20, నవంబర్ 2010, శనివారం

చిట్టి తల్లినీ రాణిని చేస్తాం! చిట్టి తండ్రినీ రాజును చేస్తాం!

పిల్లలకే స్వాతంత్ర్యం వస్తే?
పిల్లలకే స్వరాజ్యం ఇస్తే ?
స్తే....???

చిట్టి తల్లినీ రాణిని చేస్తాం!
చిట్టి తండ్రినీ రాజును చేస్తాం! ||

మా అమ్మే ఒక బొమ్మైతే
మా నాన్నే ఒక బొమ్మైతే
మా బొమ్మల పెళ్ళి గుమ్ముగ చేస్తాం!
కమ్మని విందులు గమ్ముగ తింటాం! ||

స్కూళ్లలో మాస్టార్లు కరువైతే...
పిల్లలమంతా పంతుళ్ళౌతాం!
పెద్దవాళ్లందరికీ బుద్ధులు చెబుతాం! ||

సూర్యుడు ఎర్రని కాగితమైతే
చంద్రుడు తెల్లని కాగితమైతే.......
గాలిపటాలుగ చేసేస్తాము;
మెరుపుల దారాలతో ఎగిరేస్తాము! ||

****************************
రేడియో అన్నయ్య రచన ;
- ఆకాశ వాణి లో వస్తూండేది.
నా చిన్నప్పుడు, రేడియోని అంటి పెట్టుకుని వినే ప్రోగ్రాం
"బాల వినోదం - పిల్లల కార్యక్రమం.
ఈ పాట ఎప్పటికీ ఆకు పచ్చని మృదు జ్ఞాపకమే!

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...