
1885 March 29 వ తేదీ ఎంగండ్యూర్ లో జన్మించినారు.                                      
"వేలప్ప" ఆయన పూర్వనామము 
శ్రీ మళయాళ స్వామి సన్యాశాశ్రమమును స్వీకరించారు. 
గిరి సాంప్రదాయమును అనుసరించి 
“శ్రీ అసంగానందగిరి స్వామి” అని నామ కరణమును  - 
శ్రీ సాధు మాతాజీ నుండి – మాతృ బిక్షగా – స్వీకరించారు.
కానీ ............ ఆ నాటికే - 
ఆయన “ శ్రీ మళయాళ స్వాముల వారు"గా ప్రశస్తి కెక్కి ఉండుటచే –
ఈ పేరు ఎవరికీ తెలియదు. 
కేరళ ప్రాంతము వాడు, మళయాళ సీమలో జన్మించినప్పటికీ _ 
ప్రజలు సమర్పించిన కానుకలను తెలుగు నాట మాత్రమే వినియోగించెను; 
అందు వలననే ప్రజల విశ్వాసమును ఆయన చూర గొన గలిగారు.
“స్వామి! మీకు ఏదైనా ధనాకర్షణ కలుగ జేయు మంత్రము వచ్చునా?”
ఒక వ్యక్తి అడుగగా, స్వామి వక్కాణించెను
"నేను నేర్చిన ధనాకర్షణ – జనాకర్షణ మంత్రములు రెండు అక్షరములే నాయనా!
 ‘సో~హం’ అను – అజపా గాయత్రీ మంత్రము – ఉన్నది. 
ఆ మధుర మంత్రమును హృదయ కమలము అనే యంత్రముపై అధిష్ఠింప జేయ వలెను. 
అనవరతము ‘ అర్థ భావనను’ కలిగి ఉండి, 
జపించు చుండ వలెను. 
అప్పుడు అచిర కాలములో ఆత్మానుభూతి సంప్రాప్తమౌతుంది.”  
 
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి