రోహణుడు ;- అమ్మా! అమ్మవస్తున్నది, నాన్నగారూ!
ధూతాదేవి ;- రోహణా, బాగా ఆడుకుంటున్నావుకదూ.
రదనికను ఇబ్బంది పెట్ట లేదు కదూ.
రోహణ ;- అమ్మా, ఇదిగో నా బండి.
ధూత ;- ఈ నగలు, ఇన్ని రత్నాభరణాలు, ఎక్కడివి?
రదనిక ;- అవీ, అవి, వాటిని ఆమె ఇచ్చారు. [లోనికి వేలు చూపిస్తూ అన్నది.]
ధూతామాంబ ;- ఆమె ఎవరు? అరె, వసంతసేన .....
వసంత సేన ;- నమస్కారం దేవీ!
ధూత ;- ఐతే నేను లేని లోటును నీవు తీర్చావన్న మాట.
వసంత సేన ;- [గాభరాగా] అబ్బే అదేమి కాదు.
మరి, సెలవు తీసుకుంటాను.
రదనిక ;- మన రోహణ బాబు - తోటి పిల్లలు ఏడిపిస్తుంటే,
బంగారం బొమ్మ బండి కొనుక్కోమని, సముదాయించారు,
తన నగలన్నీ వలిచి ఇచ్చారు.
వసంత సేన ;- మరి ......., ఇంక ...... సెలవు తీసుకుంటాను.
ధూత ;- నేను వచ్చాను, కాబట్టి - వెళుతున్నావా,
నాకైతే వెన్నెల మాయం ఔతున్నట్లు అనిపిస్తున్నది.
వసంత సేన ;- ఉదయ ప్రభాతం, సూర్యుడు రాగానే,
వెన్నెల మటుమాయం ఔతుంది కదా.
చారు దత్తుడు ;- వర్ధమానకా, ఈమెను ఆమె ఇంటి వద్ద, క్షేమంగా దిగవిడచి, రా.
వర్ధమానకుడు ;- అయ్యా, యజమానురాలు వచ్చారు, పండగ వస్తున్నది,
మన గూటి బండికి కొత్త వస్త్రాలు కప్పితే బాగుంటుంది.
ధూత ;- నా పుట్టినింటి వారు ఇచ్చారు ఆడ పడుచు లాంఛనం.
ఇవిగో, ఈ డబ్బులు తీసుకుని, పట్టు వస్త్రాన్ని కొను.
చిలకాకు పచ్చ రంగు వస్త్రాన్ని కొను వర్ధమానా.
మైత్రేయుడు ;- వీనికి ఏం తెలుసును వస్త్రాల నాణ్యత, నేనూ తోడు వెళ్తాను.
వర్ధమాన ;- ఈమె తల్లి వచ్చి ఉన్నారు. బైట వాకిలి వద్ద నిలబడింది,
రుస రుసలాడుతూ, అందరినీ తూర్పారబోస్తున్నది.
వసంత సేన ;- ధూతా దేవీ, నన్ను మన్నించండి, త్వరగా వెళ్ళాలి,
మా అమ్మ నాలికకు పదును ఎక్కువ, సెలవు.
[ ముగ్గురూ - నడిచారు.]
ధూత ;- రదనికా, నీళ్ళు బాగా తెర్లనీ. మరిగే నీళ్ళతో - ఇంట్లో అందరమూ,
తలంటు స్నానాలు చేద్దాము.
రదనిక ;- అది సరేగానీ, తమరికి, వసంతమ్మ మీద కోపం రాలేదు,
నాకైతే - మీ పోకడ చిత్రంగా అనిపిస్తున్నది.
ధూత ;- ఇందులో ఆశ్చర్యాలెందుకు, ఆమె నాట్య లావణ్యాలు -
ఈ నగరంలోనే కాదు - లోక ప్రసిద్ధి. మా పుట్టింటి ఊరిలో కూడా -
ఈమెను గూర్చి మాట్లాడుకున్నారు - పొగుడుతూ.
అంత సౌందర్య రాశి రాక, మా గృహ శోభను ఇనుమడింప జేసింది.
చారు ;- నీ వంటి భార్య లభించడం, నా పూర్వ పుణ్య సుకృతం.
రోహణా, వచ్చే పౌర్ణమి - మనకు కొత్త వెలుగు.
రదనిక ;- ధూతమ్మ లాంటి ఇల్లాళ్ళు ఉన్నప్పుడు,
మగవారికి నిత్య పున్నములే,
అమ్మా, వస్తున్నాను ఉండండి.
పొయ్యిలో పొట్టు కూరి, నీళ్ళ గాగు పెడ్తాను.
[ధూతను అనుసరిస్తూ, లోనికి వెళ్ళింది]
రోహణుడు ;- నాన్నారూ, మైత్రేయుడు వెళ్ళి పోయాడు.
నాకు మన చెట్టు జామకాయలు కోసి ఇవ్వరూ,
కొమ్మ మీద చిలక వాలి, దోర పళ్ళన్నీ తినేస్తున్నది.
;
;; ♣♣♣ ♣♣♣♣♣♣ ♣♣♣ ♣♣♣ ♣♣♣ ♣♣♣♣♣♣ ♣♣♣ ♣♣♣
] అధ్యాయ శాఖ ;- 23; డిసెంబర్ పోస్ట్ ; - గృహ శోభ, ఇంటి ఇల్లాలు ;
previous ;- 3, డిసెంబర్ 2017, ఆదివారం ;-
మట్టి బండి తళ తళా మిలా మిలా ;-
♣♣♣♣♣♣ ♣♣♣ ♣♣♣♣♣♣ ♣♣♣ ♣♣♣ ;;
బంగారుబండితో ఆడుకుంటావులే ; Link ;-
మా అమ్మ వంటి మీద నగలుండవు.
ఇన్ని నగలున్నావిడ మా అమ్మ ఎలా అవుతుంది?'' అన్నాడు
ఈ రత్నహారాన్ని తీసుకుని నువ్వు ఆవిడ వద్దకు వెళ్లి
చారుదత్తుని గుణాలకు లొంగిపోయిన
యీ దాసి ఆమెకు కానుకగా యిస్తోందని చెప్పి యిచ్చిరా' అంది వసంతసేన.
కాస్సేపటికి ఆమె తిరిగి వచ్చి
''ధూతాదేవి తీసుకోలేదు. 'నా భర్త నీకు యిచ్చిన హారాన్ని నేను తీసుకోకూడదు.
నా భర్తే నాకు వెలలేని ఆభరణం' అని చెప్పమంది.'' అని తెలిపింది. ......
అంతలో - రోహసేనుడు ఏడుస్తూ వచ్చాడు .........
♣♣♣♣♣♣ ♣♣♣ ♣♣♣♣♣♣ ♣♣♣ ♣♣♣ ;

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి