2, డిసెంబర్ 2017, శనివారం

ఆర్యకుడు - ఎక్కడ!?

మార్గుడు ;- రేభిలా, ఓ రేభిల్లుడా!
రేభిల్ ;- మార్గా, మేము వెళ్తున్నాము.
తుందిలుడు ;- ఎక్కడికి?
రేభిల్ ;- పర దేశానికి తుందిలా.
మార్గుడు ;- ఏమిటీ - ఈ పురుటి గడ్డను, నీ మాతృ భూమిని వదిలిపెట్టి వెళుతున్నావా!? 
రేభిల్ల ;- పొట్ట చేత పట్టుకుని - వలస యాత్రలు
మనకు కొత్త కాదు కదా.
తుందిలుడు ;- ఆ మాట నిజమే అనుకో, మన పల్లెను వీడి - ఇక్కడ చేరాము, 
ఇప్పుడు వేరే దేశానికి ..... అంతే తేడా.
మార్గుడు ;- పరిపాలకులలో అలవి మాలిన స్వార్ధం పేరుకుపోయింది. 
శ్రీరామచంద్రుడు - గూఢచారులను పెట్టి, ప్రజల కష్ట సుఖాలను అరసేవాడు. 
తుందిల ;- మరే, శ్రీకృష్ణ దేవరాయలు, తిమ్మరుసు మంత్రితో కలిసి - 
మారు వేషాలలో రాజ్యంలో 
అందరి గురించి తెలుసుకుంటూండే వాళ్ళు.  
జనం, ప్రతి ఒక్కరి బ్రతుకు బండి గతుకులలో పడకుండా 
నడిచేటట్లు చూస్తూ, కాపాడే వారు.
మార్గుడు ;- రేభిల్లా, ఇప్పటి పరిస్థితులకు - ఇదే సరైనది అనిపిస్తున్నది.
కుశావతి ;- తుందిలా, మా అన్నతో వెళ్తున్నాము. 
వసంతసేనమ్మకు నా నమస్కారములను అందించు, సెలవు.
తుందిలుడు ;- మార్గయ్యా, కుశావతి, రేభిల్లుడు వెళ్ళి పోయారు. 
పాపం, ఆమె ప్రియుడు శర్విలకుడు ఎక్కడున్నాడో ఏమో.
మార్గ ;- ఎక్కడ ఉన్నా - క్షేమంగా ఉంటే చాలు, 
ఆ జంట మళ్ళీ ఒకటైతే మేలు, బాగుంటుంది. 
శకారుని అనుచరుడు - 'విటుడు' వస్తున్నాడు.
విటుడు ;- ఆర్యకుడు తుర్ర్  తుర్రుమని పారిపోయాడు.  
మార్గు ;- అతడు తప్పించుకున్నాడా!? ఆహా, శుభ వార్త.
తుందిల ;- ఔనా, విరటూ.
విటుడు ;- శకారుడు అతనిని వెతుకుతున్నాడు. 
మా యజమాని శకారుడి కంట పడకుండా - 
జాగ్రత్త పడండి. లేకుంటే - 
మిమ్మల్ని కూడా వేధిస్తాడు, మా పెత్తందారు.
మార్గ ;- ఆర్యకుడు ఎట్లాగ తప్పించుకో గలిగాడు విటుడా!
విటుడు ;- కొందరు కావలి భటులు - 
లోపాయికారీగా సహాయం చేసారు, ష్ ష్ ష్ - సద్దు, సద్దు!
శకారుడు ;- ఆర్యకుడు పారిపోయాడు. హ్హు, 
ఎంత దూరం తప్పించుకుంటాడు, తాషామరప్పా. 
వాడి కాళ్ళు చేతులకి - సంకెళ్ళు ఉన్నాయి, 
ఆ శృంఖలల  ధ్వని చాలు, వాణ్ణి పట్టిస్తాయి ......... 
విటూ, ఎక్కడున్నావు, 
సమయానికి కనపడవు.
విటు ;- చిత్తం, ఈ విరటుడు ఇక్కడే ఉన్నాడిదిగో స్వామీ!
శకారుడు ;- మన బండిని సిద్ధం చేయించమన్నాను - ఏదీ, మన శకటం!?
విరట ;- అదిగో, రానే వచ్చింది, మన బండి.
♣♣♣♣♣♣♣♣  ♣♣♣♣♣♣♣♣  ♣♣♣♣♣♣♣♣  ;
2, డిసెంబర్ 2017, శనివారం ; 
అధ్యాయ శాఖ ;- 21 ;- ఆర్యకుడు - ఎక్కడ!? ;
&
ఆషామాషీ కబుర్లు - పుష్పకరండకం తోట ;
డిసెంబర్ పోస్ట్ ; & ;- previous ;- అధ్యాయ శాఖ ;- 20 ;
 ♣♣♣♣♣♣♣♣  ♣♣♣♣♣♣♣♣  ♣♣♣♣♣♣♣♣  ;
తెలుగు బ్లాగుల సంకలిని ;-  http://www.maalika.org/   ; LINK ;
REF ;- బౌద్ధభిక్షువుగా మారిన సంవాహకుడు - LINK ;  ; 
తన కౌపీనాన్ని అక్కడి చెరువులో ఉతుక్కుంటున్నాడు ;
 ♣♣♣♣♣♣♣♣  

5 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

Thanks for your efforts in posting these masterpieces. You may want to remove reference of SriKrishna devaraya and Timmarasu in this conversation

Anil Piduri చెప్పారు...

thank u sir ;; kaanee - paripaalanalo - tedaalu untunnawi - kaabatte -
prajala asahanam - tirugubaatu - kadaa

అజ్ఞాత చెప్పారు...

Sir,
My comment was related to the timeline, SriKrishna devaraya and Timmarasu belongs to much later period and the conversation should not be referencing a later period king. Notwithstanding this, I enjoy reading your posts.

Anil Piduri చెప్పారు...

sir,
శూద్రకుడు - తన నాటకం - మృచ్ఛకటికమ్ -
నాటకములో ఆనాటి సంఘం స్వరూపం చిత్రీకరణ ముఖ్యంగా జరిగింది.
శూద్రకుడు - చరిత్ర వివరణకు పూనుకోలేదు.
అంటే - ఆ కోణంలో ఈ డ్రామాను చదివుతుంటే -
దీనిని అన్ని కాలాలకు - సమాజ దృశ్యీకరణకు ప్రతీకగా చదువరులు గ్రహించవచ్చును.
కనుక నేను కొంచెం స్వతంత్రం తీసుకున్నాను.
కొన్ని పాత్రల పేర్లు మార్చడం - కూడా జరిగింది.
దీనిని పూర్తి చేయగలిగితే -
నా రచన అన్వయ గమనాలను -
in ESSAY - విపులీకరిస్తాను.
మీరు తప్పకుండా మీ సలహాలను ఇవ్వండి,
నాకు మార్గదర్శకం ఔతాయి
=
SUdrakuDu - tana nATakam - mRcCakaTikamm -
nATakamulO aanaaTi samgham swaruupam citreekaraNa mukhyamgaa jarigimdi.
SuudrakuDu - caritra wiwaraNaku puunukOlEdu.
amTE - aa kONamlO ee Draamaanu cadiwutumTE -
deenini anni kaalaalaku - samaaja dRSyeekaraNaku prateekagaa caduwarulu grahimcawaccunu.
kanuka nEnu komcem swatamtram teesukunnaanu.
konni paatrala pErlu maarcaDam - kUDA jarigimdi.
deenini puurti cEyagaligitE -
naa racana anwaya gamanaalanu -
wipuleekaristaanu. meeru tappakumDA mee salahaalanu iwwamDi,
naaku maargadarSakam autaayi
thank u very much
;

అజ్ఞాత చెప్పారు...

Sir,
I got it now that you have taken some liberty in the dialogues and extended the play to different periods. I mistook your work as translation of original play.

In the middle of heap of routine content in the blogs and internet, posts of your kind draws us to read blogs and makes us feel happy that there are bloggers who put efforts to introduce masterpieces to the current generation. Please keep up the noble work. My appreciations.

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...