[ పాత్రలు ;- ఉజ్జయిని [sales girl] - దుకాణదారుడు &
విరటుడు - శకారుడు & మైత్రేయుడు ; వర్ధమానకుడు]
;
శకారుడు ;- విటూ! [on the road, walking]
విరటుడు ;- దొరా, సంస్థానకా!
శకారుడు ;- నన్ను రోజుకో కొత్త పేరు పెట్టి పిలుస్తున్నావేమి?
విరట ;- చిత్తం, నా అసలు పేరుని నేనే మర్చిపోయాను గదండీ .....
శకారుడు ;- ఓహో, నిన్ను విరటుడు - అని సంబోధన చేయలేదని అన్న మాట ......
నాతో చతురులాడుతున్నావూ .....
విరటుడు ; ఎంత మాట - మీతోనే హాస్యాలు, ఇదిగోండయ్యా,
చెంపలేసుకుంటున్నాను, లెంపలేసుకుంటున్నాను ...
శకారుడు ; అది సరే గానీ - ప్రతి రోజు - వసంతసేన - కోవెలలో "నిత్య నాట్యం" చేస్తుంటుంది కదా.
విరటుడు ;- ఔను, అది వారి కట్టుబాటు, సంప్రదాయాలు
శకారుడు ; వేశ్యగా పుట్టింది, కానీ కులవృత్తిని చేయట్లేదే,
....... మన బోటి రసికుల గతి - పస్తులేనా
విరటుడు ; మన - అనకండి, మీరు మాత్రమే - అడ్డు ఆపూ లేని రసిక శిఖా మణులు.
ఆ సుగుణవతి, లావణ్యాల రాశి మీద మీ కన్ను పడింది,
- [ విరటుడు - లో లోపల చిన్నగా నసుగుతూ] ఆమె ఖర్మ.
శకారుడు ; ఏమిటి, నీలో నువ్వే ఎదో గొణుగుతున్నావు?
విరటుడు ;- అహ, మీరు చెప్పినట్లు ........ సర్వం సత్యం.
శకారుడు ;- నేనేం చెప్పానూ ....... ఆ, వసంతసేన - నాట్యం చేయడానికి -
ప్రతి నిత్యం ఈ దారంటే వెళ్తూంటుంది కదా, ఈ మధ్య కనిపించడం లేదేమిటా అని.
విరటుడు ; అంగడి వీధికి రానే వచ్చాము. మన బండికి దుకూలం ఒకటి కొంటామని నిన్న చెప్పారు.
శకారుడు ;- మాట మారుస్తున్నావూ, సరే పద, ఈ దుకాణంలో చూద్దాము.
[ at the shop]
శకారుడు ;- మాకు కొత్త విపుల వస్తం చూపించు.
విక్రయదారుడు ; - మా దుకాణంలో అన్నీ కొత్తవే విక్రయిస్తాం.
శకారుడు ; ఇవాళ ప్రతి చోట నాతో హాస్యాలాడే వాళ్ళే ఎదురౌతున్నారు.
విటు ;- చప్పున మాకు చూపించు, చిలక పచ్చ వస్త్రములను.
విక్రయదారుడు ;- అదైతే ఒకటే ఉన్నదండి, ఇదిగో.
విరటుడు;- ధగధగ లాడుతూ, భేషుగ్గా ఉన్నది - ఈ పట్టు గుడ్డ. మడతపెట్టి, ఇవ్వు.
దుకాణదారుడు ;- ఇదిగోనండి. అయ్యా అయ్యా, దీని ఖరీదు రెండు వరహాలు.
విరటుడు ;- అమాయకుడా, మా దొరగారి నుండి - ఖరీదు ద్రవ్యాన్ని ఆశిస్తున్నావు.
నువ్వు ఊరికి కొత్త అనుకుంటాను. [వలువను పట్టుకుని, వెళ్లిపోయారు.]
షాపు వ్యక్తి ;- హూ, వెళ్ళిపోయారు, ఇంకా నయం, ఉన్నవి రెండే రెండు,
నిన్న చారుదత్తుల ఇంటి వాళ్ళు -
కబురు చేస్తే, తెప్పించాను - ఇవాళ ఇట్లాగైంది.
[అంగడి వద్దకు ఇద్దరు - మైత్రేయ, వర్ధమానక - వచ్చారు]
దుకాణదారుడు ;- ఉభయులకూ నూరేళ్ళాయుష్షు,
రండి రండి, దయ చేయండి. మైత్రేయా, వర్ధమానకా.
మైత్రేయుడు ;- మేము చెప్పిన వర్ణం ఇదే. ఇంత శ్రద్ధగా గుర్తు పెట్టుకుని, తెప్పించావు.
వర్ధమానకుడు ;- కనుకనే మీ అంగడి ఎప్పుడూ కిట కిట లాడుతుంటుంది.
దుకాణం యజమాని ;- వాస్తవానికి రెండు తెచ్చి ఉంచాము. కానీ ....
ఇప్పుడే ఒకరు దౌర్జన్యంగా - డబ్బులు ఇవ్వకుండా - తీసుకుని, వెళ్ళి పోయారు.
వర్ధమానకుడు ;- శకారుడే అయి ఉంటాడు.
దుకాణ ;- వర్ధమానకా! తమరు ఖచ్చితంగా పోల్చుకున్నారే.
వర్ధమానకుడు ;- అటువంటి తింగరి చేష్ఠలు - అతనికి మాత్రమే పరిమితం.
ఉజ్జయిని :- శకారుడు సన్యాసులను, పరివ్రాజకులను కుడా వదిలిపెట్టడు.
క్రితం నెల - పుష్పకరండకం వద్ద ఒక బౌద్ధ పరివ్రాజకుని - నిష్కారణంగా - కొట్టాడు.
వర్ధమానకుడు ;- అతను మన సంవాహకుడేమో, మైత్రేయా.
మైత్రేయుడు ;- నువ్వు చెబ్తుంటే, నాకూ అదే అనిపిస్తున్నది, వర్ధనా!
దుకాణదారుడు ;- ఉజ్జయినీ, ఈ పట్టు వస్త్రాన్ని మడతపెట్టి, వీరికి ఇవ్వు.
వర్ధమానకుడు ;- నువ్వు ఉజ్జయిని కదూ ; కుశావతి, రేభిల్లుడు - ఎక్కడ ఉన్నారు?
ఉజ్జయిని ;- మా అక్క, అన్నయ్య - ఇద్దరు - చెరొక వైపు.
అక్కయ్య కుశావతి - మా ఊరు చేరింది. మా అన్న రేభిల్లుని జాడ తెలీదు.
జానెడు పొట్ట కోసం - నన్ను పనిలో చేర్చారు, మా వాళ్ళు .
మైత్రేయుడు ;- ఔరా, మనమందరము - ఆ భగవానుని ఆటలో పావులమే.
ఉజ్జయిని ;- మరే, చదరంగంలో పావులము, పాచికలము.
;
♣♣♣ ♣♣♣♣♣♣ ♣♣♣ ♣♣♣ ♣♣♣ ♣♣♣♣♣♣ ♣♣♣ ♣♣♣
; అధ్యాయ శాఖ ;- 24 ; డిసెంబర్ పోస్ట్ ;-వస్త్ర ప్రపంచం, బోణీ బేరం ;
;& previous అధ్యాయ శాఖ ;- 23 ; -
గృహ శోభ, ఇంటి ఇల్లాలు ; 9, డిసెంబర్ 2017, శనివారం ;
♣♣♣ ♣♣♣♣♣♣ ♣♣♣ ♣♣♣ ♣♣♣ ♣♣♣♣♣♣ ♣♣♣ ♣♣♣
భాసో హాసః - = bhaasO haasa@h - ;[LINK] ;-
ఆంధ్రభూమి సాహితి ;- అది హాస్యం కాదు.. అవహేళన ;-
ప్రాచీన నాటకకర్తలలో స.శ.పూ.4వ శతాబ్దంలోని భాసుడు-
చారుదత్త నాటకంలో శకారుడు అనే పేరున్న రాజుగారి బావమరిది పాత్ర హాస్యాన్ని సృష్టించాడు.
బాధ్యత లేని అధికారం ఎంత అనర్థదాయకమో రచయిత లోకానికి తెలిపాడు.
రామాయణ, భారత కథలలోని పాత్రలను వరుసలు కలిపి మాట్లాడే ఆ మూర్ఖుడు,
అతడి అనుచరులు గొప్ప హాస్యం ప్రదర్శిస్తారు.
చిత్రమేమంటే శకారుడు ఈనాటికీ మనకు సమాజంలో ఎక్కడ చూచినా కనిపిస్తాడు.
ఈ పాత్ర సృష్టివలన ఖాసోహాసః- అనే నానుడి కూడా పుట్టింది.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి