక్కి నెట్టసాగారు. లాఠీని ఝళిపిస్తూ,
 అందరినీ అదిలిస్తూ, అదుపులో పెట్టసగారు.   
swagger stick లను ప్రయోగించడమే శరణ్యమైనది 
మోహన్ సింగ్ బయాస్ కూ, ఇతర కాకీ డ్రెస్సుల వాళ్ళకున్నూ! 

పండిత్ జవహర్ లాల్ నెహ్రూ
************
అకస్మాత్తుగా  మోహన్ సింగ్ బయాస్ చేతిలోని లాఠీ కర్రను కాస్తా ఎవరో లాకున్నారు. 
ఆ చేపాటి గట్టి కఱ్ఱ అక్కర వాళ్ళది. 
మరి అందుకే అంతు లేని ఆగ్రహం కలిగింది మోహన్ సింగ్ బయాస్ కు.  
చుట్టూ రౌండుగా తిరుగుతూ మోహన్ సింగ్ బయాస్ ఉగ్రరూపుడౌతూ, చూసాడు. 
మోహన్ సింగ్ బయాస్ కళ్ళు చింత నిప్పు కణికలే ఐనాయి.
తీరా చూస్తే- అతగాడి హస్త ఆభరణమైన లాఠీ ఎవ్వారి దగ్గర అగుపించిందో తెలుసా?  
సాక్షాత్తూ జవహర్ లాల్ నెహ్రూ  కర కమలములలోనే!
మోహన్ సింగ్ బయాస్ నిర్ఘాంతపోతూ, నీళ్ళు నమలసాగాడు.
Prime Minister జవహర్ లాల్ నెహ్రూ – 
ఆ రక్షకభటుల దండమును పైకీ కిందికీ ఊపుతూ కాస్త కరకుగా అన్నారు 
(“What were you doing?”) – “ మీరు చేస్తూన్నది ఏమిటి?” 
అలాగ అంటూనే తన వ్యక్తిగత సెక్యూరిటీ ఆఫీసర్ వైపు తిరిగి హుకుమ్ జారీ చేసేసారు 
“ఇతనిని ఇక్కడినుంచి పంపించివేయండి!” 
ఆ సీన్ నుండి సడన్ గా 
అలాగ తనకు 'ఉద్వాసన జరుగుతుందని' అనుకోనేలేదు మోహన్ సింగ్ బయాస్. 
నయనములనుండి ఉబికుబికి వస్తూన కన్నీళ్ళను ఆపుకోవడానికి సతమతమౌతూ 
మోహన్ సింగ్ బైటికి వెళిపోయాడు.   
************                                                 
కొంతసేపటికి  మోహన్ సింగ్ బయాస్ కి – 
“ప్రైమ్ మినిస్టెర్ మిమ్మల్ని పిలుస్తున్నారు!” అంటూ 
సమన్ లు వచ్చాయి. 
“ఇక నా ఉద్యోగం ఊష్టు, నా కెరీర్ కి ఫుల్ స్టాప్ పడినట్లే!” 
అనుకున్నాడు Mohansingh.
లోపల్లోపల వణుకుతూ బయలుదేరాడు మోహన్ సింగ్ బయాస్.
మొరార్జీ దేశాయ్ తదితర లీడర్ లతో- కలిసి కూర్చుని, 
రాజకీయవ్యవహారాలను చర్చిస్తూ కూర్చుని ఉన్నారు  నెహ్రూ. 
“మీరు ఏమి చేద్దామనుకుంటూన్నారు?” నెహ్రూ ప్రశ్న.
“సర్! బ్లూ బుక్ ను అనుసరించాను, 
నేను ఆ నిబంధనలను మాత్రమే ఫాల్లో ఐనాను.” 
(I was only following Blue Book) 

అప్పుడు నెహ్రూ యొక్క సెక్రటరీ, 
మొరార్జీ దేశాయ్ లు నెహ్రూజీ తో ఏదో చెబుతూ, మాట్లాడారు. 
జవహర్ లాల్ నెహ్రూ కాస్సేపు మౌనంగానే ఉన్నారు. 
కొన్ని moments పాటు అలాగుండి, నెమ్మదిగా పెదవి విప్పారు.
“Young man! apparently you were right and I was wrong. I am sorry.
ఆఫ్ట్రాల్ ఒక junior police officer కి ఒక ప్రధాన మంత్రి క్షమాపణ అడిగారు.
తటాలున సంభవించిన ఈ సంఘటనకు అందరూ సంభ్రమాశ్చర్యాలలో మునిగారు. 
విభ్రమగా చూస్తూన్న  మోహన్ సింగ్ బయాస్ కనుగవలో – 
ఆనందబాష్పాలు చెలియలికట్టను దాటుతూ, ఆయన యూనిఫారమ్ ను తడిపేసాయి. 
ఈ సారి -
తన కళ్ళ నుండి రాలుతూన్న కన్నీళ్ళను ఆపుకోవాలని ..............
           ప్రయత్నించలేదు మోహన్ సింగ్ బయాస్.   

************

(Pandit Jawaharlal Nehru ; 14 November 1889 – 27 May 1964)
  
(బ్లూ బుక్ = VVIP security measures ను ఉటంకిస్తూ, 
పోలీసులు – పాటిస్తూ అనుసరణ చేయాల్సిన షరతులు, 
మార్గదర్శకములు ఉన్నట్టి - సూచనల పుస్తకము)

(Mohansingh Bayas- Indian Express; Remembering Nehru;) ::::::


2 కామెంట్‌లు:

కమనీయం చెప్పారు...


It is befitting a great man.His anger also was transient.

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు చెప్పారు...

ఆహా! అలాంటి నాయకుల సంగతి అటుంచితే అందులో వెయ్యో వంతు స్టేచర్ ఉండే నాయకులు ఇప్పుడు ఉన్నారా?

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...