21, ఆగస్టు 2012, మంగళవారం

భీమ్ పూల్, విచిత్ర బ్రిడ్జి


ఉత్తరాఖండ్ లోని "ఘర్హ్ వాల్"/ గర్హ్వాల్ (= దేవ  భూమి)
హరితదనముతో  ప్రశాంతతను మనసులకు చేకూరుస్తుంది . 
పంచపాండవులు నడయాడిన ప్రదేశములు- 
హిమాలయ శిఖర వలయ సీమలు.  
సరస్వతీనది - అంతర్వాహిని ఐన స్రోతస్విని (SarasvatI river flows incognito).  
ఈ వేదభూమిలో పూజ్యనీయురాలు ఐన పవిత్ర నది  
సరస్వతీనదీ సరిత్తు.  - 
అలకనందా ఝరీ విలీనమౌతూ ప్రవహిస్తూన్న 
శోభాయమాన దృశ్యాలు  నయనానందము కలిగిస్తూంటాయి ఇక్కడ, 
;
సహజ వంతెన ; bheem pul
సరస్వతీనది పైన ఒక బ్రిడ్జి  ఉన్నది. 
ఈ bridge పేరు "భీమ్ పూల్"- పూల్= వంతెన - అని అర్ధము.  
ఇది సహజ వారధి. భీమ్ పూల్, ప్రాకృతిక సంపద; అమోఘ ప్రకృతి వరము, 
రెండు శిఖరములను కలుపుతూ ఏర్పడిన         శిలా వారధి బాట ఇది. 
ప్రకృతిసిద్ధమైన ఈ వంతెన- 
భగవానుని సృష్టిలోని విచిత్రములకు నిదర్శనముగా నిలిచి, అబ్బురపరుస్తూన్నది. 
మహా ప్రస్థానమునకై నిర్దేశించుకున్న "పంచ పాండవులు" - 
భార్య ద్రౌపదితో బాటు ముందుకు కదిలారు. 
పాండవులు ఈ నది చెంతకు వచ్చారు. 
సరస్వతీ ప్రవాహమును దాటి ఆవల తీరమునకు చేరడము ప్రస్తుత కర్తవ్యము. 
"కిమ్ కర్తవ్యమ్?". 
బాహుబలసంపన్నుడు, వెయ్యి ఏనుగుల బలము కలవాడు ఐన భీముడు 
ఒక పెద్ద శిలను తెచ్చి, ఆ ఉత్తుంగ ఝరికి పైన 
అటూ, ఇటూ ఉన్న గిరులను కలుపుతూ ఉండేటట్లుగా-వేసి, 
తాము అందరూ నడిచి వెళ్ళేందుకు వీలుగా చేసాడు. 
(Bheem threw a big massif rock to make a path joining two mountains)  
జయం సంహిత- (వేద వ్యాస విరచిత- మహా భారతము) - 
ఇతిహాసముతో ముడిపడి ఉన్న కల్పనా గాధలు 
ఈ సీమాసంబంధములై ప్రచారములో బహుళ ఉన్నవి. 
ఈ  హృద్య వర్ణన స్థానికుల కథనము. 
ఉరకలు వేస్తూన్న సరస్వతీ వాహినీ తరంగాలు చూపరులను దృష్టి త్రిప్పుకోనీయవు.

వ్యాస గుహ, గణేశ్ గుహ- లు దగ్గరలో ఉన్న ప్రత్యేక దర్శనీయ పుణ్య స్థలములు. 
వసుంధర జలపాతము, బండ రాళ్ళ మధ్య-ఇరుకు  
ఇరుకు సందులగుండా ప్రవహిస్తూ  ఉరికే నీళ్ళు ప్రత్యేక ఆకర్షణ
వసుంధరా జలపాత ధారలు - సుందర దృశ్యాలు. 
ఈ సీనరీలు బదరీనాధ్ కి 5 కిలోమీటర్లు దవ్వున ఉన్నవి.-  

సహజ Bridge వంతెన ; (Garhwal hills)
అంతర్వాహిని సరస్వతీనది పైన సహజ వంతెన

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...