11, నవంబర్ 2010, గురువారం

నెమలి కన్నులు, గులాబి నవ్వులు





















నెమలి కన్నులు,నెమలి కన్నులు
బాల కృష్ణుని సిగలో వన్నెలు

సన్న జాజులు,బొండు మల్లెలు
తెల్లని వన్నెకు వయ్యారములు

పొద్దు తిరుగుడులు,సువర్చలా!
ఉదయ భాస్కరుని ఉత్తేజాలు

చంద్ర కాంతలు,కువలయమ్ములు
చందమామకు "విలాసమ్ములు"

విరిసే చిన్నెల గులాబి పువ్వులు
చాచా నెహ్రూ కోటున నవ్వులు.
*************************************
-కుసుమ కుమారి ;
Link for -

8, నవంబర్ 2010, సోమవారం

మొక్కు వోని సిద్ధాంత ధీరత్వం, ఆయన సొమ్ము!
















కొన్ని సంవత్సరాల క్రితం United States of America లో
ఒక factoryలో జరిగిన సంఘటన ఇది.
కొంతమంది భారతీయులు
తమ వృత్తిలో మెలకువలను నేర్చుకుంటున్నారు.
ఆ అధ్యయనము నిమిత్తమై వాళ్ళు
స్టేట్సు లోని ముఖ్యమైన ఫ్యాక్టరీలను సందర్శిస్తున్నారు.
ఒక కర్మాగారములో 75 అడుగుల ఎత్తు గల నిచ్చెన అక్కడ ఉన్నది.
ఫాక్టరీ ఆఫీసర్లు
“ ఫాక్టరీ ఎలా పని చేస్తూన్నదో”
వారికి విపులీకరిస్తున్నారు.
ఒక చోట Officer ఇలా చెప్పాడు.
“ఈ మిషన్ ఎలా పని చేస్తుందో తెలుసుకోవాలంటే,
మీరు ఈ laadderను ఎక్కాల్సి ఉంటుంది.”
("If you want to see how this machine works
you will have to climb to the top,")
ఔను మరి, 75 అడుగుల ఎత్తు గల నిచ్చెన అక్కడ ఉన్నది.
అంటే ....... ఆ ఇండియన్సు
నాలుగు అంతస్థుల వరకు ఆ నిశ్శ్రేణిని ఎగ బ్రాకాలన్న మాట!
టీం నేత మాత్రం తటపటాయించ లేదు,
తడుముకోకుండా ప్రకటించాడు
“ అలాగే! మేము ఎక్కేస్తాము.”( “ Very well, let us climb,”) .
ఆ లీడరు వయసులో మిగతా వారి కన్న పెద్ద వాడు.
తక్కిన వాళ్ళు అందరూ
ఆ స్టీలు నిచ్చెనను ఎక్కాలనే ఆలోచనకే ........
భీతితో వెనుకంజ వేయ బోతూన్నారు.
ఆ తలపుకే వణికి పోతూ చాలా మంది సభ్యులు అక్కడే నిలిచి పోయారు.
కానీ ఆ ప్రౌఢ వ్యక్తి నిర్భయంగా చక చకా ఎక్క సాగాడు.
కొద్ది మంది డ్యూటీకి, విధి నిర్వహణకు కట్టుబడి
ఆయనను అనుసరించి పైకి ఎక్క సాగారు.
వారిలో కొందరు నిచ్చెనను
కొంత దూరం ఎక్కి, భయ పడుతూ ఆగి పోయారు.
వృద్ధుడైనప్పటికీ ఆ leader మాత్రం, వెన్ను చూప లేదు,
వెను తిరిగి చూడకుండా పై కప్పు దాకా వెళ్ళాడు,
కొట్ట కొసకు ఆతనిని అనుసరించిన వారిలో - ముగ్గురు మాత్రమే గమ్యం చేర గలిగారు.

తాను చేపట్టిన ఏ కార్యాన్నైనా పద్ధతి ప్రకారం పూర్తి చేసే కార్య సాధకుడు ఆయన.
ఎట్టి కష్ట నిష్ఠూరాలకూ వెరువని నైజము,క్రమ శిక్షణకు మారు పేరు ఐనట్టి
ఆ మహనీయుడే మన సుప్రసిద్ధ ఇంజనీరు మోక్ష గుండం విశ్వేశ్వరయ్య.
అనేక ప్రాజెక్టులకు ప్లానులు వేసి, కట్టించాడు డాక్టర్ M.విశ్వేశ్వరయ్య.
ఆయన చేతి చలువ వలన పలు బీడు భూములను సుక్షేత్రాలుగా మారాయి.
అనేక ప్రాంతాలను పచ్చని పైరులతో కళ కళలాడేలా చేసిన మేధావి శ్రీ మోక్ష గుండం విశ్వేశ్వరయ్య.

*******************************************************
విశ్వేశ్వరయ్య గారిని ఒక సారి ఆయన స్నేహితుని కుమారుడు కలిశాడు.
ఆ కుర్ర వాడు కించిత్తు మనః క్లేశంతో సలహా కోరుతూ అన్నాడు
” సార్! నన్ను అందరూ చులకనగా చూస్తున్నారు. ఇది నాకెంతో బాధ కలిగిస్తూన్నది.”
ఇంజనీరు was Doctor Sri M. Viswesvarayya నిశ్చల స్వరంతో చెప్పారు కదా
” నీ గురించి అందరూ మంచిగా చెప్పుకోవాలంటే ,
ప్రజలు నిన్ను గౌరవించాలంటే నువ్వు ఒక చిన్న పని చెయ్యి, చాలు!
నీ గురించి నువ్వు గొప్పలు చెప్పుకోకు నాయనా! సరేనా!”
స్థిర సంకల్పంతో, దృఢ నిశ్చయంతో,
మాతృ భూమి భారత దేశమునకు ఖ్యాతిని తెచ్చిన మహనీయునికి జేజేలు.
(Doctor Sri M. Viswesvarayya - 1861 సెప్టెంబర్ 15 —1962 ఏప్రిల్ 12)
(మొక్కు వోని సిద్ధాంత ధీరత్వం, ఆయన సొమ్ము! )

4, నవంబర్ 2010, గురువారం

మఱ్ఱి చెట్టుల వల్ల మాలిన గర్వము











వట పత్ర శాయి – శిఖి పింఛ ధారి
పుట్టుక, కదలికలు లోక కళ్యాణములు
ప్రకృతికి ఎన లేని –
హర్షానందమ్ములు చెలియరో!....
ప్రకృతికి ఎన లేని – హర్షానందమ్ములు ||

మఱ్ఱి చెట్టుల నీడ – ఆవుల మందలు
అట్టె నిలిచేను – ఆగి చూచేను – చెలియరో!....
వ్రేపల్లె కిట్టమ్మ నును స్పర్శ కోసము
చెలియరో!....
వ్రేపల్లె కిట్టమ్మ నును స్పర్శ కోసము ||

మబ్బుల వీపుల మెరుపుల పిల్లలు
మర్రి తోపుల మీద – వంగి చూచేరు
నీలాంబరాలలో – మేఘ మల్‌హారాలు
చెలియరో!....
నీలాంబరాలలో – మేఘ మల్‌హారాలు ||

వచ్చిన వాడు – వట పత్ర శాయి
నాదు ఛాయల – విశ్రాంతి గై కొనె – ననుచు
మర్రి చెట్టుకు – వల్ల మాలిన గర్వము
చెలియరో!......
మర్రి చెట్టుకు – వల్ల మాలిన గర్వము ||


************************************

అందరికీ మా దీపావళి శుభాకాంక్షలు !

3, నవంబర్ 2010, బుధవారం

అమృతాంజన దీపావళి













“ దీపావళి పండుగ తో పోలుస్తూ ఒక ప్రముఖ కవి
“ శిరో భారాన్ని తొలిగించే – అమృతాంజనము"– గురించి
ఒక వ్యాపార ప్రకటన కొఱకు ఈ గీతమును రాసారు.

ఋతు రాజంబు, వసంతంబు ;;;;;
రోగ రహిత రాజ్యం అమృతాంజనం –
వసంతమున మోడులు చిగుర్చును
మనుజుల మనముల నమృతాంజనము తలిర్చును ....... ||

అమృతాంజన దర్శనమున రోగము
లడవి దవ్వుగా పరిగిడుచు
చలి ఉష్ణము చతికిల బడును
కమనీయము దాని సేవ నెపుడు
కలలో నైనను మరువకుము! ..... ||

పుండే కాని, గాయమె కాని
కత్తి తగిలిన గంటే కాని
చర్మమునకు సంధించిన బాధల
చయ్యన బాపుట దాని నిధి! ||

ఆస్త్మా పీడితులగు వృద్ధులును
గోరింత దగ్గు కల బాలురును –
అమృతాంజన మర్దనతో
పీడా విముక్తులగుదురు ఒక తృటిలో... ||

తక్కిన మందులు ఏవో ప్క్కొక్క
రోగము మాంప సమర్ధము నేమో!...
అమృతాంజనము సర్వ రోగ
సంహారకమగు వజ్రాయుధము ..... ||

ఇతర డాక్టరుల వలెనే ఇయ్యది
బ్రతిమలాడినా రానిది కాదు
నిన్నంటుకొని తిరిగి కుదిర్చే
నేర్పు దానికె పెట్టని సొమ్ము ||

మన దేశంబు ఘన స్వాతంత్ర్య
మహిమ నిటుల నలరారే వేళ
మన కానందము అమృతాంజన
దీపావళి నిలిపే ఉత్సవ లీల ........ ||

"ఆంధ్ర పత్రిక" మహా నిర్మాత కాశీ నాధుని నాగేశ్వర రావు గారు
" అమృతాంజనము " మీద వ్యాపార ప్రకటనలను తయారు చేయిస్తూన్నారు.
"భారతి - పత్రికలో వేయిద్దాము," అని చెప్పగా
గరిమెళ్ళ ఈ తల నొప్పి గేయాన్ని రచించారు.

*****************************************
గరిమెళ్ళ సత్య నారాయణ _ 1893 లో
శ్రీకాకుళము జిల్లాలోని నరసన్న పేట తాలూకా లోని
గోనెపాడు గ్రామములో జన్మించారు(July 14, 1893 _ December 18, 1952).
తండ్రి గారి ఊరు – విజయనగరము జిల్లాలోని ‘ప్రియాగ్రహారము’.

“పెంకి పిల్ల” అనే పత్రికా సంపాదకుడు ‘ పసుమర్తి రాఘవ రావు’ చేసిన
ఇంటర్వ్యూలోని కొన్ని విశేషాలు ఇవి.
జానపద బాణీలో ఇష్టంగా గీతాలను రచించే గరిమెళ్ళ సత్య నారాయణ
“నాకు స్ఫూర్తి గురజాడ అప్పా రావుగారు,
గిడుగు రామ మూర్తి పంతులు గారు.” అని వక్కాణించారు.
నాటి తన సమకాలీన రచనల పట్ల
కొంత విముఖతను కలిగి ఉన్నారు గరిమెళ్ళ సత్య నారాయణ.

“ Let hundred flowers blossom..” – అన్నట్లు
ఒక తోటలో ఎన్ని రకాల పూల మొక్కలు ఉండవు!?
గులాబి మొక్కలు, సంపంగి మొక్కలు పోట్లాడుకొను చున్నవా?
మల్లె పూలు, జాజి పూలు సరసాలాడుకోవడం లేదా? .....”అంటూ -
“ ధన పిపాస లేనప్పుడే ‘జాతీయత’ ఏర్పడి,
తద్వారా ‘ సమ రస భావము’ ఏర్పడుతుంది.”
అని తన అభిప్రాయాన్ని వెలి బుచ్చారు గరిమెళ్ళ సత్య నారాయణ .
ఈ అమృతాంజన గీతమును - గరిమెళ్ళ సత్య నారాయణ రచించారు.

“మాకొద్దీ తెల్ల దొర తనము- దేవ!
మాకొద్దీ తెల్ల దొర తనము- ..... "

అనే గొప్ప స్వాతర్య గీత రచన చేసి,
ప్రజల నుండీ ఆప్యాయంగా
“Tiger Poet” అనే బిరుదును పొందారు .

----------------------------------------------

కొల్లాయి గట్టితే నేని
మా గాంధి- మాలడై తిరిగితే నేమి
వెన్న పూసా మనసు – కన్న తల్లీ ప్రేమ
పండంటి మోముపై బ్రహ్మ తేజస్సు ||

నాలుగు పరకల పిలక నాట్య మాడె పిలక
నాలుగు వేదాల నాణ్యమెరిగిన పిలక ||

బోసి నోర్విప్పితే ముత్యాల తొలకరే!
చిరు నవ్వు నవ్వితే వరహాల వర్షమే! ||

-------------------------------------------

“ శ్రీ గాంధి నామం – మరువాం మరువాం
సిద్ధము జైలుకు వెరువాం వరువాం..........”

మున్నగు అనేక స్వరాజ్య గీతాలు ఆ నాడు మన త్రిలింగ దేశములో
జాతీయోద్యమ స్ఫూర్తినీ, దేశ భక్తినీ హిమ నగ సమున్నతంగా ఉత్తేజ పరిచినవి.

-------------------------------------------------------
(link)

గరిమెళ్ళ కు గాంధిజీ ఇచ్చిన బిరుదు

"ప్రజా పాటల త్యాగయ్య" మన గరిమెళ్ళ

"మా కొద్దీ తెల్ల దొర తనము..." అనే స్వాతంత్ర్య గీతము దశ దిశలా మార్మ్రో గింది.
G.T.H. బేకన్(1921) గరిమెళ్ళ చేత ఈ పాటను పాడించాడు.
"భాష రాని నాకే ఇంత గగుర్పాటును కలిగించింది.
స్వదేశీయులలో ఇంకెంత ఉత్తేజాన్ని కలిగిస్తుందో అర్ధమైంది"
అంటూ ఆ పాటను నిషేధించాడు.

గరిమెళ్ళ సత్యనారాయణ గారికి రాజద్రోహం నేరం కింద
ఏడాది కఠిన కారాగార శిక్షను విధించాడు.
ఆ తర్వాత సబర్మతీ ఆశ్రమంలో,
గాంధీజీ ఈ పాటకు అనువాదము చేయించమని పురమాయించారు.
టంగుటూరి ప్రకాశం పంతులు గారి
"స్వరాజ్యం" పత్రికలో ఇంగ్లీష్ లోకి అనువదించి ప్రచురించారు.
N.G..రంగా, గరిమెళ్ళను "ప్రజా పాటల త్యాగయ్య" అని ప్రశంసించారు.

1, నవంబర్ 2010, సోమవారం

మయ సభ ( Eka pAtrAbhinaya)

















దుర్యోధనుడు ;
( ప్రవేశించి, కలయ జూచి ఆశ్చర్యముతో);;;;;

"ఔరా! ఈ రచనా చమత్కృతి ఏమియో గాని,
ప్రకృతి సౌందర్యము నధఃకరించుచు,
కురు సార్వభౌముండునైన
నా మానసమును సైతము ఆకర్షించుచున్నదే!
(ప్రక్కకు చూచి)
వీరు – నా నుడులను ఆలించి యుండరు కదా???
(ఆశ్చర్యముతో)
ఏమి వీరల రూప లావణ్యాతిశయములు!
ఈ త్రి జగన్మోహనాకృతులెవ్వరివై యుండును??
(సమీపించి)
ఓయీ! మీరలెవ్వరు?
ఇచ్చట నుండుటకు గతంబేమి? ఏమిది?
(బాగుగ పరీక్షించి)
నేనెంత భ్రమ పడితిని? నిమేషత్వమే లేదు.
ఇవి సాల భంజికలు!
సజీవ మనుష్యాకృతుల వలె నున్నవే!?
ఏమి ఈ కల్పన!
మయుని లోకోత్తర కళా కౌశలము!
(ఇంకొక వైపు చూచి)
సభా భవనమున ఉద్యన వనమా?
ఎంత రమణీయముగ నున్న్నది!
వివిధ ఫల భరావనత శాఖా, శిఖా, తరు వర విరాజితంబు –
రాజిత తరు స్కంధ సమాశ్రిత
దివ్య సురభిళ పుష్ప వల్లీమతల్లికా సంభాసురంబు!
భాసుర పుష్ప గుచ్ఛ స్రవన్మధుర
మధు రసాస్వాదనార్ధ
సంభ్రమ భ్రమర కోమల ఝుంకార నినాద మేదురంబు!
మేదుర మధుకర ఘన ఘనా ఘన శంకా నర్తన క్రీడాభిరామ -
మయూర వార విస్తృత కలా కలాప రమణీయంబు,
రమణీయ కోమల కలాప కలాప్యాలాప
మంజుల దోషద ధూప ధూమాంకుర సంకీర్ణంబు
సంకీర్ణ నికుంజ పుంజ సుందరంబు!
ఆహా! ఈ ఆరామ సౌకుమార్యంబు అత్యంత మనోహరంబు!
దిన దినానేక నూత్నారామ, రంజష్యమాన,
కౌరవ వంశ వర్ధన మనః ప్రమోదావహంబగు ఈ నిష్కటంబు.
తక్కొరుల కద్భుత దర్శనీయంబగుట నిర్వివాదాంశంబు!
కాననే"మయ సభ”,"మయ సభ”అని –
సామాన్య జనులు మొదలు రాజ కంఠీరవుని పర్యంతము
ఏక గ్రీవముగా – దీనిని గురించి వర్ణించుట సరియే!
(పరిశీలించి)
ఇందలి ఫల కుసుమ జాలములును
మహదానందము కలిగించుచున్నవి.
(నడువ బోయి)
కాసారమా ఇది! ఉండీ లేనట్లును,
లేకుండీ ఉన్నట్లును కానంబడుచున్నది.
(బాగుగా చూచి)
ఇచ్చట జలాశయమే!
కాకున్న ఈ బిస సూత్రములు!
ఈ శత పత్రాది కమలములూ ఎట్లుండును?!
ఔరా! ఏమి దీని శృంగార వైభవమ్ము!
సంస్పర్శ మాత్ర నూత్న చైతన్య ప్రసాదిక!!!!
శీతల విమల మధు వారిపూర్ణ సంపూర్ణంబు!!
మంద పవన చాలనోద్ధూత కల్లోల తరంగ మాలికా
పరస్పర సంఘట్టన జాయమాన
మృదుల ధ్వాన విస్తారాతి శ్రావ్యంబు.
కమల కోక నదాది నానా విధ జల కుసుమ రాగారుణిత దరీభాగంబు;
ఆలోల బాల శైవాల జాల లాలిత జంగమోద్యాన శంకావహంబు;
గ్రీవాలంకృత బిస సూత్ర పాళికా సందీపిత,
హంస హంసీ గణ భూషితంబు , వర్ణనాతీతంబు!
చూడం చూడ ఇయ్యది –
అపూర్వ రమణీయాకృతిం దలపించు చున్నది.
ఇందలి మధు వారి పూరము ఇంచుక గ్రోలి
ఈ పరిసరమ్మున నొక్కింత విశ్రమించెద!
(అ
డు
గు పెట్టి వట్టి నేల యగుటను యోచించి)
ఇది ఏమి? ఇచ్చటి ప్రకృతియే నన్ను పరిహసించుచున్నట్లున్నదే!!!!!!
ఇది ఎంత మాయగ నున్నది?
ఇది మయుని రచనా విశేషమా?
లేక నేను భ్రాంతియుతుడనై, విభ్రాంత చిత్తుడనైతినా?
(వినుచూ)
ఎచ్చటిదీ హాస ధ్వని????????
మమ్ము ఎవ్వరును పరిహసించుట లేదు కదా?????
(కలయ జూచుచూ)
ఇచ్చట ఎవ్వరునూ కాన రారే!!!
ఈ సవ్వడి ఎట నుండి వచ్చేను?
ఓహో! అతులిత మాయా రచనా సమర్ధుడైన
ఆ మయుండిట్లు ధ్వనించు యంత్రము ఇందెందైన నిర్మించి యుండెనేమో?
( మరి ఒక వంక చూచి)
ఆ కనపడునదేమి?
వివిధ వికార కుడ్య భాగాంతర్గత ద్వార దేశమా?
తత్ సువర్ణ శాఖాంతరోల్లిఖిత గారుత్మత వల్లీసముల్లసితమా?
వల్లీ సముల్లిత సల్లలిత పల్లవ సందోహమా?
మధ్యే పల్లవ సంపుటాత్యంత భాసుర పుష్ప ఫల ప్రతానమా?
పుష్ప ఫల మకరంద సవనార్ధ సమాగత షట్పద కీర వారమా?
(యోచిస్తూ, అటు ఇటు తిరుగుతూ) ~~~~~~~~
కట కటా! ఇట్టి త్రి జగన్నుత సభా భవనము –
పాం
డవుల యధీనములో యుండుటా? కాల స్వభావము!
నిన్న మొన్నది దనుక – నిలువ నీడ లేకుండిన పాండవులు!!!!!! –
దిగ్విజయ మొనరించి,
రాజ సూయ మహాధ్వర నిర్వహణమున
సార్వ భౌమ పదంబు నలంకరించుటయా??
అభిమాన ధనులగు భూ రమణు లెల్లరు అరి గాపులై,
వస్తు వాహనాది నానా విధోపాయనముల నర్పించి గౌరవించుటయా?
ఏ లోకముననో పడి యుండిన ఆ మయ బ్రహ్మ !
త్రిలోకాధిక భ్రాజ మానంఅగు ఈ సభా భవనమ్మును నిర్మించి ఇచ్చుటయా?
పాండవు లన్య జన దుర్నిరీక్ష్యులై విజృంభించుటయా?
ఇదంత కనులార గాంచుచు,
సుక్షత్రియ వంశ సంజాతుండగు
సుయోధన సార్వ భౌముడు సహించి ఊరక ఉండుటయా?
(యోచించి)
నా సమక్షమున ఊరును, పేరును లేని ధర్మజునకు
నా సామంతు లెల్లరున్ ఉపాయనమ్ములను అర్పించి,
పరస్పర శిరః కోటీర సంఘర్షణంబున డుల్లిన,
వజ్ర మణి మయూఖంబులు భూసతికి నూత్న శోభ నాపాదించి,
రత్న గర్భ నామమును సార్ధక పరుప –
సాష్టాంగ దండ ప్రణామంబు నాచరించుట నాకవమానము కాదా????????
దుర్మదంబున ధర్మజుండు యుక్తా యుక్త విచార విదూరుండై,
"సార్వభౌముని సమక్షము" - అను జ్ఞానమైనను లేక
స్వేచ్ఛగ వారి ప్రణతులం గైకొనుటయా?
యోచించిన కొలంది
మనంబున పట్ట రాని క్రోధము వెల్లి విరిసి – దుర్భరంబగుచున్నది.
ఇంక ఇచ్చట నిలువ జాల!
అదే - ఆకసంబనబడు ద్వారమున నిర్గమించెద!
(పోబోవ ద్వారము నుదుటికి కొట్టుకొనెను.)
అబ్బా! ఎక్కడిదీ పాపిష్ఠి శిలా ఫలకము?
ఎంత బిట్టుగ కొట్టుకొనెను.
(పరిహాస ధ్వని వినపడి,పైకి చూచెను).
మరల పరిహాసము!
( క్రోధముతో పైకి చూచి.)
పాంచాలీ! పంచ భర్తృకా!
నన్నే పరిహసించు చుంటివి కదూ!
కానిమ్ము; ఇప్పటి కిది పరిహాసము మాత్రమే!
కాలాంతరమున ప్రళయ భయంకర భైరవ వికటాట్టహాస విస్ఫారిత
భ్రుకుటీ ప్రభూత తీవ్ర వైశ్వానర జ్వాల! కానిమ్ము;
ఇప్పటి కిది పరిహాసము మాత్రమే!
కాలాంతరమున ప్రళయ భయంకర భైరవ వికటాట్టహాస
విస్ఫారిత భ్రుకుటీ ప్రభూత తీవ్ర వైశ్వానర జ్వాల ; తీవ్ర వైశ్వానర జ్వాల!

31, అక్టోబర్ 2010, ఆదివారం

ఆహ్లాద దీపావళి

















"దిబ్బూ, దిబ్బూ, దీపావళి
మళ్ళీ వచ్చెను నాగుల చవితి"

పండుగలు, భగవంతుని లీలలూ
భక్తి వాఙ్మయములో, సూఫీ కవితలలో
మేలిమి కాంతులీనాయి.
ఆబాల గోపాలమునూ అలరించే "దీపావళి" హుషారు గొలిపే పండుగ.
అందుకే, జాన పద గీతాలలో ఈ పబ్బము గుబాళించింది.
"దీపావళీ" అంటే 'దీపాల వరుసలు' అని అర్ధము.
ఈ పబ్బము నాడు, టపాసులు, బాణసంచాలు, మతాబాలు,
సీమ టపాసులు, చిచ్చుబుడ్లు , సరంజామాతో
ఇలా అనేక రకాల వెలుగులతో "జగమంతా కాంతి మయము" గా చేసి
తన పేరునకు సార్ధకత ను కలిగించుకున్నట్టి అపురూపమైన పండుగ.
అందుకే, దాదాపుగా ప్రపంచములో అన్ని దేశాలలోనూ
ఈ పండుగ ఆచరించ బడుతూన్నది.
ఆ యా దేశాలలో దీపావళి విభిన్నమైన నామ ధేయములతో ఉన్నది.

గౌతమ బుధ్ధుని అవతరణ సందర్భము గా .......
బర్మా(మియన్మార్) లో నవంబరు లో ...." తంగీజు"
బీహారు రాష్ట్ర వాసులు, నేపాల్ దేశీయులు
వరుసగా,...... ఐదు రోజులు ...
జపాను దేశములో -" తోరా నగీషి" పర్వ దినమును చేసు కుంటారు.
జపనీయులు మొదటి రోజున దీపాల వేడుకను జరుపుకుంటారు.
మర్నాడు బంధు,మిత్రులను కలుస్తారు.
మూడవ రోజునాడు " బోటు షికార్లు చేస్తూ" ఆనందముగా గడుపుతారు.

నవంబరు 5 వ తేదీన _ ఇంగ్లండు లో _ "గై ఫాల్సు డే"

ఫ్రెంచి విప్లవము _ ఫ్రాన్సు దేశములో, ఫ్రెంచి వారు దేదీప్య మానముగా
తమ స్వాతంత్ర్య దినమునే వేడుకగా చేసుకుంటారు.

జూలై 4 వ తేదీ _ అమెరికాలో అద్భుతమైన బాణసంచాల వేడుకలు జరుగుతాయి.
ఎందుకంటే, జూలై 4 ననే, అమెరికా, 13 రాష్ట్రాల కూటమి గా ఏర్పడెను,గనుక!!!!!

ఇజ్రాయెల్ లో _ 21 శతాబ్దముల క్రితము,
" మోకాబిన్స్" అనే గాయకులు స్వాతంత్ర్య సమరం చేసారు.
జ్వాలకు విముక్తిని కలిగించిన రోజుగ, ఇజ్రాయిలీలు వేడుకలు జరుపుకుంటారు.
విభిన్న నామాలు ఉన్నప్పటికిన్నీ పండుగ పేరు ఏదైనా 9 - 8 - 2008
ఎల్లరి ఉల్లములకు ఉల్లాసాన్ని కలిగించే ఈ పండగ , కడు వేడుకయే!!!
హిందువులు విదేశాలలో ఏ రీతిగా పండుగలు చేసుకుంటున్నారో
( ఈ వీడియోలో) చూడండి

"దీపావళి" అనగానే ఎంత సందడి. ఎన్ని కేరింతలు, ఎన్నెన్ని జే జేలు!!!
అందరికీ దీపావళి శుభా కాంక్షలు!!!!!!

29, అక్టోబర్ 2010, శుక్రవారం

తుమ్మెదల మెట్ట దాకా పరుగు
















"సింహాచలము మహా పుణ్య క్షేత్రము,
శ్రీ వరాహ నర సింహుని దివ్య ధామము."
వీర భాను దీపుడు, కిమిడి ప్రభువు,
వల్లభాసావాస మల్లుడు, కొండ వీటి రెడ్డి రాజులు,
శ్రీ కృష్ణ దేవ రాయలు గారి పట్ట మహిషి, మున్నగు వారు
సింహాచల స్వామికి విలువైన కానుకలను సమర్పించారు.
స్వామిని అర్చించి, పలువురు అనేక శిల్ప, మండప,
సోపానాది నిర్మాణాలను వెలయించారు.
18 వ శతాబ్ద ఆరంభం నాటికి సింహాచల క్షేత్రము
కటకము పరిపాలకుల ఆధ్వర్యంలో ఉండేది;
కాల క్రమేణా
పూసపాటి విజయ నగర ప్రభువులు నిర్వహణలోనికి వచ్చినది.
నేటికీ ఇక్కడ ఉన్న అసంఖ్యాక శాసనాలు,
దేవళమునకు భక్తులు సమర్పించిన భూ దానములు వగైరాలు,
చక్రవర్తుల బహుమతులు – మున్నగునవి .
ఎన్నిటికో శిలా, శాసన రూపాదులలో ఉండి,
History Reaserch చేసే వారికి
అమూల్య వరములుగా ఒనగూడుతునాయి.
చైత్ర శుద్ధ ఏకాదశి మొదలు పౌర్ణమి వఱకు జరిగే
“శ్రీ స్వామి వారికి కళ్యాణ మహోత్సవాలు”
భక్త జనులకు నయన పర్వములు చేస్తున్నాయి.
సింహాచల క్షేత్ర మహిమలను కీర్తిస్తూ
శతకములు, సాహిత్యము వెలువడినవి.
విజయ రామ రాజు గజపతి అధికారములో ఉన్నప్పుడు
ఒక విశిష్ట సంఘటన జరిగినది.
మొగలాయీ సైన్యము దండ యాత్రలతో దేశము అల్ల కల్లోలముగ ఉన్నది.
తురుష్క సైన్యం దేవాలయాలను ధ్వంసం చేసే వారు.
సింహాచల క్షేత్రము కొండను ఎక్కాయి.
కొంత మేర కళ్యాణ మండప స్థంభాలను పగల గొట్టారు.
కోవెల తలుపులను కూడా విరగ్గొట్టి, లోనికి ప్రవేశించబోయారు.
అప్పటికే లోపల ఇద్దరు భక్తులు ఉన్నారు.
ప్రాణ త్యాగానికైనా సిద్ధ పడిన
ఆ భక్తుల పేర్లు గోకుల పాటి కూర్మ నాథ కవి, హరి హర దాసు.
వారిరువురు తలుపులు మూసుకుని
స్వామి మీద ఆశువుగా శతకమును చెప్ప సాగారు.
కూర్మ నాథ కవి పద్యాలను చెప్తూంటే,
హరి హర దాసు వ్రాయ సాగాడు.
వేద వ్యాసుని నుడువులుగా
“మహా భారతము” అనే నామముతో ప్రసిద్ధికెక్కిన
హిందువుల ఇతిహాసము ఐన “జయం” ను
తన దంతముతో వినాయకుడు రాసి పెట్టిన
మహత్తర సంఘటనకు సామ్యముగా ఇచ్చట జరిగినది.
“ వై రి హర రంహ సింహాద్రి నర సింహ” అనే మకుటముతో
సీస పద్య హారము వెలసినది.
బయట ముష్కరుల సైన్యము
ప్రజలను భయభ్రాంతులను చేస్తూ ముట్టడి చేసారు.
అప్పుడు ఒక విచిత్ర సంఘటన జరిగినది.
వేలాది తేనెటీగల దండు ఒక్కుమ్మడిగా ఆ ముష్కరులపై దాడి చేసాయి.
గుంపులు గుంపులుగా ఆ తేనెటీగలు దుష్ట బుద్ధి కల ఆ దుర్మార్గులను తరిమికొట్టాయి.
విశాఖ పట్టణములోని “తుమ్మెదల మెట్ట” దాకా
శత్రువులను పార ద్రోలినాయి.
పూసపాటి విజయ రామరాజు పరిపాలనా కాలంనాటికి
దేవాలయమునకు విశిష్ట సాంప్రదాయములు సమకూడినవి.
“శ్రీ స్వామి వారికి కళ్యాణ మహోత్సవాలు” ,
వైశాఖ శుద్ధ తదియ నాటి “స్వామి వారి నిజ రూప దర్శనము” లబ్ధిని
ప్రజా కోటి పొందుతున్నారు.
ఆ నాడు వలిచిన “సింహాచల స్వామి వారి ” చందనము తో
కలిపిన దివ్య తీర్థము లభిస్తుంది.
అక్షయ తృతీయ ఉత్తరాది నుండి దిగుమతి ఐ,
ఇప్పుడు మన దక్షిణ భారత సీమలలో కూడా
ప్రాచుర్యంలోనికి వచ్చిన పండుగ.
సింహాచలములో
క్రీస్తు శకము 1293 నుండి ఒక ఆచారము ఏర్పాటు ఐనది.
గంధము, హరి చందనము, కర్పూరము మున్నగు సుగంధ ద్రవ్యాలను నూరుట –
ఒక పవిత్ర కార్యక్రమముగా మొదలు పెడ్తారు.
పురూరవ మహా రాజుకు ఆకాశ వాణి ఇచ్చిన ఆదేశము మేఱకు
" అక్షయ తృతీయ నాడు, చందన వలుపు ఉత్సవము జరుగుటకు
బీజము పడినదని పౌరాణిక గాథ.
ఆ రోజు శ్రీ వరాహ నరసింహ మూర్తి నిజ రూప దర్శనము అందరికీ లభిస్తూన్నది.
3 రోజులు ముందు నుండి "జల ధారలను" విగ్రహముపై చిలకరిస్తూ ఉంటారు.
ఇందు చేత గట్టిగా ఉన్న చందనము మెత్త బడి, వలవడానికి అనువుగా మారుతుంది.
కప్ప స్తంభము ఇచ్చటి ప్రత్యేకత.
"సంతాన వేణు గోపాల స్వామి" అనుగ్రహము లభించి,
"దంపతులకు సంతానము కలుగును.
"కప్పస్తంభము"ను తాకి, వరములు కోరుట ఇచ్చటి విశిష్టత.

;;;;;;; అక్షయ తృతీయ (‘చందనొత్సవం’)

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...