వసంతసేన ;- శర్విలకుడు, కుశావతి వెళ్ళిపోయారు.
కుశ వెళ్ళిన తర్వాత - ఒంటరి తనం - తెలిసి వస్తున్నది.
ధూతా దేవి నగలు - నాకు భారంగా అనిపిస్తున్నవి.
వెంటనే వీటిని ఆమెకు చేర్చి తీరాలి. తుందిలుడా!
తుందిలుడు ;- బండిని సిద్ధం చేసి ఉంచాను దేవీ!
వసంత సేన ;- తుందిలుడా! ఆర్యకుడు ఎవరు?
నగరంలో ప్రశాంతత - స్థిరంగానే ఉన్నదా!?
తుందిలుడు ;- కొంచెం కల్లోలంగా ఉన్నదమ్మా!
ఐనా ఫరవాలేదు, కొంత సద్దు మణిగినట్లే ఉంది.
వసంతసేన ;- తుందిలా, ఎందుకైనా మంచిది,
పక్క సందు నుండి శకటమును పోనివ్వు.
తుందిల ;- చారుదత్తుల ఇల్లు వచ్చింది అమ్మా!
వసంత సేన ;- అదే తోట, అదే ప్రశాంతత.
ఆ ఇద్దరు పరిచారకులు పంచపాళీలో చదరంగ క్రీడను చెరిగేస్తున్నారు.
&
మైత్రేయుడు ;- వర్ధమానా, చూడు పందెం.
వర్ధమాను ;- మైత్రేయుని శకటు ఓడి పోయింది, గెలుపు
పందెం ఈ వర్ధమానునిదే కదా.
వసంతసేన ;- గృహమునందు యజమాని ఉన్నారా!?
మైత్రేయ ;- చారుదత్తా! వసంతసేన వచ్చారు.
చారుదత్తుడు ;- వసంతసేన ఆగమనం ఆశ్చర్యదాయకం.
మైత్రేయా, ఈమెకు నగలను ఇచ్చావా!?
మైత్రేయ ;- చారుదత్త స్వామీ, మీరిచ్చిన మూటను
, ఆమెకు అప్పటికప్పుడు -
, అప్పుడే ఇచ్చేసాను దేవరా!
వసంతసేన ;- అరె, మైత్రేయుని నిజాయితీని శంకించకండి. ఇవేగా ఆ నగలు, చూసి చెబుతారా?
చారుదత్త ;- ఔను, మీకు నచ్చలేదు కాబోలు. మీ ఆభరణముల విలువకు సమం అవవు.
నెమ్మదిగా - తరువాత వాటి విలువను - ద్రవ్య రూపంలో ఇస్తాను.
ఈ పేదవాని వలన తప్పిదం జరిగి పోయింది. మీ సొమ్మును కాపాడ లేక పోయాను.
వసంతసేన ;- అరె, మీ మీద నాకు భరోసా ఉన్నది.
చోరులు తెగించారు, మీరేమి చేయగలరు?
ఇవి మీ భార్యవి కదా,
కళళలాడుతున్న ధూతాంబ ఆభరణాలను - మీరు నాకు పంపించారు.
నాకు దోషం, పాపం అంటుకుంటాయి. ఆవిడకు ఇవ్వండి.
మైత్రేయ ;- అమ్మగారు తమ సోదరి పెళ్ళికి వెళ్ళారు.
దేవరా! వంట గదిలో భోజన పదార్ధాలు ఉంచాను.
ఏదో మగవాని చేతి వంట, మీరు సర్దుకోక తప్పదు.
వర్ధమానుడు ;- దొరా! మైత్రేయుని ఆప్తులు వచ్చి ఉన్నారు.
పండుగ పనులకు ఇతని చేతి సాయం కావాలంటున్నారు - బైట నిలబడి ఉన్నారు.
చారుదత్ ;- సరే, మైత్రేయా! అంత కావలసిన బంధువులు పిలుస్తున్నారు కదా, వెళ్ళు.
భోజనాదులు, పనులు - మేము చూసుకుంటాములే.
&
వర్ధమానుడు ;- తుందిలా, నీ గూడుబండిని బాగా అలంకరించావు. శభాష్!
తుందిలుడు ;- నా పని అద్దంలాగా ఉంటుంది - అని
మా వసంత దేవి మెచ్చుకుంటుంటారు, తెలుసా.
వర్ధ ;- ఎవరి కర్తవ్యాన్ని వారు సక్రమంగా చేస్తుంటే
లోకంలో కరువులు, కన్నీళ్ళు ఉండవు కదా.
మైత్రేయుడు ;- మా ఆప్తులు వచ్చారన్నావు కదా, వర్ధమానా, ఏరీ, ఎక్కడ?
వర్ధ ;- అమాయక బ్రాహ్మణుడా. మైత్రేయా,
నీకు అర్ధం కావాలంటే పుష్కర కాలం పడుతుంది.
పద, ఆ గుట్ట మీది గుడికి వెళ్ళి వద్దాము.
తుందిలుడు ;- ఓహో, మీ జోడీ - అట్లాగ కులాసాగా తిరిగిరండి.
మీకు ఈ తుందిలుడి శకునం అభయం, శుభం భూయాత్.
[నవ్వాడు తుందిలుడు]
;
మళ్ళీ చారుదత్తునికి వాపసు ఇచ్చిన నగలు ;
అధ్యాయ శాఖ ;- 18 ;- మళ్ళీ చారుదత్తునికి ఇంటికి ఆమె ;
] previous ;- ఆర్యకుడు బందిఖానా ;
& ; శకారుడు -రదనిక - వసంతసేన ; LINK ;
ఎమ్బీయస్: మృచ్ఛకటికమ్- 3 ;
REF ;- మైత్రేయుడు దీపం పట్టుకుని వచ్చి శకారుడితో
''ఇది చారుదత్తుడి యిల్లు, ...... " ;

♣♣♣ ♣♣♣ ♣♣♣ ♣♣♣♣♣♣ ♣♣♣ ♣♣♣ ♣♣♣♣♣♣ ♣♣♣ ♣♣♣
; మళ్ళీ చారుదత్తునికి వాపసు ఇచ్చిన నగలు ;
అధ్యాయ శాఖ ;- 18 ;- మళ్ళీ చారుదత్తునికి ఇంటికి ఆమె ;
] previous ;- ఆర్యకుడు బందిఖానా ;
& ; శకారుడు -రదనిక - వసంతసేన ; LINK ;
ఎమ్బీయస్: మృచ్ఛకటికమ్- 3 ;
REF ;- మైత్రేయుడు దీపం పట్టుకుని వచ్చి శకారుడితో
''ఇది చారుదత్తుడి యిల్లు, ...... " ;
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి