8, నవంబర్ 2010, సోమవారం

మొక్కు వోని సిద్ధాంత ధీరత్వం, ఆయన సొమ్ము!
కొన్ని సంవత్సరాల క్రితం United States of America లో
ఒక factoryలో జరిగిన సంఘటన ఇది.
కొంతమంది భారతీయులు
తమ వృత్తిలో మెలకువలను నేర్చుకుంటున్నారు.
ఆ అధ్యయనము నిమిత్తమై వాళ్ళు
స్టేట్సు లోని ముఖ్యమైన ఫ్యాక్టరీలను సందర్శిస్తున్నారు.
ఒక కర్మాగారములో 75 అడుగుల ఎత్తు గల నిచ్చెన అక్కడ ఉన్నది.
ఫాక్టరీ ఆఫీసర్లు
“ ఫాక్టరీ ఎలా పని చేస్తూన్నదో”
వారికి విపులీకరిస్తున్నారు.
ఒక చోట Officer ఇలా చెప్పాడు.
“ఈ మిషన్ ఎలా పని చేస్తుందో తెలుసుకోవాలంటే,
మీరు ఈ laadderను ఎక్కాల్సి ఉంటుంది.”
("If you want to see how this machine works
you will have to climb to the top,")
ఔను మరి, 75 అడుగుల ఎత్తు గల నిచ్చెన అక్కడ ఉన్నది.
అంటే ....... ఆ ఇండియన్సు
నాలుగు అంతస్థుల వరకు ఆ నిశ్శ్రేణిని ఎగ బ్రాకాలన్న మాట!
టీం నేత మాత్రం తటపటాయించ లేదు,
తడుముకోకుండా ప్రకటించాడు
“ అలాగే! మేము ఎక్కేస్తాము.”( “ Very well, let us climb,”) .
ఆ లీడరు వయసులో మిగతా వారి కన్న పెద్ద వాడు.
తక్కిన వాళ్ళు అందరూ
ఆ స్టీలు నిచ్చెనను ఎక్కాలనే ఆలోచనకే ........
భీతితో వెనుకంజ వేయ బోతూన్నారు.
ఆ తలపుకే వణికి పోతూ చాలా మంది సభ్యులు అక్కడే నిలిచి పోయారు.
కానీ ఆ ప్రౌఢ వ్యక్తి నిర్భయంగా చక చకా ఎక్క సాగాడు.
కొద్ది మంది డ్యూటీకి, విధి నిర్వహణకు కట్టుబడి
ఆయనను అనుసరించి పైకి ఎక్క సాగారు.
వారిలో కొందరు నిచ్చెనను
కొంత దూరం ఎక్కి, భయ పడుతూ ఆగి పోయారు.
వృద్ధుడైనప్పటికీ ఆ leader మాత్రం, వెన్ను చూప లేదు,
వెను తిరిగి చూడకుండా పై కప్పు దాకా వెళ్ళాడు,
కొట్ట కొసకు ఆతనిని అనుసరించిన వారిలో - ముగ్గురు మాత్రమే గమ్యం చేర గలిగారు.

తాను చేపట్టిన ఏ కార్యాన్నైనా పద్ధతి ప్రకారం పూర్తి చేసే కార్య సాధకుడు ఆయన.
ఎట్టి కష్ట నిష్ఠూరాలకూ వెరువని నైజము,క్రమ శిక్షణకు మారు పేరు ఐనట్టి
ఆ మహనీయుడే మన సుప్రసిద్ధ ఇంజనీరు మోక్ష గుండం విశ్వేశ్వరయ్య.
అనేక ప్రాజెక్టులకు ప్లానులు వేసి, కట్టించాడు డాక్టర్ M.విశ్వేశ్వరయ్య.
ఆయన చేతి చలువ వలన పలు బీడు భూములను సుక్షేత్రాలుగా మారాయి.
అనేక ప్రాంతాలను పచ్చని పైరులతో కళ కళలాడేలా చేసిన మేధావి శ్రీ మోక్ష గుండం విశ్వేశ్వరయ్య.

*******************************************************
విశ్వేశ్వరయ్య గారిని ఒక సారి ఆయన స్నేహితుని కుమారుడు కలిశాడు.
ఆ కుర్ర వాడు కించిత్తు మనః క్లేశంతో సలహా కోరుతూ అన్నాడు
” సార్! నన్ను అందరూ చులకనగా చూస్తున్నారు. ఇది నాకెంతో బాధ కలిగిస్తూన్నది.”
ఇంజనీరు was Doctor Sri M. Viswesvarayya నిశ్చల స్వరంతో చెప్పారు కదా
” నీ గురించి అందరూ మంచిగా చెప్పుకోవాలంటే ,
ప్రజలు నిన్ను గౌరవించాలంటే నువ్వు ఒక చిన్న పని చెయ్యి, చాలు!
నీ గురించి నువ్వు గొప్పలు చెప్పుకోకు నాయనా! సరేనా!”
స్థిర సంకల్పంతో, దృఢ నిశ్చయంతో,
మాతృ భూమి భారత దేశమునకు ఖ్యాతిని తెచ్చిన మహనీయునికి జేజేలు.
(Doctor Sri M. Viswesvarayya - 1861 సెప్టెంబర్ 15 —1962 ఏప్రిల్ 12)
(మొక్కు వోని సిద్ధాంత ధీరత్వం, ఆయన సొమ్ము! )

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...