29, జనవరి 2012, ఆదివారం

మైకంలో దాసరి పాట
దాసరి వాళ్ళకు “పాటలు” అంటే ప్రాణం. తంబూరా మీటుతూ, 
ప్రతి గడపకూ తమ గాన మాధుర్యాలను పంచిపెడ్తూంటారు. 
దాసరులకు తంబూరా ప్రాణ సమానం.
ఒక ఊళ్ళో దాసరివాడు ఇల్లిల్లూ తిరిగి, 
పాటలు పాడుతూ బిక్షాటనం చేసాడు. 
"తిరిపెం ఎత్తే పని" పూర్తి ఐన తర్వాత 
ఆ దాసరి ఊరి శివార్లలో కల్లుదుకాణానికి వెళ్ళాడు. 
ఆ అంగడిలో కల్లు తాగేశాడు. 
ఇక గృహోన్ముఖుడైనాడు దాసరి. 
ఇంటిముఖం పట్టిన దాసరి, తాగుడు మత్తు ఎక్కువై, 
ముందుకు సాగలేకపోయాడు. 


"మైకంలో ఉన్నాను, మన్నించాలి, 
 నా మాటలు చేతలు మన్నించాలి........"


అనుకుంటూ చిన్న దిబ్బ మీద చతికిలబడ్డాడు. 
ఆ గుట్టపైన “ఊడుగచెట్టు”ఉన్నది. 
ఆ చెట్టు వేళ్ళు “ఉడుము ఆకారము”లో ఉంటాయి. 
ఊడుగ తరు మూలము అక్కడ ఉన్న బండ సందులోనుండి పాకిపోయాయి. 
కల్లు నిషాలో ఉన్న మన దాసరి 
“ఉడుమును పట్టుకుని, కొట్టేస్తున్నాను” అనుకుంటూ, 
తన చేతిలో ఉన్న తంబురాతో ఠపీమని దెబ్బ వేసాడు.
ఇంకేముంది? తంబూరా కాస్తా ముక్కలుచెక్కలైంది.
“ఉడుము అనుకుంటినే, ఊడుగేరా! ఉట్టి ఊడుగేనురా!
తాంబూరా పోయెనురా తాటి మోరా!.....”
అంటూ కొత్త తత్వసారాన్ని మిళాయించిన 
గీతగానమును అందుకున్నాడు.


మోర్= మజ్జిగ, కల్లు (తమిళము); 
తెలంగాణాలోని వైష్ణవ సంప్రదాయము వారు
నిత్య జీవితంలో- కొన్ని పదాల వాడుక 
విభిన్నతను సంతరించుకున్నాయి.
అలాంటి వాటిలో “మోరు” అనే మాట ఉన్నది.
మోరు- అనేదానికి “కల్లు” అనే భావములో వ్యవహృతమౌతూన్నది.
అనగా “తాటిమోరు”= తాటికల్లు.


***********************************************;

"ఊడుగేరుడుమైనట్లు":- 


అనేది తెలంగాణాలో ప్రజాబాహుళ్యంలో ఉన్న సామెత.
ఈ జాతీయమునకు మూలము, 


ఊడుగ చెట్టు భ్రాంతి వలన దాసరివాడు చేసిన పొరపాటు, తప్పిదము.
ఊడుగచెట్ట్లు ముళ్ళ చెట్లు. బెరడు, 
పై పొట్టు ఉడుము రంగును కలిగి ఉంటాయి.
డుగు+వేరు+ఉడుము+ఐనట్లు
ఇదీ  ఆ తెలంగాణాము జాతీయము ఏర్పడడానికి 
మూల కథా కారణము.
;
లింక్స్ ఫర్ matters:- 

Date 2011/4/22 0:07:33 | Topic: AP News In Telugu
Bharat Waves.com 

వృక్షో రక్షతి రక్షితః , Daripalli Ramaiah 
కోణమానిని ; బుధవారం 19 జనవరి 2011 (Link 2)


అయస్కాంతము చెట్టు; " శివానంద లహరి"లోని 61, 
బుధవారం 27 అక్టోబర్ 2010 (Link 3)


కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...