2, జనవరి 2018, మంగళవారం

జయ జయ జయహో

[ బౌద్ధారామము ]  ;-
వసంతసేన ;- లేఖకులు పరుగెత్తుతూ వస్తున్నారు.
లేఖక్ 1 ;- అమ్మా వసంతసేనా! వైద్య సేవిక వలన కాకతాళీయంగా మాకు తెలిసింది, 
మీరు ఇక్కడ ఉన్నారని. స్వామీ, మీరే ఆపద్బాంధవులు.
 లేఖక్  2;- చారుదత్తులను శివారు బండ వద్దకు భటులు తీసుకెళ్తున్నారు. 
దారిలో అన్నీ చెబుతాము, వేగిరం రండి.
లేఖక్  1 ;- మీ జననికి, మైత్రేయులకు కబురు పంపాము. 
ధూతా దేవి అగ్నిప్రవేశం ప్రయత్నం నుండి విరమింప జేయడానికి.
వసంత ;- శివారు బండ ఏమిటి, ఎవరికి నిర్దాక్షిణ్య శిక్షను అమలు చేస్తున్నారు?
లేఖక్  2 ; - ఆర్య చారుదత్తులకు .......... 
బౌద్ధ ;-  దారిలో బండి దొరికితే మీరు ఎక్కవచ్చును.
వసంత ;- అయ్యయ్యో - బండి వద్దులెండి, త్వరగా .................
బౌద్ధ ;- కొండ దిగువన వెలుగు .... 
వసంత ;- బాల రోహణుని కంఠ ధ్వని అది, ఏడుస్తు న్నాడు. .... 
అడుగో  - నాయనా, రోహణా!
ధూతా ;- వసంతసేన .... కల కాదు కదా
వసంత సేన యొక్క తల్లి ;- నా బంగారు తల్లి, నా భాగ్య రాశీ, 
నువు జీవించి ఉన్నావా, ముందు మీరు ఆ కొండ కొమ్ముకు సత్వరం చేరండి. 
ధూతాంబా, ఈ అగ్గి మీద వాన కురవనీ ; 
ఎందరు చెప్పినా మిమ్మల్ని ప్రాయోప వేశం నుండి విరమింప జేయ లేక పోయారు. 
ఆ భగవంతుడే మిమ్మల్ని, 
మీ  ..... కుమారుని కాపాడాడు. మైత్రేయా ........ ఏడీ? 
[ నవ్వి] పరుగు పోటీలో ప్రధమస్థుడు. 
''''''''''''''''''''';
వసంత ;- ఆగండి, ఆ కత్తుల్ని దించండి. నేనే వసంత సేనను.
శకార్ ;- వసంత సేన పిశాచి - దయ్యం - హమ్మయ్యో.
వసంత సేన ;- నోరు ముయ్యి. నీచుడు ఇతను. 
ఈ శకారుడే నా గొంతు నులిమి, చంపబోయాడు.  
బౌద్ధ సంవాకుడు నన్ను రక్షించాడు. [ప్రజలు శకారుని కొట్టసాగారు] ;
చారుదత్తు ;- నాకు సుదినం. వసంత సేన ఆగమనం 
నన్ను జీవితాన్ని ప్రసాదించింది.
ధూతాంబ ;- వసంత సేన రాక, నాకు దేవుని అనుగ్రహం. 

నా పూజాఫలం - నాకు ఆమె వరమొసగిన నిండు బ్రతుకు. 
లేఖకుడు ;- అదిగో కొత్త జెండా;
వసంత సేన ;- నవ్య పతాకం రెపరెపలాడుతున్నది.
తల్లి ;- చారుదత్తులు భార్యా పిల్లలను కలిసారు. 
వసంత సేనా, ఇక మన గూటికి మన వెళ్దామా!?
ధూత ;- వసంత సేనా, నాకు మాంగల్యభాగ్యం - ప్రసాదించిన దేవత నీవు. నాదొక విన్నపం. 
నాకు సోదరివి ఔతావా!?
వసంత సేన ;- అంటే? ...
ధూత ;- నా భర్తను వివాహం చేసుకొనమని నాఅభ్యర్ధన.
తల్లి ;- మహద్ భాగ్యం ఇస్తుంటే కాదనే వెఱ్ఱివాళ్ళు లోకంలో ఉండరు. 
నా కుమార్తెకు కులకాంత గౌరవ స్థానం - ఆనంద భాష్పాలు నిండుతున్నవి 
నా కళ్ళల్లోనూ, నా గుండెల్లోనూ ..... ;
ధూతాంబ ;- రోహణా, ఇక నుండి ఈమె నీకు పిన్ని కాదు, 
అమ్మ - అమ్మా అని పిలువు.
రోహణ్ ;-  కొత్త అమ్మా! [ అందరూ నవ్వారు]
ఆర్యక్ ;- చారుదత్తా, సత్యమేవ జయతే.
చారు ;- దైవం అందరినీ కాపాడింది.ధర్మం జయం.
 మైత్రేయ ;- సాహసివి ఆర్యకా, నీ పరివారం అగణితంగా కనిపిస్తున్నారు.
ఆర్య ;- ధర్మ పరిరక్షణకై అవిశ్రాంతంగా పరిశ్రమించిన ఎల్లరికీ సుస్వాగతం. 
చారుదత్తా, విపత్తుకు వెరవక నన్ను - ఆనాడు కాపాడారు. 
మీరు నాకు ముఖ్య సలహాదారులు.
చారు ;- వీరందరిని - వారి వారి వర్గాలకు - అధిపతులుగా 
నియమించుట సమంజసం కదా.
ఆర్యక్ ;- అవశ్యం, మీ యోచనను అమలు చేస్తున్నాము.
రదనిక ;- ఇదిగో మంగళసూత్రం.  
ప్రజలందరి ఆశీస్సుల తొలకరి జల్లులు కురిపించండి.
బౌద్ధ పరివ్రాజక ;- నేదు నవ శకానికి నాంది. 
నవీన పరిణామాలకు సుముహూర్తం. 
రోహణుడు ;- జయహో జయ జయ జయహో .......... .
;

*************** ; 
అధ్యాయ శాఖ ;- 31 ;- జయ జయ జయహో ; 2, జనవరి 2018, మంగళవారం ;
previos posts ;- అధ్యాయ శాఖ ;- 30 A ;-  తాటాకుల కవిలె కట్ట సేకరణ ;;
అధ్యాయ శాఖ ;- 30 B ;-  చారుదత్తునిపై ఆరోపణలకు ఋజువులు  ;   

                           2, జనవరి 2018, మంగళవారం ;

1 కామెంట్‌:

sam చెప్పారు...

dear sir very good and very good telugu articles

Latest Telugu News

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...