13, ఆగస్టు 2012, సోమవారం

కవిత search


"కవిత"అనే చిన్ని పాప తప్పిపోయె, వెతకరా?
"కవిత"అనే చిన్ని పాప తప్పిపోయె, వెతకరా???!!! 
;
ఛందస్సు అనే పచ్చ బుడగ కావాలని అడిగినది 
విచ్ఛందస్సనే గ్యాసు బుడగ బాగుందని అన్నది 
;
ప్రాసలనే సీసాలపై ఊగుతాను అన్నది 
శ్లేషల జెయింట్ వీలు నెక్కుతానని అడిగినది

        "కవిత"అనే చిన్ని పాప తప్పిపోయె, వెతకరా???!!! 


సమాసముల రంగుల రాట్నం ఎక్కుతాను అంటూ 
బహు మారాములు చేసినది
క్లిష్టాన్వయపు డోలలలో ఊగనీయండని అన్నది 
;
కలగాపులగపు భాషల - తకరారుల,తబిసీళ్ళ 
తాయిలాలు అవిగవిగో! కొనిపెట్టు నాకు ఇప్పుడే! 
                  అని అడుగుతూ అడుగుతూ 
                          అడిగేస్తూ, అడుగు వేస్తూ ......
                 గోముగా ప్రశ్నిస్తూ, ప్రశ్నిస్తూ
         ....... కవిత అనే చిన్నారి తప్పిపోయింది ఎటనో?

*************************************;

 ఆవకాయ.కామ్ Selayeru (Link)
                 8 నవం 2008 –


       Shri Radha-Krishna Swinging to the Melodious (Link Photo)
;
Shri Radha Krishna Swinging

 picnic ఆటవిడుపులు , akhilavanitha

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...