16, సెప్టెంబర్ 2009, బుధవారం

గాన సరస్వతి ఆమె


నేడు సంగీత సామ్రాజ్ఞి సుబ్బులక్ష్మి M.S. సుబ్బు లక్ష్మి జయంతి.
ఇది కర్ణాటక సంగీతము మాధు మాధుర్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన ఆమె గాత్ర మాధుర్యానికి పుట్టిన రోజు.
సుబ్బు లక్ష్మి - 1916 సెప్టెంబరు ,16 వ తేదీ ,జన్మించారు.
గాన కోకిల M . S . సుబ్బు లక్ష్మి గాత్రము ఎల్లరికీ సుపరిచితమే !
"నా భర్త సదాశివం ప్రోత్సాహము వలన నేను ఇంత కీర్తి శిఖరాలను అధిరోహించగలిగాను." అని ఆమె కృతజ్ఞతతో చెప్పేది."తోటి పిల్లలతో ఆడుకుంటూ ఉన్నాను. అప్పుడు మా అమ్మ నన్ను పిలిచింది.పాట పాడమనిఅన్నది. ఒక పాట పాడాను. అప్పుడు చప్పట్లు మారుమ్రోగాయి. ఐతే, నాకు అవేవీ బోధపరచుకొనని వయసు. పాట పాడటము అయిపోగానే మళ్ళీ స్కూలు పిల్లలతో మట్టిలో ఆడుకుంటూ కూర్చున్నాను." అని బాల్య స్మృతులను మననం చేసుకున్నది, ఆ నైటింగేల్ ఆఫ్ కర్ణాటక సంగీతం ".
* ఆమె సమకాలీనురాలైన, భారత కోకిల బిరుదాంకితురాలైన సరోజినీ నాయుడు ఉవాచ
"From today, I surrender to Subbulakshmi, the enchanting singer with an enchanting voice, my tittle The Nightingale of India".
* మహాత్మా గాంధీజీ ఆమె సంగీత మాధుర్యాన్ని ఇలా ప్రశంసించారు "I would rather hear the words of the bhajan spoken by Subbulakshmi than sung by any one else.".
జాతి పితకు ఇష్టమైన "వైష్ణవ జనతో తేన కహి ..." , మీరా భజనలు ఆమె గళములో ప్రాణం పోసుకుని, ప్రజా బాహుళ్యములో ప్రాచుర్యాన్ని పొందాయి.
* జవహర్ లాల్ నెహ్రూ ఇలా పలికారు "Who am I before this melody Queen? A mere Prime Minister. And what right have I, or any one else, to speak when she is there to sing."
By kadambari piduri, Sep 15 2009 9:45AM

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...