చిన్ని నాతల్లి సిరి మల్లె
చిరు నవ్వు ముత్యాల ముగ్గు లేసేను
కను చూపు కిరణాల వెలుగు పఱచేను
చిలిపి చేతల తోటి సిరులు నింపేను
అందాల పాపకు ఎవఱమ్మ "పల్లవి"?
"రామాయణము"పాడు "కుశ లవులె పల్లవి!"
చిన్నారి పాపకు ఎవరమ్మ తోడు?
"సింహంతొ ఆడేటి భరతుడేనమ్మా!"
పొన్నారి పాపకు ఎవరమ్మ జోడు?
"కొండను ఎతిన శ్రీ బాల కృష్ణుడు!"
చదువుల తల్లికి ,
మా బాల పాపాయిలకు ఎవరు ఆదర్శం?
రాట్నమును త్రిప్పేటి గాంధి తాతయ్య!"
1 కామెంట్:
చాలా బాగుంది.. :)
కామెంట్‌ను పోస్ట్ చేయండి