2, జనవరి 2018, మంగళవారం

చారుదత్తునిపై ఆరోపణలకు ఋజువులు

లేఖక్ 1 ;- న్యాయశాలకు అందరూ వచ్చారు. ధర్మాధిపతి, ధర్మాసనంలో ఉపవిష్ఠులైనారు. 
న్యాయ హెచ్చరికల ఉద్యోగులు - ఆరుగురు వచ్చారు.
లేకక్ - 2 ;- శ్రేష్ఠి, కాయస్థులు, విషయ లేఖకులం మనము, 
నేర అభియోగదారులు, ఇంతమందితో - మన అధికరణ మండపము నిత్య కోలాహలము.
శోధనకుడు ;- శోధనకుడు ఎలుగెత్తి చెబుతున్నాడు - నిశ్శబ్దం, నిశ్శబ్దం ;
న్యాయాధిపతి ;- ఈ రోజు ఏ కక్షిదారుల అంశములు - పరిశీలన చేయవలెను!?
శోధనకుడు ;- వారం దినముల నుండి నడుస్తున్నది వీరక, చందనకుల తగాదా
అంతే గాక, రాజ బంధు శకారుల వ్యాజ్యం అనివార్యం. 
శ్రేష్ఠి ;-  కాయస్థుల వారూ! శకారుడు - అడుగు పెట్టాడంటే - ఎవరికో మూడిందన్న మాట.
కాయస్థులు ;- ఎందరో మంచివాళ్ళను, నిర్దోషులను శిక్షల పాలు చేసాడు, ఈ శకారుడు. 
శోధనకుడు ;- శోధనక్ ఉవాచ, నిశ్శబ్దం, నిశ్శబ్దం. 
అమ్మా, వసంతసేన తల్లిగారూ, మీకు పిలుపు వచ్చేదాకా - ఇటు పక్కన కూర్చోండి.
న్యాయాధిపతి  ;- అధికరణ మండపంలో కొత్త వ్యక్తి, తమరెవరు?
చారు ;- చారుదత్తుడు మమ నామధేయం.
న్యాయాధిపతి ;- [లేచి నిలబడి] తమకు నమస్సులు. 
దానధర్మములకు మారు పేరు - నేడు మీ ప్రత్యక్ష దర్శన భాగ్యం లభించింది, ధన్యుడినై తిని.
[ గదిలో అందరూ నిలబడి - నమస్కరించారు ]
శకార ;- ఇతనికి బహు మర్యాదలు చేస్తున్నారే - ఇతగాడే నేరస్థుడు, 
ఈతనికి అనుకూలంగా తీర్పును ముందే నిశ్చయించుకున్నారు కదూ.
కాయస్థు ;- పొరబాటు, న్యాయ పరిశీలకులం - ఐదుగురం - 
నిశితం మా దృష్టి - నిష్పక్షపాతం మా తీర్పు.
శకార ;- కళ్ళకు కట్టినట్లు - కనబడుతూనే ఉన్నది [ హుంకరించి, కూర్చున్నాడు]
చారు ;- కొత్త వ్యాపారం కోసం - పనుల మీద - పాటలీపుత్రం వెళ్ళాను. వారం తర్వాత వచ్చాను.
నా ఇంటికి వచ్చాను. నా భార్య ధూత, నా కుమారుడు రోహణుడు - 
ప్రహరీ ద్వారం వద్దకు వచ్చి. సంతోషంగా నన్ను పలకరిస్తున్నారు. 
ఇంతలో అదాటున రాజ భటులు నన్ను ఇక్కడికి తీసుకు వచ్చారు. 
ఏ వివరములు చెప్పకుండానే తెచ్చారు నన్ను ;
న్యాయ ;- క్షంతవ్యులం, మేము నిమిత్తమాత్రులం. 
శకారుల అభియోగం మీరు వసంతసేన అనే వేశ్యను - హత్య చేసారని.
చారు ;- క్రిష్ణ క్రిష్ణా! అంత అభాండం నా మీదనా!?
శకారుడు ;- ముమ్మాటికీ నిజం. సాక్షులను తెచ్చుకున్నాను. 
ఈ వీరకుడు, చందనకులు - నీ శకటంలో శివార్ల తోటకు వచ్చింది - వీరు చూసారు.
చందనకు ;- ఔను, లోపలికి తొంగి చూడ లేదు, గానీ - ఆర్యకుని కోసం గాలిస్తున్నాము - వీరి బండి - 
సారధి - లోపల వసంతసేన ఉన్నారని చెప్పాడు.
వీరక్ ;- ఈ చందనకుడు చారుదత్తుని పేరు వినగానే వదిలేసాడు, దక్షిణాది మ్లేచ్ఛుడు ....
చందనక్ ;- చూస్తునారు కదా అందరూ, వదరుబోతు తనం ఇక్కడ ఎవరిదో ....
చారుదత్ ;- ఆ రోజు ఆమెను తీసుకురావడానికి - నా బండిని పంపాను. 
కానీ ఆమె రాలేదు, వేరొకరు ఉన్నారు.
న్యాయ ;- ఆమె ఎవరు?
చారుదత్ ;- ఆమె కాదు, అతను - [తటపటాయిస్తూ] ఆర్యకుడు ....
శకార్ ;- ఐతే ఇద్దరిని, వసంత - ఆర్యకునికి కల్పించావన్న మాట 'శకట భద్రత'
ఐతే ఇతగాడు రాజద్రోహి కూడా - తక్షణమే శిక్షించండి, 
చారుదత్ ;- శివ శివా, 
భటులు ;- నగల మూటతో పట్టుకున్నాము, ఇతని పేరు మైత్రేయుడు.
మైత్రేయుడు ;- చారుదత్త స్వామీ - మీరు ఇక్కడ ఉన్నారెందుకు? 
వసంతమ్మ ఆభరణాలను ఆమెకు తిరిగి ఇవ్వమని మీరు ఇచ్చినవి. 
వసంత సేన గృహమునకు - నగలను ఇవ్వడానికి - 
నేను వెళుతుండగా - మార్గ మధ్యంలో భటులు అటకాయించారు, 
నిష్కారణంగా పట్టుకున్నారు.
న్యాయ ;- శకారా, వసంతసేన తల్లిని పిలిపించాము.
ఆమె వచ్చింది. అమ్మా, ఈ నగలు మీ కుమార్తెవేనా?
తల్లి ;- వీరకుడు తోటలో కుమార్తె దేహాన్ని చూపించాడు. దుఃఖంలో మునిగిపోయాను. 
ఆ ... ఇవి నా వసంత సేనవే. 
న్యాయ ;- ఐతే శకారుని ప్రకారం, నీ తనూజ హత్య - 
చారు దత్తుడు చేసాడని మీరు అనుకుంటున్నారా?
తల్లి ;- మునుపు నా వసంత ఇతని వద్ద తన నగలను దాచింది. 
శకారునికి భయపడిన కారణాన ఆమె పారిపోతూ - 
చారుదత్తుని ఇంట్లో ఆభరణాలను దాచింది. 
కానీ వారి ఇంట దొంగ పడి, వసంత ఆభరణాలను దొంగిలించాడు. 
ఐతే ఆ చోరుడు,  అనుకోకుండా  దోచిన సొత్తును - తిరిగి మా వద్దకు తెచ్చాడు. 
న్యాయ ;- ఐతే నగలు పోగొట్టిన చారుదత్తులు చర్య?
తల్లి ;- అవకతవక పనుల మైత్రేయుడు ఇతనే, ఆ రోజు మా ఇంటికి వచ్చాడు - 
చారుదత్తుల భార్య ధూతమ్మ. ఆమె తన ఒంటి మీద నగలను వలిచి ఇచ్చారట. 
భార్యా భర్తలు ఇద్దరూ నిజాయితీపరులు. 
ఇంటి మర్యాద కాపాడుకోవడం కోసం సర్వం ఇచ్చే త్యాగధనులు. 
చాలా ఎక్కువ విలువనే మింజు - మింజుధనం గా మాకు అప్పజెప్పిన 
త్యాగమూర్తులు ఇద్దరున్నూ.  [= మింజు శుల్కం ]  ;   
శకార ;- దేశంలోని వజ్ర వైఢూర్యాలన్నీ మీ ఇళ్ళలోనే ఉంటాయి. 
ఈ సారి - వేశ్యా వర్గాలకు కొత్త పన్నులను విధిస్తాం. 
మా బావకు మంచి రాబడి, నవ్య సుంకం.
న్యాయ ;- శకటంలో వసంతసేన ప్రయాణం, ఈ నగలు, తోటలో స్త్రీ దేహం, 
అన్ని మీకు వ్యతిరేకంగా సాక్ష్యీభూతాలై నిలిచాయి - 
ఆర్యా, మమ్మల్ని క్షమిచు. ఇతనికి అంత్య శిక్షను విధించుట 
జరిగినది. భటులారా, ఎల్లుండి శిక్ష అమలు వరకూ, చెరసాలలో చారుదత్తుల వారిని ఉంచండి. 
తల్లి ;- చారుదత్త దేవా, మిమ్మల్ని ప్రధమంగా చూస్తున్నాను. 
ఇంత అద్భుత సౌందర్య, సౌజన్య మూర్తిని, ఉదారవర్తనుని 
నా వసంతసేన ప్రేమించి, ధన్యురాలైనది. 
చారు ;- నేను నిర్దోషిని అమ్మా.
తల్లి ;- మీరు క్రూర హంతకులంటే - అంగుళిమాలుడు సైతం నమ్మడు. 
సమయం ఇంకా ఉన్నది కదా, మిమ్మల్ని రక్షించే ప్రయత్నాలను విరమించము. 
మైత్రేయా, త్వరగా నడవండి, ముందు ధూతమ్మను సముదాయించి, కర్తవ్యం ఆలోచిద్దాం.
మైత్రేయ ;- ఆర్యకుని సహాయం అన్వేషిద్దామ్మా?
తల్లి ;- అదే ప్రయత్నం, నీ నోట్లో 'నువ్వుగింజ' నానదు కదా, మౌనం విభూషణం. 
;
*************************; ;
అధ్యాయ శాఖ ;- 30 ;-  చారుదత్తునిపై ఆరోపణలకు ఋజువులు  ;
previos posts ;- అధ్యాయ శాఖ ;- 29 - ఆమెకు బుద్ధ పరిరక్షణ ;
30, డిసెంబర్ 2017, శనివారం ; ఆమెకు బుద్ధ పరిరక్షణ ;-
;

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...