శ్రీపాద శ్రీవల్లభుల మాతృ వర్గ తరఫు న నుండి 30 తరముల వెనుక నుండి బంధుత్వము కలిగిన భాగ్యశాలి మల్లాది గోవింద దీక్షితులు. ఆయన కృషి చేసి, రేఖా మాత్రంగా ఉన్న శ్రీపాద శ్రీ వల్లభుల చరిత్రను కూలంకషంగా పరిశీలన చేసి, శ్రీపాద వల్లభు విపుల చరిత్రను వ్రాసారు. మరాఠీ భాషలో శ్రీ సరస్వతీ గంగాధర్ 1450 A.D.లో రాసిన "శ్రీ గురు చరిత్ర" లో శ్రీ శ్రీ పాద వల్లభుల ప్రస్తావన ఉన్నది.
శ్రీ పాద వల్లభులు మన తెలుగు దేశం వాడు అగుట మనకు గర్వ కారణము. శ్రీపాద వల్లభులు గోదావరి జిల్లాలోని పిఠాపురం లో పుట్టారు. ఆయన ఒక శుద్ధ సనాతన స్మార్త శ్రోత్రియ కుటుంబంలో జన్మించారు. సాక్షాత్తూ దత్తాత్రేయస్వామి అపరావతారము శ్రీపాద శ్రీ వల్లభులు.
శ్రీ పాద వల్లభులు 1320 - 1350 కాలమునాటి ముని. శ్రీపాద వల్లభులు దర్శించిన ప్రదేశాలలో ఒకటి కర్ణాటక రాష్ట్రములోని కరువపూర్.శ్రీపాద వల్లభులు చరణ స్పర్శచే పునీతమైన ఊరు కరువారూర్, ఇచ్చట శ్రీపాద వల్లభుల ముద్రలు ఉన్నవి.హిమాలయాలలో తపము ఆచరించిన తపస్విలుఅగణితముగా ఈ సీమను దర్శించుకున్నారు. స్కంద పురాణములో 28 వేల మంది తాపసులు కరువరూర్ ను దర్శించారని చెప్పినది. ఇలాగ ఈ శ్రీ పాద వల్లభుల పవిత్ర పుణ్య క్షేత్రమైన కురువరుర్ భాసిల్లుతూన్నది
క్రిష్ణా నది వలయముగా ఏర్పడి, మధ్యలో ఉన్న కరువారూర్ "గురు ద్వీపము" గా పిలువబడుచున్నది. కరువారూర్ లో అనేక విశేషాల వలన ఇటు పుణ్య క్షేత్రముగా మాత్రమే గాక, అటు చారిత్రక స్థలముగానూ, ప్రకృతి దృశ్య ప్రేమికులకు విహార స్థలంగానూ విలసిల్లుతూన్నది.
అచ్చట ఒక గొప్ప వృక్షం ఉన్నది.
ఆ ఔదుంబర వృక్షము (మేడిచెట్టు) కింద తెంబె స్వామి తపస్సు చేసారు.
ఇక్కడ 1000 సంవత్సరాల వట వృక్షము ఉన్నది. ఈ ప్రాచీన వృక్షము, అటు వృక్ష శాస్త్రజ్ఞులకు, ఇటు భక్తులకూ, ప్రకృతి ప్రేమికులకూ ఆహ్లాదాన్ని చేకూరుస్తూన్నది. ఈ చెట్టు ఉన్న గుహ (Kuravpur/ kuruvalaya/Kuravapura). అలాగే శ్రీ విఠల్ బాబా ఆశ్రమం, దత్త మందిరము చూడవలసిన చోట్లు.శ్రీ పాద వల్లభుని సమకాలీన వ్యక్తి శంకరభట్.ఈతను కన్నడ భాషలో చేసిన రచన - "శ్రీ శ్రీ పాద వల్లభర దివ్య చరితామృత".
ఇందులో శ్రీపాద వల్లభుల తపో సముపార్జిత అద్భుత మహిమలను వర్ణించారు
నవంబర్, 2001 లో మల్లాది గోవింద దీక్షితులు - భక్తవరులకువారి అమూల్య రచన లభించినది. 53 అధ్యాయాలు ఇందులో ఉన్నవి. ;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;; కర్నాటక రాష్ట్రంలో, చిత్ర దుర్గ జిల్లాలోని, చల్లకెరె తాలూకాలో ఉన్న దొడ్డెరి గ్రామములో శ్రీ గురు కన్నేశ్వర స్వామి దత్తావధూత ఆశ్రమము వారు
"శ్రీ శ్రీ పాద వల్లభర దివ్య చరితామృత "ను ముద్రణలు భక్తులకు ఇచ్చారు. " శ్రీ పాద శ్రీ వల్లభ సంపూర్ణ చరితామృతము " గ్రంధములో ఎన్నో గొప్ప విషయములు చెప్పబడ్డాయి. వల్లభాఛార్యులు వారు శుద్ధాద్వైత సిద్ధాంతాన్ని స్ఠాపింఛారు. ఆయనపై చైతన్యమహాప్రభువు ప్రేరణ ఎక్కువగా వుంది.మృదు మధురమైన మధురాష్టకం ఆయన రఛనయే!
మధురాష్టకం [madhurashtakam]
అధరం మధురం - వదనం మధురం
అధరం మధురం - వదనం మధురం నయనం మధురం - హసితం మధురమ్ హృదయం మధురం - గమనం మధురం మధురాధిపతే రఖిలం మధురం
వచనం మధురం - చరితం మధురం వసనం మధురం - వలితం మధురమ్ చలితం మధురం - భ్రమితం మధురం మధురాధిపతే రఖిలం మధురమ్
వేణుర్మధురో - రేణుర్మధురః పాణిర్మధురః - పాదౌ మధురౌ నృత్యం మధురం - సఖ్యం మధురం మధురాధిపతే రఖిలం మధురమ్
గీతం మధురం - పీతం మధురం భుక్తం మధురం - సుప్తం మధురమ్ రూపం మధురం - తిలకం మధురం మధురాధిపతే రఖిలం మధురమ్
కరణం మధురం - తరణం మధురం హరణం మధురం - రమణం మధురమ్ వమితం మధురం - శమితం మధురం మధురాధిపతే రఖిలం మధురమ్
గుఞ్జా మధురా - బాలా మధురా యమునా మధురా - వీచీ మధురా సలిలం మధురం - కమలం మధురం మధురాధిపతే రఖిలం మధురమ్
గోపీ మధురా - లీలా మధురా యుక్తం మధురం - ముక్తం మధురమ్ దృష్టం మధురం - శిష్టం మధురం మధురాధిపతే రఖిలం మధురమ్
గోపా మధురా - గావో మధురా యష్టిర్మధురా - సృష్టిర్మధురా దలితం మధురం - ఫలితం మధురం మధురాధిపతే రఖిలం మధురమ్ .
శ్రీమద్వల్లభాచార్యవిరచితం మధురాష్టకం సంపూర్ణం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి