30, జూన్ 2010, బుధవారం

ఆత్మబలం (Telugu movie)






















"ఆత్మబలం” తెలుగు సినిమా నిర్మాణం జరుగుతున్న రోజులలోని కొన్ని సరదా జ్ఞాపకాలను
కథానాయకి బి.సరోజాదేవి కబుర్లలో చెప్పారు.
తను జోడీగా నటించిన హీరోలలో,
అక్కినేని నాగేశ్వరరావు వ్యక్తిత్వం గురించి తన అభిప్రాయాలను వెల్లడించినది.
"నాగేశ్వర రావుకు అసలు కోపమే ఎరుగని తన0.
ఎప్పుడూ నవ్వుతూ, జోవియల్గా ఉంటారు.
జోక్సు వేస్తూంటారు, నవ్విస్తూంటారు .
ఏ విషయం తీసుకున్నా,
ఆ అంశం పై అనర్గళంగా మాట్లాడుతూండడం
ఆయనకు వెన్నతో పెట్టిన విద్య.
షూటింగు సమయంలో కూడా - ఇతరుల లాగా చిరాకు పడరు;
కోప తాపాలకు ఈయన అతీతులేమో! - అని నాకు అనిపిస్తూంటుంది.

"ఆత్మబలం" షూటింగు జరుగుతూన్నప్పుడు,
మా బంధువులు, సన్నిహితులూ నన్ను చూడడానికి వచ్చారు.
నేను వాళ్ళను కలవడానికి లేస్తూన్నాను.
అలా నిలబడుతూండగా, A.N.R. నా జడ పట్టుకున్నారు. నన్ను లేవనీయకుండా
"నీ జడ నా చేతిలో ఉంది. ఎలా వెళ్తావు?
వెళ్ళాలన్నా వెళ్ళలేవు." అన్నారు నాటకీయ ఫక్కీలో.

నేను కూడా తమాషా చేస్తూ, తటాలున ఆయన విగ్గును పట్టుకుని, ”ఇప్పుడు మీ విగ్గు నా చేతుల్లో ఉంది, నా జడ లాగితే నష్టమేం లేదు గానీ, మీ విగ్గుఊడితేనే డేంజర్. అందుకని, నా జడను మీరు వదిలేస్తే నేను మీ కృత్రిమ జుత్తును వదిలేస్తాను." - ఇలా నేననగానే వెంటనే నా జడను వదిలేసారు.

"తల్లీ! నీకో నమస్కారం.
ఇంత మందిలో నా విగ్ కాస్తా ఊడిపోతే నాకెంతవమానం!?
అమ్మా! మనిద్దరి మధ్యనా గలాభా ఎందుకులే, వెళ్ళి రా తల్లీ!
పోయి రావమ్మా!” అన్నారు.

నేను "అలా రండి దారికి!" అన్నాను.

అప్పటి రోజులు బంగారు రోజులు.
షూటింగులలో, మధ్య మధ్య విరామం వ్యవధిలో
అందరూ కలివిడిగా ఉండే వాళ్ళము.
ఎలాటి భేషజాలూ, అహంకారాలూ లేకుండా
అందరూ ఒకే కుటుంబ సభ్యుల్లాగా మసలుకునే వాళ్ళం.
అలాంటి రోజులు తలపునకు వచ్చినప్పుడు ఎంతో ఆనందము కలుగుతూంటుంది.”

"ఆత్మబలం" అప్పటికాలంలో సూపర్ హిట్ సినిమా.
పాటలూ సూపర్ డూపర్ హిట్లే.
పొడుగాటి రెండు జడలు వేసుకుని,
బి.సరోజదేవి - నాగేశ్వర రావుతో నటించిన
"చిటపట చినుకులు పడుతూవుంటే.." పాట సూపర్ హిట్.

ఇప్పుడు గనక మళ్ళీ అదే సినిమాను పునర్నిర్మిస్తే,
మాధురీ దీక్షిత్, ఐశ్వర్యారాయ్, షారుఖ్ లు నటించిన Hindi Movie - "దేవదాసు"లాగా
తప్పక విజయభేరీ మోగిస్తుంది కదూ!

Chitra Varta ;;;;;;



By kadambari piduri,
May 30 2010 6:40AM

23, జూన్ 2010, బుధవారం

New wonders in India -- ( వెబర్ ప్రణాళిక)

హెరిడోటస్, కాలిమచస్ ( 484 బి.సి. - 425 బి.సి.)
[Herodotus (484 BC – 425 BC) and Callimachus (305 BC – 240 BC)
అనే వారికి కలిగిన ఆలోచనతో ప్రపంచములోని అత్యున్నత ప్రమాణాలు గల మానవ నిర్మాణాలను,
ఏడింటిని సెలెక్ట్ చేసే ప్రయత్నం మొదలైనది.
Canadian-Swiss Bernard Weber[1] చేసిన ప్రయత్నం ద్వారా,
మళ్ళీ ప్రపంచ దేశాలన్నీ, ప్రజలందరి దృష్టినీ ఆకర్షించింది.
new 7 wonders project వలన అన్ని దేశాలలోనూ
పిన్నలనూ, పెద్దలనూ, ఆ బాలగోపాలమూ
పెల్లుబుకిన దేశభక్తితో ప్రతిస్పందించారు;
ఎంపికలో తమ తమ ప్రాంతాలలోని
అద్భుత కట్టడాలు ఉండాలని పరితపించారు;
అతి విచిత్రంగా అందరిలోనూ చరిత్ర పట్ల అవగాహనను పెంపొందింప జేసింది.
తమ స్థానిక ప్రకృతి వింతల పట్ల ఆసక్తిని,
నవ్యోత్సాహాన్ని ఇనుమడించేలా చేసిన అపూర్వ సంఘటన ఇది "
అని ఒప్పుకోవాల్సిందే!

కెనడా - స్విస్ , బెర్నార్డ్ వెబెర్,
గవర్నమెంటు పర్యవేక్షణలో కొత్తగా ప్రపంచ వింతలను సేకరించింది.
ఈ ఐడియా కొత్తగా, ప్రజాభిప్రాయ సేకరణలపైన ఆధారపడి కొనసాగింది.
మొబైల్ ఫోన్లు ద్వారా ఈ కార్యక్రమాన్ని,
ప్రణాళికా బద్ధంగా విజయవంతంగా నిర్వహించారు.
గవర్నమెంటు పర్యవేక్షణలో, ప్రైవేట్ సంస్థ ద్వారా;
కెనడా - స్విస్ , బెర్నార్డ్ వెబెర్,
కొత్తగా సేకరణ పద్ధతి ద్వారా సేకరించిన ప్రపంచ వింతలను ప్రకటించింది

" Times of India " మున్నగు పత్రికలు, ఔత్సాహికులు ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా,
ఇండియా లోని ఏడు వింతలుగా select ఐనవి;

1.హంపీ ;

2. ఒరిస్సాలోని కోణార్క దేవళము ;

3. నలందా విశ్వ విద్యాలయము;

4. పంజాబ్ లోని అమృతసర్ నగరములోని "Golden Temple" "స్వర్ణ దేవాలయము ;

5.శ్రావణ బెళ గొళా ,గోమఠేశ్వర విగ్రహము ( మహా బాహు మూర్తి,కర్ణాటక రాష్ట్రము );

6.ఖుజురాహో దేవాలయాలలోని శిల్పాలు ;

7. ఆగ్రాలోని తాజ్ మహల్ ;
వీనిలోని "తాజ్ మహల్" ,అటు UNESCO యొక్క పాత లిస్టులోనూ,
గవర్నమెంటు పర్యవేక్షణలో, ప్రైవేట్ సంస్థ ద్వారా ప్రకటితమైన నవీన పట్టికలో కూడా ఉన్నది

ప్రపంచ వింతలు - వెబర్ ప్రణాళిక
___________________

కెనడా - స్విస్ , బెర్నార్డ్ వెబెర్,
కొత్తగా సేకరణ పద్ధతి ద్వారా సేకరించిన
ప్రపంచ వింతలను ప్రకటించింది

ఈ ప్రాజెక్టుకు Swiss-originated Canadian filmmaker and aviator
సెప్టెంబర్ 1999 లో శ్రీకారం చుట్టారు.

2001 నుండి ఒక కెనెడియన్ సైట్ కి 700 డాలర్లును రుసుముగా వెబెర్ (
Mr. Weber )చెల్లించాడు,
వెను వెంటనే వారు ప్రజలు అందరూ విరివిగా ఈ ఓటింగులో పాలు పంచుకున్నారు .
100 మిల్లియన్లు మంది ఈ voting లో పాల్గొన్నారు;
దీన్ని బట్టి " New Seven Wonders of the World " అనే
ఈ కాన్సెప్టు జనాలను ఎంతగా ఆకర్షించిందో బోధ పడుతుంది.
కార్య రంగంలోకి దిగారు.
వారు నిశిత పరిశీలనలు చేసి, అనేక వడ పోతల తర్వాత చేసిన ఎంపికలు ; ;

New seven Wonders ,
పోర్చుగల్ లోని లిస్బన్ పట్టణంలో
జూలై 7, 2007 న విజేతలను ప్రకటించారు.
New seven Wonders

July ,2007 లో ఇండియా లో భారత దేశములోని అద్భుతాలను ఎన్నిక
చేయడానికై యావన్మందీ జిజ్ఞాసతో పాల్గొన్నారు.
రేడియో స్టేషన్లు, టి వి చానెళ్ళు,మొబైల్ కంపెనీలు ,సెలెబ్రిటీలు
అనేక మంది స్వచ్చందంగా ఉదార పూర్వకంగా భాగస్వాములు అయ్యారు.

*********************************************************

By kadambari piduri, - Feb 5 2010 6:01AM

22, జూన్ 2010, మంగళవారం

పరాశక్తి - shivaji ganeshan

















1952 లో విడుదలైన “ పరాశక్తి” - సినిమా చరిత్రలో
అనేక అంశాలుతో స్థానం గడించినది.
ఈ చలనచిత్రం సంభాషణలను " కరుణానిధి " రచించారు.
కలైంగర్ కరుణానిధి యే –
తరువాత , తమిళ నాడు ముఖ్యమంత్రి అయ్యారు;
ఇదీ ముఖ్య విశేషం.

1. శివాజీ గణేశన్, పండరీ బాయ్, శ్రీ రంజని, ఎస్.వి. సుదర్శనం మున్నగువారు నటించారు.
2.A.V.M. ప్రొడక్షన్ బ్యానర్ మీద నిర్మించబడిన మూవీ.
3. Kalaingar M. Karunanidhi మాటలు రాసారు.
4. Parasakthi ని సనాతనవాదులైన బ్రాహ్మణుల మీద విపరీతంగా విమర్శలు చేస్తూ చిత్రించారు.

అందువలన,
ఈ సినిమా అనేక సంచలనాలకు ఆలవాలమై,తమిళ సినీ హిస్టరీలో
గుర్తుఉండి పోయింది.
అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి (Chief Minister of Madras) చక్రవర్తి రాజ గోపాలాచారికి -
ఈ సినిమాలో బ్రాహ్మణ ద్వేషముతో -,” కుత్సిత మార్గంలో సాగిన చిత్రీకరణ మూలాన, నచ్చలేదు.
ఏమైనా, Sivaji Ganeshan నటనా ప్రాభవానికి నిదర్శనము ఈ తమిళ చిత్రం “పరాశక్తి”.

పరాశక్తి ;

By kadambari piduri,
May 23 2010 2:52PM

20, జూన్ 2010, ఆదివారం

చదరంగ క్రీడకు అధిదేవత


















1763 లో, 17 సంవత్సరాల వయసులో విలియం జోన్స్
లాటిన్ భాషలో ఒక పద్యాన్ని వ్రాసాడు.
658 లైన్లు ఉన్న ఆ పోయెం పే
రు "Scacchia, Ludus" ;
Marco Girolamo Vida 1527 ల్) ఆ పద్యాన్ని పబ్లిష్ చేయించారు.

భారత దేశంలో ఉదయించిన గృహ క్రీడయే "చతురంగము".
ప్రపంచ క్రీడా పటములో సుస్థిర స్థాన్నాన్ని ఆర్జించినది మేధా శక్తికి పదును పెట్టే ఈ "చదరంగము".
ఈ చెస్ ఆటకు గల పౌరాణిక గాథా రూపాన్ని
జోన్స్ తన Latin poem" ద్వారా వెలుగులోనికి తీసుకు వచ్చాడు .

మొదట లాటిన్ భాషలో రాసిన, తన పద్యానికి అతడే ఇంగ్లీష్ లో కూడా రచించాడు.
ఇందులో - ఇమిడ్చిన కథ ఇది;
మార్స్ యుద్ధ దేవుడు. కైసా యక్ష కన్యక. మార్స్ ఆమె ప్రేమిస్తాడు.
అందుకు అతని స్నేహితుడు " CHESS game " ను సృష్టించి, బహుమతిగా ఇచ్చాడు.

"గులేబకావళి" అనే తెలుగు సినిమాలో
ఎన్.టి.రామారావు కథానాయిక 'జమున'ను చదరంగంలో గెలుస్తాడు.

అదే పద్ధతిలో, మార్సు కూడా కైసాను చెస్స్ గేము లో ఆమెను గెలిచాడు.
ఆనాటినుండీ, Caissa "goddess" of chess"గా (చదరంగ క్రీడకు అధిదేవతగా) పేరుగాంచినది.
ఐతే మనము సర్ విలియం జోన్సును ఇంకా మెరుగైన విశేషముల వలన
జ్ఞాపకం చేసుకొన వచ్చును.
ఇండో-యూరోపియన్ భాషల గురించి అమోఘమైన కృషి చేసిన మహనీయుడు అతను.

దక్షిణ భారతీయములగు -
తెలుగు, కన్నడ, తమిళ. మళయాళ భాషలు ఆర్య భాషలకు
కొంత విభిన్నమైనవని కనుగొన్నాడు.
ద్రావిడ భాషా వర్గములకు చెందినవని నిరూపించాడు.
"ఆసియాటిక్ సొసైటీ"ని నెలకొల్పాడు.
ప్రాచీన భారత దేశమును గురించి అవిరళముగా అధ్యయనం చేసినాడు.
గ్రీకు, లాటిన్, హీబ్రూ, అరబిక్, చైనీస్ భాషలను ప్రాధమిక మూలాలను నేర్చుకోవడం మొదలిడిన
విలియం జోన్సుకు క్రమేణా అనేక లాంగ్వేజ్ ల పట్ల ఆసక్తి, మక్కువ పెరిగాయి.

28 ఏళ్ళు ప్రాయం నాటికి 13 భాషలలో పట్టు సంపాదించి,
hyperpolyglot గా చిరకీర్తిని గడించాడు.
ఆతనికి "ఇండియా" పట్ల గౌరవము పెరిగింది.
1783 నుండి కలకత్తాలో నివసించసాగాడు.
అనేక అంశాల మీద ఎన్నో ప్రామాణిక గ్రంధాలుగా
నిలువ దగిన పుస్తకములను రాసాడు.
కలకత్తాలో ఏప్రిల్ 27, 1794 లో కీర్తిశేషుడైనాడు .

Telusaa!

చదరంగ క్రీడకు అధిదేవత ;

By kadambari piduri, Jun 8 2010 11:18PM

11, జూన్ 2010, శుక్రవారం

చలం - ఆఖరి ఉత్తరం



















అరుణాచలంలోని రమణ మహర్షి ఆశ్రమంలో విశ్రాంతి తీసుకుంటూన్నారు
వివాదాలకు కేంద్ర బిందువైనట్టి ప్రఖ్యాత రచయిత చలం.

ప్రఖ్యాత విమర్శకులు, రచయిత కూడా అయినట్టి
ఆర్.ఎస్. సుదర్శనం " మళ్ళీ వసంతం" నవలను రాసారు.
దానిని చలం గారి అభిప్రాయం కోరుతూ పంపించారు;

కానీ , ఆ నవల చలం గారికి ఆట్టే నచ్చ లేదు.

కొంత కాలం తర్వాత R.S. Sudarsanam -
తాను రచించిన మరో నవల " అసుర సంధ్య" ను పంపించారు.

" ........ అంతటికీ మీ నవల పేరు ఎంతో బావుంది నాకు.
ముందు మీరు పంపారు నాకు నవల, దాని కన్న ఇది చాల మెరుగు..........
మెంటల్ ఎనాలిసిస్ మీ ఫోర్ట్ ...... కొన్ని చోట్ల మీ చర్చలు నాకెంతో ఇష్టమైనాయి.
మీరు చాలా విషయాలపైన, దేశ ప్రజల పోకడల పైన
చక్కని ఎనలిటికల్ లయిట్ వేస్తోంది,
మీరు దేశాన్ని సమగ్రంగా చూసి రాసారు ఈ నవల."

"చలం గారికి కొంతైనా నచ్చిన నవలను రాయ గలిగానన్న మాట."
అని సంతోషించారు సుదర్శనం గారు.

$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$

4- 9 - 1966 లో రాసిన ఈ ఉత్తరం చలం గారు రాసిన ఆఖరి ఉత్తరం -
అందువలన సుదర్శనం గారు ఆ జవాబును అందుకున్న అదృష్ట వంతులు.

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

చలం శైలిలో అత్యద్భుతమైన కవితా ధార పరి పూర్ణంగా ఉన్నది.
ఈ సారి ఆ కోణంలో ఆయన రచనలను చదవమని నా మనవి;
ఇట్లు,
(కోణమానిని)

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&


Telusaa! -

చలం - ఆఖరి ఉత్తరం ;

By kadambari piduri, May 23 2010 3:01PM

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

చలం గారు "లేఖా రచన"కు సాహిత్య గౌరవాన్ని సముపార్జించిన
TREND SETTER ఐనట్టి గొప్ప రచయిత.
చింతా దీక్షితులు మున్నగు వారికి
ఆతడు రాసిన ఉత్తరములు,
జరిపిన ఉత్తర ప్రత్యుత్తర సంపద
తెలుగు సాహిత్య స్వర్ణ పేటికలో చేరిన అమూల్య ఆభరణాలు.
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

[ మచ్చుకు ఈ letter ను చదవండి ]

గుంటూరు,
14-03-30

my dear pendulum,

మీ వుత్తరానికి వెంటనే జవాబువ్రాసితీరాలనిపిస్తోంది.
అంతపని తొందరలో వ్రాసినా
మీ వుత్తరం సోడామల్లె పొంగుతోంది.
పెట్టిపోయిన ఆ మూర్ఖపు గొడవనతా ఒక్కసారిగా మానేశాను.
సూర్యనమస్కారాలు ముఖ్యం. అలసిపోయినాను.
ఏ మాత్రం లేదు Inspiration , బైటనించి గాని, లోపల్నించి గాని.

మా హెడ్మాష్టరు కుదర్చడానికి రోగుల్ని వెదకడంలో నిమగ్నుణ్ణి ప్రస్తుతం.
కొంతశక్తి వుంది ఆయనకి.
కాని వుత్త nonsense మాట్లాడుతాడు.
ఆ సాహేబు, ఎన్నేళ్ళకిందో చచ్చిపోయిన
యీవూరి ఉర్సుమస్తానుని కలుసుకొని మాట్లాడానంటాడు.

రోజూ నేనూ, సుబ్బారావూ
జాగ్రత్తగా జరుగుతున్న సంగతుల్ని గమనించి
గాంధీగారిని చర్చించుకుంటున్నాము.

నా వుత్సాహాన్ని అణిచిపెట్టడం కష్టంగా వుంది.
ఏ నిమిషానో తెంచుకుని ఆయనతో చేరి పోతానేమో ?
ఎవరికి తెలుసు ?

మొన్న రైల్లో సౌరిస్ టాగూరుగార్ని కలుసుకుంది.
ఆయన షౌ చేతిని పట్టుకున్నారు.
ఆయన్ని గురించి Rave చేస్తోంది.

అచ్చుకి కథలు తయారు చేస్తున్నాను.
బెజవాడలో మీకు యోగాసనాలు నేర్పుతాను.
మీ వెన్నెముక తాగుతుంది వాటిని.

ఈ Mrs. భూషణం నా బతుకుని చెడ్డకలగా మారుస్తోంది.
ఒకటేగొడవ, ఆ శుకుడి జాతకం పట్టుకుని,

"నేను సుఖంగా వుంటానని వుంది, కాదూ?"
"అవును."
"సుఖంగా అంటే ?"
"అంటే, సుఖంగా అన్నమాట."
"ఎట్లా?"
ఏం చెప్పను ??
"మరి నా నలభై మూడోయేట ఏం జరుగుతుందో చెప్పలేదే?, మేషలగ్నం అంటే ఏమిటి?"

నాకేం తెలుసు ? మేషంవొచ్చి ఆమెకు లగ్నం చేస్తుందనా?
ఆ జాతకం అతను మోసాలమారిట.
నన్ను వెళ్ళి అతన్ని తన్నమంటుంది.
లేకపోతే తానేవొచ్చి అతన్ని తంతానంటోంది.
ఇంక అతను ఆడవాళ్ళకి జాతకాలు చెప్పడనుకుంటాను.

$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

ఆంధ్ర దేశాన్ని ఉర్రూతలూగించిన
రచయిత గుడిపాటి వెంకటాచలం గురించి
అనేక మంది తమ అమూల్య అభిప్రాయాలను రాసారు.

కొన్ని లింకులు ;
__________




$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$

3, జూన్ 2010, గురువారం

హవా హవాయి ,పళ్ళు టోపీలు























కారమెన్ మిరండా పాటలు
తెలుగు, తమిళ సినీ మ్యూజిక్కును ప్రభావితం చేసాయి.
ఆమెకు `Brazilian Bombshell' “Queen of Samba.' , ఇత్యాది బిరుదములు ఉన్నాయి.

వైట్ హౌస్ లో ఫ్రాంక్లిన్ రూస్ వెల్ట్ (President Franklin D. Roosevelt) సమక్షంలో
ప్రదర్శనను ఇచ్చింది;
అమెరికా దేశము పౌరులు కాకుండా,
ఆ అగ్ర రాజ్యమునకు చెందని విదేశీ వనిత
అలాంటి గౌరవాన్ని దక్కించుకున్న మొట్ట మొదటి వనిత ఆమె!

ఆమె అసలు పేరు Maria de Carmo Miranda da Cunha.
పోర్చుగీసు పట్టణంలో ఫిబ్రవరి 9, 1909 లో జన్మించినది.
ఆమె తండ్రిది మంగలి వృత్తి .
ఆరుగురు సంతానములో ఆమె ఒకర్తె.
బ్రతుకు తెరువుకై,
ఆ కుటుంబం బ్రెజిల్ రాజధాని ‘ రియో డి జనిరో’కి తరలి వెళ్ళారు.
ఆమె చదువుకు స్వస్తి చెప్పి, పనిలో చేరింది.
స్త్రీల కోసం “ రియో డిసైనింగ్ హాట్స్ షాపులో ఉద్యోగిని.
అక్కడ– రద్దీలో, వేచి ఉన్న కస్టమర్లకు బోరు కొట్టకుండా ఉండేటందుకై
పాటలు పాడుతూ వినోదాలు పంచేది.
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

Shop కు వచ్చే కొనుగోలుదారులు ఒక పార్టీలో ఆమెకు పాట పాడటానికి
ఇచ్చిన అవకాశమే ఆమె జీవితమును మేలైన మలుపును త్రిప్పింది.

అత్యంత వేగంగా అంచెలు అంచెలుగా
గానము,డ్యాన్సులు,,స్టేజీ కార్యక్రమాలు,
రేడియో పోగ్రాములు , ఆమెను వెదుక్కుని రాసాగాయి.

ప్రత్యేకించి, ఆహార్యము, అలంకరణలు “ కేరమిన్” వొగా ప్రసిద్ధి కెక్కాయి.
డ్రస్సులు, ఆభరణములు, ఆమె ప్రతి కదలిక – కళా రంగము నుండి
సమాజములోనికి వ్యాపించాయి.

ముఖ్యంగా, ఆమె డిసైన్ చేసుకున్న “ టోపీ”
విపరీతంగా ఆకర్షించింది.
తలపాగా, కుచ్చు టోపీ, సర్కస్ బఫూనరీ టోపీ ల మాదిరిగా
అలరించినది –[ వి.]
టుట్టీ – ఫ్రూట్టీ హ్యాట్సు” అనే పేరు వాటికి వచ్చింది.
turban-hats ద్రాక్ష గుత్తులు, బత్తాయిలు, ఆపిల్సు, పైన్ ఆపిల్సు,వంటి పళ్ళతో -
కలర్ ఫుల్ గా అమరించేది.
ముదురు పసుపు రంగు (bright yellow bananas ) అరటి పళ్ళు
వాటికి అదనంగా చేకూరిన సొగసులు,
ఫ్యాషన్ ప్రపంచములో, టోపీలకు ప్రత్యేక స్థానాన్ని సముపార్జించి పెట్టాయి.

ఈ కదళీ ఫలాల కథాకళీ ఘనతను ఏమని వర్ణించ గలము!!!!?
1955 లో “`Carmen Miranda, Bananas Is My Business.' అనీ,
ఏకంగా డాక్యుమెంటరీ చిత్రమే నిర్మించ బడింది.
న్యూయార్కు, బ్రాడ్ వే లో ఆమె పేరు మార్మ్రోగింది.

1940 లో, తన తొలి సినిమా `Down Argentine Way' ( debut ) తో,
కీర్తి బావుటా ఎగుర వేసింది.

`Mamãe eu Quero... ,'
వగైరా పాటలూ, చిత్రాలూ సంగీత, నాట్య, నటనా రంగాల చరిత్రలో
ఆమె యశస్సును చిర స్థాయిగా నెలకొల్పాయి.

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

అన్నట్లు మీకందరికీ, ఈ సరికే గుర్తుకు వచ్చి ఉండాలి కదా!!!!

అదేనండీ, శ్రీ దేవి “హవా హవాయీ.” గా రంగ ప్రవేశం .......
సారీ! తెర ప్రవేశం చేసింది కదా,

ఆ!......... అదేనండీ .........
అనిల్ కపూర్ హీరో గా వేసిన మూవీ
“ MR. India” .!!!!!!!

ఈ movieలో శ్రీ దేవి ధరించిన టోపీ, దానికి తగిలించుకున్న పళ్ళూ,
ఫలహారంలాగా మెక్కుతూ, వస్తుంది .........
ఓ.కే. !!!!!!!!
మనం ఇప్పుడు “ టూటీ ఫ్రీటీ హాట్ / కాప్ “ అనీ పిలుద్దామా???

!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

Pramukhula Haasyam


By kadambari piduri, May 14 2010 9:16AM

1, జూన్ 2010, మంగళవారం

"వల్లతోళ్”“ మలయాళమహా కవి

"వల్లతోళ్” అనే నామ ధేయముతో సుప్రసిద్ధుడైన “మహా కవి

అసలు పేరు నారాయణ మీనన్ (16-10-1878 - 18-8-1957).
మలయాళీ కవితా సారస్వతానికి మేలి మలుపు నొసగిన కవివరేణ్యుడు.

చెన్నర– అనే గ్రామములో(16-10-1878) జన్మించెను.

కుమారన్ ఆశాన్, వల్లతోళ్ నారాయణ మీనన్, ఉళ్ళూర్ పరమేశ్వర అయ్యర్ –
ఈ కవి త్రయము మేధా సంపత్తి, కల్పనా నైపుణ్యత,
సమాజము పట్ల అవగాహనా స్పందనలు ,
మాతృ భాష పట్ల ఎన లేని మమకారములతో
కదిలించిన కలములతో,
కేరళ సాహితీ ప్రపంచము ఆధునిక యుగములోనికి ముందడుగు వేసింది.
=======================================

ఈ ముగ్గురిలో ఒకరైన వల్లతోళ్ ,కవియే కాదు, సంఘ సంస్కర్త కూడా.
మహాత్మా గాంధీజీ అంటే ఆతనికి అమిత ఇష్టము.
గాంధీ భక్తునిగా , సంఘములోని మూఢ నమ్మకాలను తొలగించడానికై,
శ్రమ దమాదులను లెక్క చేయకుండా, నిర్భయంగా ముందుకు సాగాడు.
ఆ నాటి సమాజాన్ని ధైర్య స్థైర్యాలతో సంస్కరించే ప్రయత్నాలలో సఫలీకృతులైనారు;
కథాకళీ నాట్యాన్ని సనాతన వాదుల నుండి అట్టడుగు వర్గాల వారికి,
నిమ్న కులస్థులకు అందుబాటులోనికి తెచ్చిన గొప్ప సంఘ సంస్కర్త.


==========================================

1910 లో వల్లతోళ్ జీవితంలో ఒక సంఘటన తటస్థ పడింది.
సాఫీగా సాగి పోతూన్న ఆతని బ్రతుకు బండికి ఒక్క సారిగా కుదుపులకు లోనైనది.
తిరుచూరులో నివసిస్తూన్న రోజులు అవి. ఒక రోజు అతడికి బాగా పడిశము పట్టింది.
జలుబు కారణముగా అతని చెవులు దిబ్బిళ్ళు అయ్యాయి.
ఉన్నట్టుండి చెవుడు వచ్చింది. ఈ హఠాత్పరిణామముతో వల్లతోళ్ కి గంగ వెర్రులెత్తినట్లైనది.
అనేక మంది వైద్య శిఖా మణుల వద్దకు వెళ్ళాడు.
ఆ నిస్సహాయ స్థితిలో జ్యోతిష్యులను “ తన ఆరోగ్యము యొక్క భవిష్యత్తు”ను గురించి అడిగే వాడు.
భగవంతునితో మొర పెట్టు కున్నాడు;
అనేక పద్య పుష్పములతో దేవుళ్ళకు విన్నపములు చేసాడు;
కానీ
ప్చ్!!!!!!!!!........... నిష్ఫల ప్రయత్నములే అయ్యాయి.

ఐతే ..........
ఈ విపరిణామము ,
మలయాళ ఆధునిక సాహిత్యమునందు
ఒక అద్భుత కవితా గుచ్ఛమును చేర్చేసింది;
అదే “ బధిర విలాపం”.
భారతీయ సాహిటీ లోకమునకు “ బధిర విలాపం” అనే ఆత్మాశ్రయ కావ్యము లభించినది.
==========================================
మన ఆంధ్ర దేశములో కూడా ,తెలుగు భాషా సారస్వత జగత్తులో ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది.
“ దేవుల పల్లి కృష్ణ శాస్త్రి గారు, throat operation వలన స్వర పేటిక తీసి వేయ బడినది;
మూగ వాడైనందున ఆ భావ కవి పడిన వేదన అంతా ఇంతా కాదు;

“శిధిలాలయమ్ములో
శివుడు లేడోయీ .”
ఇత్యాదిగా పఠితల మనసులను కదిలించే కవితలు
ఆయన హృదయాంతర్భాగాల నుండి వెలువడినాయి.

( English poet అయిన milton చూపు కోల్పోయిన తర్వాత ,
మహా కావ్యాలను వెలువరించాడు.
మిల్టన్ మహా కవి “On His Blind” సంవేదనా భరితమైన ఆతని హృదయానికి నిలువుటద్దము,
కనుకనే మిల్టను రచనలు
ఆంగ్ల సాహిత్యానికి అపురూప కానుకలు ఐనాయి. )
=====================================
"బధిర విలాపము " (A Deaf Man's Lament )
వళ్ళతోళ్ మనో బాధను కళ్ళకు కట్టినట్లు ఉంటుంది.
తన " బధిర విలాపము " లో ఇలాగ అనుకుంటాడు ;

“ ఈ భీకరమైన అవస్థ, వినికిడి లేదు,
ఈ చెవుడు రేపు తొలి ప్రొద్దుకే తగ్గుతుంది కదా!’
అని అనుకుంటూ, రాత్రి హాయిగా నిద్ర పోయాను;
ఉదయం వచ్చేసింది;
కానీ నిరాశ మాత్రమే మిగిలింది.............”

ఈ రీతిగా సాగింది ఆ కవిత .
ఇంకా అంటాడు కదా.........

“ సాటి కవులను కలిసి నప్పుడు
వారు కవితలు చదివినప్పుడు;
చెవిని చేరక, అందలి భావమేదో అరయ నేరక ;
మనసు విల విల లాడినది!”..........

ఏది ఏమైనప్పటికీ, మలయాళములోని
ఆత్మాశ్రయ కవితా సరస్వతి పట్టు చీరకు -
జిలుగు అంచుగా ఈ “ బధిర విలాపం” చేకూరింది .

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...