17, నవంబర్ 2010, బుధవారం

శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆభరణముల విలువ

తిరుమల తిరుపతి దేవ స్థానమునకు
ముప్పాళ్ళ రంగా రెడ్డి రెవెన్యూ ఆఫీసరు,
శ్రీ మలయాళ స్వామి వారికి భక్తులు ఐనారు.
శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ‘పచ్చలకు
గోల్కొండ వజ్రాల వ్యాపారులు
25 వేల రూపాయలుకు కొన వలెనని యత్నించారు.
ఆ రెవెన్యూ ఆఫీసరు –
తాను ఆ ధనమును మలయాళ స్వామి వారికి
ఇవ్వాలని – తలిచారు.
“ఓహో! శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ‘పచ్చలు ను మార్చి –
ఆ ధనముతో వ్యాసాశ్రమమును వృద్ధి పొందింప దలచు చున్నారా?
ఇట్లు తయారైతిరా? ఇంతకాలము ఇక్కడ నేర్చుకున్నది ఇదియేనా?´
అంటూ శ్రీ మలయాళ స్వామి మందలించారు.
స్వామీజీ –
“ తాను పెదవి చెప్పకుండానే అంతా గ్రహించారే!”అనుకుని
గురు దేవుని అసాధారణ ప్రజ్ఞకు అచ్చెరువొందుతూ,
ఆ భక్తుడు
“తాను తలపెట్టిన పనిలోని లొసుగును తెలుసుకుని,”
సిగ్గు పడి, ఆ కార్యక్రమాన్ని విరమించ్వ్హుకున్నాడు.
స్వామీజీ , భక్తులు సమర్పించే
ధనమునూ, కానుకలనూ కూడా –
అవి న్యాయ బద్ధ మార్గములోనివేనా?” అని
మనో చక్షువుతో పరిశీలన చేసే వారు.
భక్తులు ఇచ్చే చిన్న కానుకలను కూడా
స్ఫూర్తిగా గ్రహించే వారు.
వ్యాసాశ్రమమునూ, అనుబంధముగా
విద్యా వ్యవస్థలనూ, సమాజ సేవా కార్య కర్తలనూ
తీర్చి దిద్దిన ఘనత -
వ్యాసాశ్రమ స్థాపనకు మూల కారకుడైన
శ్రీ మలయాళ స్వామివారిదీ, వారి శిష్యులదీ!!

(శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆభరణముల విలువ)

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...