చెప్పులను దొంగిలించిన వాళ్ళు, తర్వాతి జన్మలలో ఊసరవల్లిగా పుడతారని శ్రీమద్ మహా భారతములో ఉన్నది.దీనినే ఒంటాకియా (“Otikyata” a type of lizard) అని పేరుతో ఇంగ్లీష్ భాషలో ఉన్నది. బల్లి (Lizard)జాతికి చెందిన, ప్రాకే జంతువు ( Amphibia,Reptilia) ఇది. తొండను ఊసరవల్లి అని పిలుస్తారు.
కంచిలోని వరద రాజ పెరుమాళ్ , పేరుం దేవి అమ్మవార్లు కొలువై ఉన్న విష్ణుకంచి గొప్ప పుణ్య క్షేత్రము.దేవళములో పై కప్పు మీద రెండు వెండి బల్లి బొమ్మలు ఉన్నవి. వాటిని తాకితే , పాపాలు పోతాయని, బల్లిని ఎప్పుడైనా పొరపాటున తాకిన వారికి, బల్లి పాటు దుష్ఫలితాలు దరికి చేరవనీ భక్తుల నమ్మకం. ముఖ్య జాతులుగా వర్గీకరించదగినవి
ఇంటి తొండ ; gekkonidae
ఊసరవెల్లి; chameleon
ఉడుము; varanidae
తొండ; chameleonidae
క్రితం నుండి "బల్లి ఆరాధన" - ఇక్కడ ఆచరణలో ఉన్నది.
ఏడు దివ్య పుణ్య క్షేత్రములలోని "కాంచీపురము",
"సహస్ర దేవాలయ సీమ" అని ప్రసిద్ధి చెందినది.
East India Company - Governor General రాబర్ట్ క్లైవ్ varada raaja perumal కు సమర్పించిన హారము
"రాబర్ట్ క్లైవ్ మకరకండి" - అని పిలవబడుతూన్నది.
విష్ణు కంచి, శివ కంచి, వీటితో పాటు ఆ పురములో
ప్రాచీన కాలములో బుద్ధ కంచి, జైన కంచిలు కూడా ఉన్నవి.
వరద రాజ పెరుమాళ్ దేవళముపై సీలింగు పై
కాంచన, రజత బల్లులు, సూర్య, చంద్రుల చిహ్నాలతో ఉన్నవి. పూజ గదిలో బల్లి చప్పుడు వినిపిస్తే తాము అనుకున్న పనులు సఫలమౌతాయని ప్రజలలో విశ్వాసం.
మన దేశంలో - బల్లి శకునము - ప్రత్యేక శాస్త్రంగా రూపొందింది- అంటే అతిశయోక్తి కాదు.
బల్లి పాటు, బల్లి శకునాలూ,
అనేక సామెతలు కూడా ప్రజల పలుకుబడిలో ఉన్నాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి