6, మే 2011, శుక్రవారం

విశాఖ పట్టణ బీచిలో Hawa mahal


















మహా రాజా విక్రమదేవ వర్మ, "అపర క్రిష్ణ దేవ రాయలు" గా 
ప్రజల చేత ప్రశంసించబడినారు.
విశాఖ పట్నంలో - బీచ్ వద్ద "హవా మహల్"లో నివసించే వారు. 
రాజా విక్రమదేవ వర్మ జన్మతః - ఒరియా  వ్యక్తి. 


అతి సామాన్యమైన మధ్య తరగతికి చెందిన కుటుంబంలో పుట్టారు. 
జయ పురము రాజ కుటుంబానికి వారసులుగా రాజా విక్రమదేవ వర్మ  
సంస్థానం బాధ్యతలను చేపట్టారు.
హవా మహల్ - అభినవ భువన విజయము గా వెలుగులీనినది.
సంస్థాన వ్యవహారాలతో పాటు, 
లలిత కళలతో వినోదాలతో 
నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా హవా మహల్ విలసిల్లేది.
శ్రీ రాజా విక్రమదేవ వర్మ, ఆంధ్ర విశ్వ విద్యాలయానికి - 
ప్రతి ఏటా లక్ష రూపాయలు 
( ఇప్పుడు సుమారు 70 రెట్లు విలువను అంచనా వేయవచ్చును)- ఇచ్చే వారు.
పది సంవత్సరాల పాటు, ఇలాగ అవిచ్ఛిన్నంగా ఈ రివాజు కొనసాగినది.
భాషా ప్రయుక్త రాష్ట్రాలు , తద్వారా- ఆంధ్ర ప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాలు ఏర్పడ్డాయి. 
పర్లాకిమిడి,గంజాం మున్నగు పరగణాలలో తెలుగు వారు ఎక్కువమంది ఉన్నారు. 
అందువలన ఆ ప్రాంతాలను ఆంధ్ర దేశంలోనికి చేర్చాలని తెలుగువారు 
(గిడుగు మున్నగు వారి ఆధ్వర్యంలో) ప్రయత్నించారు, 
కానీ వారి శ్రమ విఫలమైంది.
రాజా విక్రమదేవ వర్మ కోరిక వలన, 
పర్లాకిమిడి సంస్థాన సీమ ఒరిస్సా రాష్ట్రానికి చేర్చబడినది.
(ఇలాగే టంగుటూరి ప్రకాశం పంతులు మున్నగువారు 
దక్షిణాది ప్రాంతాలకై శ్రమించారు.మద్రాసు పట్టణము - 
తమిళనాడు చేరగా -  తిరుపతి మహా   పుణ్య క్షేత్రము 
మన ఆంధ్ర దేశమునకు చెందినవి.)
జయ పుర సంస్థానము ఒరిస్సాలో కలిసిన మరు క్షణం నుండే, 
ఆంధ్ర విశ్వ విద్యాలయానికి,రాజా విక్రమదేవ వర్మ 
ప్రతి ఏడూ ఇస్తూన్న లక్ష రూపాయల విరాళము నిలిపివేసారు.  


@@@@@@@@@@@@@@@@@@@@@


(రాజుల నిర్ణయాలు, అప్పటికి చిన్నవిగానే అనిపిస్తూన్నా, 
కొన్ని సార్లు సీమల చరిత్రనే ప్రభావితం చేస్తూంటాయి కదా! 
ప్రపంచ చిత్ర పటంలో భారత దేశము- 
బొమ్మను అట్లాసులో వేయాల్సిన పద్ధతిని ప్రశ్నార్ధకంగా చేసి, 
అతి ప్రాచీన కాలం నుండీ 
కాశ్మీరులో నివసిస్తూన్న అహింసా సిద్ధాంత సమాజాల భవితను  
చిక్కులలో పడవేసినది - 
ఆలస్యంగా స్పందించినట్టి, ఇలాంటి ఒక రాజు యొక్క నిర్ణయమే.)




పూర్వ కాల వైభవానికి తీపి గురుతుగా నేటికీ హవా మహల్ బీచ్ రోడ్డులో ఉన్నది. 


  (ఆంధ్రా యూనివర్సిటీకి విరాళాన్ని ఆపిన రాజా )


     Town hall (photo ) Link 

3 కామెంట్‌లు:

కమనీయం చెప్పారు...

మీ బ్లాగులోని ఫోటో హవామహల్ది {విశాఖ)కాదనుకొంటాను.వేరే బంగాలాది అనుకొంటాను.విసదీకరించండి.పర్లాకిమిడి ఒరిస్సాలో చేరడానికి పర్లాకిమిడి రాజా కారణమంటారు.ఏమైనా జయపురం విక్రమదేవవర్మ ఆంధ్రా యూనివర్సిటీకి ఇచ్చిన విరాళం ,తెలుగు భాషకు చేసిన సేవ చిరస్మరణీయం. ======రమణారావు.ముద్దు the photo belong
sto townhall please publish photo of
hawamahal.

కమనీయం చెప్పారు...

మీ బ్లాగులోని ఫోటో హవామహల్ది {విశాఖ)కాదనుకొంటాను.వేరే బంగాలాది అనుకొంటాను.విసదీకరించండి.పర్లాకిమిడి ఒరిస్సాలో చేరడానికి పర్లాకిమిడి రాజా కారణమంటారు.ఏమైనా జయపురం విక్రమదేవవర్మ ఆంధ్రా యూనివర్సిటీకి ఇచ్చిన విరాళం ,తెలుగు భాషకు చేసిన సేవ చిరస్మరణీయం. ======రమణారావు.ముద్దు the photo belong
sto townhall please publish photo of
hawamahal.

kadambari చెప్పారు...

ఆ photo హవామహల్ ది కాదు,
townhall దేనండీ!
రెండు జళ్ళ సీత, మొదలైన సినిమాల షూటింగు
ఆ పరిసరాలలో జరిగినదని వినికిడి.
హవా మహల్ ఫొటో గూగ్లేషణ- లో లభ్యమవ లేదు; కనుకనే, టౌన్ హాల్ ఫొటో,Tag సహా ఇచ్చాను,
మీ అభిమానపూర్వక సలహాకు ధన్యవాదములు, ramaneeyam గారూ! .
(ఆ చోట ఈ పాటికి అపార్టుమెంట్లు వచ్చాయని ఎవరో చెబితే విన్నాను......)

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...