14, ఆగస్టు 2012, మంగళవారం

కేరళ రాబిన్ హుడ్ - Kochunni19వ శతాబ్దములో కొచ్చున్ని వార్తలలోని వ్యక్తిగా పేరొందాడు 
(famed highwayman ; Kayamkulam). 

1859 ప్రాంతాలలో ఇండియాలో దారిద్ర్యం జటలు విప్పి నాట్యమాడింది. 
నీలిమందు విప్లవం చెలరేగింది. 
ప్రథమస్వతంత్ర్య సంగ్రామము ఉత్తరభారతములో రవరవ లాడసాగినది.
అప్పటికే ఈస్ట్ ఇండియా కంపెనీ భారతీయుల భాగ్యములను కొల్లగొట్టినది. 
ఆంగ్లేయుల ధాష్టీకము మూలంగా 
హిందూ దేశములోని అన్ని రంగాలూ శుష్కించిపోయాయి. 
చాప కింద నీరు లాగా ఇంగ్లీషువాళ్ళ పెత్తనము, పాలనలు 
యావత్ భారత జాతిని పీల్చి పిప్పి చేసాయి. 
ఆసియా దేశాలు  అన్నింటిలోనూ ఈ దుష్కర పరిస్థితి నెలకొని ఉన్నది.
ఫలితముగా మన దేశములో అలవి కాని అశాంతి, 
చెప్పరాని కష్టాలు చుట్టుముట్టాయి.   
కలిమి గలవారు వ్రేళ్ళమీద లెక్కబెట్టే అంతమంది -మిగిలారు, 
సహజంగానే అలాటి వారు తెల్లదొరలకు కాపు కాసే వాళ్ళుగానే- మారిపోవాల్సి వచ్చేది.  
తక్కిన 99 శాతం మంది దారిద్ర్య రేఖకు దిగువన - కంటే - 
పాతాళ స్థాయిలో పడి ఉన్నారు.
అదిగో! ....... అప్పటి దీన పరిస్థితులలో - 
సకల భారతావనిలో- అల్లకల్లోలములు ప్రజ్వరిల్లసాగినవి.
ఆనాడు- కేరళలో పెను సంచలనాలకు కారకుడైనాడు కుచ్చిన్న్ అనే గజదొంగ ఒక్కడు. 

**************************

Kayamkulam - Kochunni


కాయమ్ కులం- లోని కొచ్చున్ని

( Kayamkulam Kochunni ) - 
దారి దోపిడీ దొంగ. ఐనప్పటికీ అతగాడు ప్రసిద్ధికెక్కాడు. 
పేదలకు ఆరాధ్యుడై, ధనవంతులకు పీడకల ఐనాడు కొచ్చున్ని.
;
1859 లో కేరళలో " Central Travancore " లో 
సంచలనములు కలిగించిన 
"కొచ్చున్ని" అనే మనిషి.   
ధనవంతులను దోచి, సంపదను నిరుపేదలకు పంచేవాడు. 
పశ్చిమదేశాలలో "రాబిన్ హుడ్" (  Robin Hood) వలెనే- 
కొచ్చున్నిఖ్యాతి గాంచాడు. 

**************************

కొచ్చున్ని ప్రాణ స్నేహితుడు "ఇత్తిక్కార పక్కి" 
(ఇథిక్కార నది ఒడ్డున ఉన్న ఇతిక్కర గ్రామ నివాసి) .   
( aversion to misers, moneylenders and landlords )  
కొచ్చున్నికి కుడి భుజము "ఇత్తిక్కార పక్కి"; 
వీరిరువురూ చోర ప్రక్రియలో నిపుణులై, 
గవర్న్ మెంట్ కూ, సంపన్నులకూ కంటి మీద కునుకు లేకుండా చేసారు. 
కొన్నేళ్ళపాటు వారిద్దరూ చేసిన చోరీలతో - పరగణాలు అతలాకుతలం ఐనాయి.
సాధారణ ప్రజలకు తాము దోచిన సొమ్మునంతా ఇచ్చేవాళ్ళు. 
తమకై రాగి దమ్మిడీ కూడా అట్టిపెట్టుకోకుండా బీదా బిక్కీకి 
అంతా ఇస్తూన్న జగజ్జంత్రీలైన ధర్మదాతలు- గా ప్రజలలో కీర్తి గాంచారు.

ధనవంతులను దోచి, సంపదను నిరుపేదలకు పంచేవాడు. 
పేదలకు ఆరాధ్యుడై, ధనవంతులకు పీడకల ఐనాడు కొచ్చున్ని.   
ఏది ఏమైనప్పటికీ - దొంగతనము సంఘ ద్రోహము, నేరము కూడా!

ఎట్టకేలకు కొచ్చున్ని ని ప్రభుత్వం బంధించింది. 
కొచ్చుని పూజాపుర సెంట్రల్ జైల్ లో తుది జీవితం గడిపాడు.
కొచ్చున్ని  చెరసాలలో చివరి శ్వాస విడిచాడు.

**************************

ఆతనికి దేవాలయములో folklore ఇప్పటికీ పూజాదులు చేస్తూ, 
మొక్కుబడులు చెల్లిస్తున్నారు అంటే  విచిత్రమే!   
ఎడప్పర లో ఉన్న -"ఎడప్పర మలదేవర్ నాడ కోవెల లో
కొచ్చుని కి నేటికీ సంస్మరిస్తూ ఉంటారు.

1859
**************************

ఆతనికి దేవాలయములో ఇప్పటికీ పూజాదులు చేస్తూ, 
మొక్కుబడులు చెల్లిస్తున్నారు అంటే  విచిత్రమే!   %%%% 
ఎడప్పర లో ఉన్న -"ఎడప్పర మలదేవర్ నాడ కోవెల 
(Edappara Maladevar Nada Temple, Kozhencherry ) లో 
కొచ్చుని ఉనికిని నేటికీ సంస్మరిస్తూ ఉంటారు. 
కురవ కులస్థుడు ఊరళి (ఇడుక్కి కొండలు- లో నివాసము) జాతివారు 
ఈ గాధను ఇష్టంగా చెప్పుకుంటారు. 
ప్రీతితో-  కొచ్చుని ఆరాధనలు చేస్తారు.  
కొచ్చుని పట్ల స్తానిక కొండ జాతి జనులకు- 
కడు భక్తి విశ్వాసాలు ఉన్నవి. 
ఆ దేవాలయములో వాళ్ళు మొక్కులు ఇసూంటారు. 
సారాయి, గంజాయి, తమలపాకులు, విడెము
(= పాన్/ కిళ్ళీ), పొగాకు (టొబాకో), areca nut కాండిల్సు/ కొవ్వొత్తులను, 
సాంబ్రాణీ, అగరు వత్తులనూ ముడుపులుగా, మొక్కులుగా ఇస్తూంటారు.  

**************************

కొట్టరధిల్ శంకున్ని - అనే రచయిత 
కొచ్చుని యశో గాధలు, పుస్తకములుగా అచ్చు వేసారు.
( Kottarathil Sankunni, folklores )  
కొచ్చుని కథలను - కొట్టరధిల్ శంకున్ని విపుల రచనలను చేసాడు. 
కొచ్చున్ని గురించి అనేక జానపద గేయాలు ఉన్నవి.  

ఆతనిపైన మలయాళములో సినిమాలు కూడా వచ్చాయి అంటే 
కొచ్చున్ని స్థానిక ప్రజలలో 
ఎంత craze ని, కీర్తిని పొందాడో అర్ధము చేసుకోవచ్చు. 
[( Kayamkulam Kochunni (1966) Movie in Malayalam]

**************************

కొచ్చున్ని  సాహస కార్యాలు భారతదేశములో- 
అనేక సినిమాలకు - మూలధనములైనవి.
తెలుగులో "బందిపోటు" 
(ఎన్,టి, రామారావు, కృష్ణకుమారి, రాజనాల), 
కొండవీటి  దొంగ - బోటి చలనచిత్రాలకు- 
చలన వస్తు కథగా- కొచ్చున్ని 
'బ్రతుకు చిత్రము' లభ్యమైనది అంటే- అతిశయోక్తి కాదు. 
ఒకానొక చోర యోధ - ధీరకృత్యాలు 
movies కథా రచయితల మేధస్సులకు ఆలవాలములైనవి. 
మూవీ నిర్మాతలకు కనకవర్షము కురిపించే ముడిసరుకుగా దొరికినది.  

Robinhood Of Kerala ,chandamama

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...