18, సెప్టెంబర్ 2009, శుక్రవారం

రాయలు-కుహూ యోగం
___


___


___


___
___

"బీచుపల్లి"కి ఆ పేరు రావడానికి ఒక హేతువు ఉన్నది.
"ఆంధ్ర భోజుడు" ఐన శ్రీ కృష్ణ దేవ రాయలకు జ్యోతిష్యులు చెప్పారు
"ప్రభూ!మీకు మూడు సంవత్సరమ్ములు 'కుహూయోగము ఉన్నది."
చాంద్ర మాన గణకులు, పంచాంగ పండితుల "భవిష్య వాక్కును అనుసరించి, శ్రీ కృష్ణ దేవ రాయల వారు తాను దానముగా ఇచ్చిన ప్రాంతమును, తానే మరల స్వీకరించి, కొన్ని సంవత్సరములు పరిపాలన చేయ వలసి వచ్చినది.
అందుచేత రాయలవారు 1521నుండి1524 వఱకు"మదనపల్లె"ను" శ్రీ కృష్ణముద్ర" తో పరిపాలించారు.
అయితే, ఆ ప్రాంతము "వ్యాస రాయలు"కు ఇచ్చినట్టి దానము.
ఆ ప్రాంతమును -"శ్రీ కృష్ణ ముద్ర"తో పాలించిన విజయనగర సామ్రాజ్య తేజో విరాజి,
నిర్ణీత గడువు తరువాత, వ్యాస రాయల కవికి ఒసగిన ఆ దత్త సీమ పైన ను తన పాలనాధికారములను నిషేధించుకుని
తిరిగి వ్యాసరాయలుకు ఇచ్చివేసారు.
పాప పరిహారార్ధమై 378 దేవతా విగ్రహాలను ప్రతిష్ఠ చేసారు.
వ్యాసరాయలు అక్కడ హనుమంతుని కోవెలను నిర్మించాడు.
ఇక్కడ రెండు వైపులశ్రీ ఆంజనేయస్వామికి శంఖ, చక్రములు ఉన్నాయి.
"హనుమంతుల వారిని దర్శించుకోవడనికి వచ్చేమొట్ట మొదటి వ్యక్తియే పూజారిగా ఉండాలని"వాక్కు పలికాడు.
"బీసన్న"అనే బోయ పిల్ల వాడు ప్రప్రధమంగా స్వామి వద్దకు వచ్చి, సాష్టాంగ నమస్కారము చేసాడు.
ఆనాటినుండీ,"బీచు పల్లి"గా పేరొందిన హనుమత్ క్షేత్రానికి,
వ్యాసరాయలు అభీష్టము ప్రకారము,
నెలకొల్పబడిన ఆ సంప్రదాయము నేటికినీ అవిచ్చన్నముగా పాటించబడుచున్నది.
************************************************************************************************** http://astroyogas.wikidot.com/
Kuhu Yoga ====== The lord of the 4th house is in the 6th, 8th or 12th house (Phala Deepika 6/61). Result : The person will be bereft of mother, conveyances, friends, happiness, ornaments, relations. The person will be unemployed and without a place of living having lost the one owned by him/her associating with low people of the opposite sex.


Telusaa! - రాయలు-కుహూ యోగం -
By kadambari piduri, Aug 3 2009 11:34PM

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...