22, డిసెంబర్ 2017, శుక్రవారం

సంకెళ్ళ చప్పుడు - గాజుల సవ్వడి

[ తప్పించుకున్న ఆర్యకుడు చారుదత్తుని బండిలో ఎక్కాడు.]
;
ఆర్యకుడు ;- ఈ గూటి బండి ఎవరిదో, గయునికి అర్జునుడి ఇచ్చిన అభయంలాగా - 
నాకు ఇక్కడ రక్షణ దొరికింది. ఈ చిలకాకుపచ్చ పట్టు వస్త్రం - 
నాకు కొంత మరుగుగా, మెరుగుగా ఆచ్ఛాదనం లభించింది.
మార్గుడు ;- వసంతసేనమ్మా, స్వస్థతగా కూర్చోండి. డుర్ డుర్, 
ఈ ఎడ్లు నాకు మాలిమి అయ్యేదెప్పటికో, 
వసంతమ్మ పెరటి గుమ్మం వద్ద నిలబెడితే - ఇవతలికి వచ్చేసాయి. 
మా అన్న వర్ధమానుని చేతిలో ఏమి కిటుకు ఉన్నదో గానీ - 
ఆయన గారు వీల వెయ్యగానే ఈ కాడెద్దులు బుద్ధిగా హుందాగా నడుస్తాయి. 
ఇప్పుడు చూడమ్మా, ఇవి అటూ ఇటూ దౌడు తీస్తున్నాయి. 
మీ నగలు, గాజుల చప్పుడు మహిమ కాబోలు ....
అక్కడ తోటలో - చారుదత్తుల వారు - ఈ సరికి వచ్చి ఉంటారు.

ఆర్యకుడు ;- ఇతను వర్ధమానుని తమ్ముడు మార్గుడు అన్న మాట. 
ఖుంటమోదం ఏనుగును ఉసిగొల్పి, దుర్గం గోడను భేదించాడు మిత్రుడు వర్ధమాన్. 

ఉజ్జయినిని అనుమానించి, రాజ భటులు ప్రశ్నిస్తున్నారట. 
కర్ణపూరకుని, శ్యాలకుని పంపించాను - 
ఉజ్జయినిని రహస్యంగా తీసుకుని వచ్చి, కాపాడడానికి. 
ఇందరు మిత్రులు తమ ప్రాణాలకు తెగించి, నాకు సాయం చేస్తున్నారు. 
ఏమిచ్చి ఋణం తీర్చుకోగలను?
['రోడ్డు'పైన ఇద్దరు] 
కన్యేశ్వరుడు ;- ఒహో బండి వాడా! కొంచెం మార్గం పై కన్నేసి ఉంచు. 
వాహనాన్ని అదుపులో ఉంచు. 
ఈ కన్యేశ్వరుడు, నిశుల్కుడు - మా ఇద్దరికి కన్ను లొట్ట పోయి ఉండేది .......
మార్గుడు ;- చిత్తం దేవరలారా! ఈ మార్గుని క్షమించండి. 
తమరు ఎక్కడికి వెడుతున్నారు?
కన్యేశ్వరుడు ;- న్యాయాధికారి ధర్మవరుని వద్దకు వెళుతున్నాము. 

మార్గ్ ;- నా బండిని ఎక్కమని అడిగేవాణ్ణి.
ఆర్యకుడు ;- దైవమా, శరణు, మార్గుని మాటను వారిద్దరు వినకూడదు గాక!
మార్గ ;- అయ్యా, మా యజమానిని ఇందులో ఎక్కి ఉన్నారు. 
వెనుక స్థావరకుని బండి వస్తున్నది. 
అది ఖాళీగానే ఉన్నది. 
నిశుల్క్ ;- అది శ్యాలకుని వాహనం కదూ.
మార్గుడు ;- మీరు న్యాయ శాఖ ఉద్యోగులు కనుక, 
మీకు అంతమాత్రం స్వతంత్రం ఉంటుంది. 
మిమ్మల్ని రాజా వారి బావమరిది ఏమీ అనరు లెండి.
కన్యేశ్వరుడు ;- మార్గా, మా నడక మాది. సత్వరమే వెళ్ళు. 
మార్గ్ ;- హమ్మయ్య, ధర్మోద్యోగులు శాంతంగా వెళ్ళారు. 
ఆర్యకుడు ;- పూల వాసన - ఉద్యానానికి వాచ్చేసాము కాబోలు, 
ఇప్పుడు తప్పించుకునే దారేదీ, చారుదత్తుడు నన్ను భటులకు అప్పగిస్తాడేమో ......
మైత్రేయుడు ;- మార్గా, ఇంత ఆలస్యమా, ఇక్కడ చారుదత్తులు, 
నేను వచ్చి, మూడు గంటల పద్ధెనిమిది విఘడియలు ఐనవి.
మార్గ ;- పజ్ఝెనిమిది విఘడియలైందా, కాలం కొలమానం మీకే తెలుసును స్వామీ. 
నిరక్షర కుక్షిని - నాకు పూర్తి అయోమయం.

మైత్ర్ ;- మార్గుడా, నువ్వు అన్నీ అట్లాగే చెబుతుంటావు. 
ఏమీ తెలీని వాడివే ఐనా - శకట గమనం, గమనిక - 
అంతా నీ అధీనంలోనే ఉంటాయి.
చారు ;- వసంతసేనా, ఇదిగో ముక్కాలి పీట - 
నెమ్మదిగా పాదం పెట్టి దిగుతావా .....  [
ఆ, ఎవరు నీవు? 

ఆర్యకుడు ;- నా నామం ఆర్యకుడు.
[అతని పేరు వినగానే ముగ్గురు భయ విహ్వలులైనారు.]
మార్గ ;- ఐతే నీ సంకెళ్ళ చప్పుడు - గాజుల సవ్వడి - అని నాకు అనిపించింది.
మైత్ర్ ;- కొంప మునిగింది. ఇతనిని కాపలాదారులకు అప్పజెబుదాం.
చారు ;- తప్పు, మిత్రమా. ఆపదలో ఉన్న వ్యక్తి, 
అందునా నిరపరాధి - కల్లోలంగా ఉన్న పరిస్థితుల గుండా ఇతని ప్రయాణం - 
ఈతనిని  కాపాడటం - భగవంతుడు మనకు ఇచ్చిన అవకాశం.
మైత్ర్ ;- కనుక ఈతని రక్షించుట మన తక్షణ కర్తవ్యం. 
నక్క తోకను తొక్కి వచ్చావయ్యా ఆర్యకా.
మార్గ్ ;- మరి ఇతని సంకెళ్ళ సంగతి!?? 
పొదల మాటున ఎవరో ఉన్నారు -
[బైటికి వచ్చి - అతను]
కర్ణపూరకు ;- కర్ణపూరకుడిని - ఆర్యకా, సంతోషం - 
చెరసాల వద్ద - అందరమూ విడి పోయాము. 
ఇదిగో, ఈమె ఉజ్జయిని
శ్యాలకా,  త్వరగా ఈ పదునైన రాళ్ళను ఉపయోగించుదాం. .... 
సంకెళ్ళు పగిలిపోయాయి. ఇంక స్వేచ్ఛ.
ఆర్యక ;- చారుదత్తా, దయ ఉమంచి - ఉజ్జయినికి రక్షణ కల్పించండి, 
మీ వంటి ఉదారులు, నీతిమంతుల ఆశ్రయంలో 
ఆమె సుస్థిరంగా, శాంతంగా మనగలదు.
చారు ;- ఆర్యకా! త్వరలో ఈమెను నీవు పరిణయం చేసుకుందువు గాని. 
ఉజ్జయినీ, నీకు సమ్మతమే కదా. 
మైత్రేయా, నీది వాక్ శుద్ధి కల జిహ్వ, ఆర్యకునికి నీ ఆశీస్సులు ఇవ్వు.

మార్గ్ ;- మైత్రేయుల దీవనలు - తొలకరి వానధారలు. 
మైత్ర్ ;- ఆర్యకా, దిగ్విజయ ప్రాప్తిరస్తు.
ఉజ్జయిని ;- తప్పకుండా - విజయం సాధిస్తావు ఆర్యా! 
జయం మనదే , విజయం మన అందరికీ.

ఆర్యక ;- కర్ణపూరకా, శ్యాలకా - 
మీరు ఈశాన్య, ఆగ్నేయ యోధుల దళాలను అప్రమత్తం చేయండి. 
నేను ఈ దిశగా వెళ్తున్నాను. చారుదత్తా, మీ ఎల్లరకు నమస్సులు.
మార్గ్ ;- ఆర్యకులు వెళ్ళారు. కర్ణపూరక, శ్యాలకులు - 
అందరూ - తలో దిక్కు వాళ్ళు వెళ్ళారు. 
మైత్ర్  ;- అందరూ  - ఎక్కడో అక్కడ - కలుస్తారు. కలిసి, తారతమ్యం లేకుండా - 
భేద భావాలు మరిచి - తమ తమ కార్యాచరణలను కొనసాగిస్తారు. 
మైత్ర్ ;- కిం కర్తవ్యం?
చారు ;- అమ్మా, ఉజ్జయినీ, శకటాన్ని అధిరోహించు.
వసంత రాక - ప్రశ్నార్ధకం అయిందేమిటి విచిత్రంగా.
మైత్ర్ ;- ఆ తరువులు, పుష్పాలు, సరసులు, మేఘాలు, విహంగం, మనుషులు  - 
ఇన్నిటి గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం. 
లోకాభిరామాయణం - కాలక్షేపం - పిచ్చాపాటీ - 
ఆషామాషీ కబుర్లు  - ముచ్చట్లు - నిర్విరామంగా చెప్పుకున్నాము. 
ఊరూ వాడా, నగరం, దేశం ఇన్నింటిని  గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం. 
మాట్లాడుకునీ, మాట్లాడుకునీ, అలసిపోయాం. ఇంక నా ఆలోచన స్తంభించింది.
మార్గ్ ;- కొంచెపాటి విషయాలకే - కొందరి మెతకమనసులకు
మెదడు మొద్దుబారిపోతూ ఉంటుంది. [నవ్వి] 
యజమానీ, వసంత సేన గారి కన్నతల్లికి - ఇష్టం లేని వ్యవహారం ఆయిరి. 
ఆమె కంట్లో పడి ఉంటారు, కూతురిని ఆపి ఉంటుంది.
చారు ;- ముందు ఉజ్జయినినైనా భద్రంగా తీసుకు వెళ్ళు. 
మైత్ర్ ;- ధూతాంబ దేవి గారికి ఒకరు చెప్పాల్సిన పని లేదు. 

ఆమె ఈమెను చల్లగా కాపాడుతుంది. 
;
***************************;
సంకెళ్ళ ధ్వని - గాజుల సడి ;
శృంఖలలు = బేడీలు ; 
***************************;
;
 పాత్రలు ;-  ఉజ్జయిని & ఆర్యకుడు ;; 
కన్యేశ్వరుడు & నిశుల్కుడు ;; మార్గుడు ;;
చారుదత్తుడు ; మైత్రేయుడు ;;
previous post ;-20, డిసెంబర్ 2017, బుధవారం ;; నగరంలో గజం  ;;
***************************; ;
మృచ్ఛకటికం ;- ఆసక్తి, కృషి ;-
1. ఎం. ఆర్. కాలే - ప్రకారం - రచనాకాలం 200 BC - రచయిత - శూద్రకుడు ; 
MR Caulay - pub - 1924 ;;
2. దండి [దశకుమార చరిత్ర - ] - రాసిన అనే వాదన ఒకటి ఉన్నది. 

3. బేతవోలు రామబ్రహ్మం - అనువాదం ;;
4. ధేనువకొండ చిన్ని కృష్ణ శర్మ ; విజయవాడ ; 
***************************;
REF ;-
1. అది వింటూనే శర్విలకుడు 'నా ఆప్తమిత్రుడు ఆర్యకుడు బంధింపడ్డాడా? ఎంత కష్టం వచ్చింది. ... 
శర్విలకుడు వెళ్లిపోయిన కాస్సేపటికే వసంతసేన వద్దకు చారుదత్తుడి సహచరుడు మైత్రేయుడు వచ్చాడు. 
&
2. ఆ సమయంలో స్థావరకుడనే శకారుడి బండివాడు బండితో సహా ఆ వీధిలోకి వచ్చాడు. 
పుష్పరండకం ఉద్యానవనంలో వుంటాను రమ్మనమని శకారుడు అతని చెప్పాడు. 
ఉజ్జయినికి యితర ప్రాంతాల నుంచి వచ్చిన బళ్లవాళ్లతో వీధంతా నిండిపోయి వుండి -
అతను ముందుకు వెళ్లలేకపోతున్నాడు. 
'ఒరేయ్‌ పల్లెటూరి బైతుల్లారా, ఇది ఎవరి బండి అనుకుంటున్నారురా? 
సంస్థానకుడు (శకారుడు పదవి పేరు) గారి బండి. 
దారి వదలకపోతే ఎలా? ఆయన అక్కడ నా గురించి కాచుకుని వున్నాడు.

; &
వీరకుడు - చందనకుడు స్పర్ధ - ఎమ్బీయస్‌: మృచ్ఛకటికమ్‌- 11 ;- LINK ;-
వాళ్లిద్దరూ సమానస్థాయి దండనాథులు
''ఒరేయ్‌ వీరకా! మేం దాక్షిణాత్యులం
పది రకాల మ్లేచ్ఛభాషలు తెలిసినవాళ్లం. 
మా భాష అందుకే అలా వుంటుంది. ఒక్కోప్పుడు లింగభేదం పాటించం. 
మా యాసకీ, నేను చెప్పినదానికి సంబంధం ఏమిటి?'
2. చిన్న బండి - క్లుప్తంగా కథ ;-  LINK ;- 
;

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...