22, నవంబర్ 2017, బుధవారం

మైత్రేయుని పొరపాటు

చారుదత్తుని ఇల్లు ;-
చారుదత్తుడు ;- మైత్రేయా, వర్ధమానకా, 
,                ఆమె ఆభరణాలను భద్రంగా కాపలా కాయండి, 
రదనికా, రోహణునికి పాలు ఇచ్చావా, 
రదనిక ;- ఇచ్చాను, రోహణ బాబు పాలు తాగారు, 
ఇంక మీకోసం ఎదురుచూస్తున్నారు. మీరు కథ చెప్పాలని.
ధూత ;- రామాయణ, భారతం, భాగవతం, ఉపనిషత్తులు - 
 ప్రతి రోజూ - ఏదో ఒక కథ చెప్పాలి. 
రదనిక ;- లేకుంటే నిద్ర ఎట్లా పడుతుందమ్మా, 
                  పిల్లలకు కన్నతల్లి పలుకులు తేనె ఊటలు కదా.
ధూతమాంబ ;- గదిలోకి వెళ్తున్నాము. 
చారుదత్త ;- ఆభరణముల సంరక్షణను - ఆ ఇద్దరు - బాధ్యతగా చేస్తారులే, ధూతా! 
ఎంతైనా - స్త్రీలకు నగలంటే ఎంతో ఇష్టం. [ ఆమె నవ్వింది]
వర్ధమానకుడు ;- సరే స్వామీ! మీరు నిశ్చింతగా నిద్ర పొండి. 
బయట - నేను, బండివాడు మార్గుడు - ఉంటాము. ఈగ కూడా జొరబడలేదు.
మైత్రేయుడు ;- వర్ధమానా, నీ మాట నాకు కొండంత ధైరాన్ని కలిగించింది. 
కాసినీ కూసినీ కావు కదా, పెట్టెడు నగలు .......... భోషాణములు కూడా ఇక్కడ లేవు. 
దాన ధర్మముల కోసం స్వామి చారుదత్తుల ఆస్థిపాస్తులు, బంగారం,  వస్తువులు అన్నీ ఐపోయాయి, 
ఇంక తలదాచుకోను తాతల నాటిది, ఈ పాత ఇల్లు మిగిలింది. 
హా - నాకేమో ఈ ఆవులింతలు ఆగవు, కంటి రెప్పల మీద కునుకు వేళ్ళాడుతున్నది. 
ఇంక ఈ నగల మూటను నా తల కిందే పెట్టుకుని పడుకుంటాను.
;
[రాత్రి - దొంగ - శర్విలకుడు ]
శర్విలకుడు ;- పురాతనమైనదే ఐనా ఈ ఇంటి గోడలు దిటవుగా, గట్టిగా ఉన్నవి. 
ముందు ఇద్దరు కాపలా ఉన్నారు. 
కాబట్టి ఇంక ఈ వెనుక వైపు మాత్రమే ఈ శర్విలకుడికి మిగిలిన దారి. 
[కన్నం వేసి, దూరాడు] 
;
మైత్రేయుడు ;- వర్ధమానా, నువ్వు కూడా నిద్ర పట్టక, తచ్చాడుతున్నావు, 
ఏమిటి, గాలికి దీపం మలిగినట్లున్నది. ఈ నగల మూటను నీ దగ్గర పెట్టుకో నాయనా! 
హమ్మయ్య - ఇప్పుడు ఇంక నాకు తగని నిశ్చింత. 
గుండెల మీద చెయ్యి వేసుకుని - హాయిగా నిద్ర పోతాను.
[ శర్విలకుడు గప్ చుప్ గా మూటను అందుకున్నాడు]
;
శర్విలకుడు ;- ఆహా, వేకువఝామున కలలోకి నా ప్రేయసి కుశావతి వచ్చింది. 
పొద్దున్నే వచ్చిన స్వప్నాలు నిజమౌతాయని నానుడి. 
కనుకనే ఈ శర్విలకుడికి ఇంత సులభంగా సొత్తు దొరికింది. 
వసంతసేనమ్మకు ఈ నగలు ఇస్తాను. దాంతో నా ప్రియురాలికి దాస్య విముక్తి. 
ఆ యజమాని వసంతమ్మకు ఋణం తీర్చగలుగుతున్నాను. 
ఆ ఆలోచనతో - నా మనసును మేఘాలలో తేలిపోతున్నది.
శర్విలక ;- వచ్చిన రంధ్ర ద్వారం నుండే బైటికి చేరి, ప్రహరీ గోడను ఎక్కి, దూకాను. 
హమ్మయ్యో, ఆ దిక్కున దండ నాయకులు - చందనకుడు, వీరకుడు ఉన్నారు. 
సరే, పక్క బాటలో నుండి జారుకుంటాను.
దూతకరుడు ;- శర్విలకా, ఆగు ఆగు. 
శర్విలకుడు ;- అరె, దూతకరుడు, దర్దురకుడు - 
మీరు ఇంత అపరాత్రి వేళ వీధులలో ......
దూతకరుడు ;- మామూలే కదా, మా మిత్రద్వయం - 
జూదంలో రేయిం బవళ్ళు గడపటం. నీ చేతిలో ఏమిటో ఆ మూట!?
దర్దురకుడు ;- నా మిత్రుడు - దూతకరుడి సందేహం నివృత్తి చేయనిదే 
అడుగు ముందుకు వేయలేవోయీ! 
శర్వికుడు ;- నా ఇష్ట సఖి - వేశ్యా వాటికలో ఉన్నది.  
ఆమె తల్లిదండ్రులు వేశ్య మాత వద్ద అప్పు తీసుకున్నారు. 
చేసిన అప్పును తీర్చేదాకా - నా రమణి కుశావతి - 
వారి వద్దనుండి ఈవలకు రాకూడదు కదా. 
నేను ఆమెను పెళ్లి చేసుకోవాలంటే - ఆ శుల్కం చెల్లించి తీరాలి. 
గత్యంతరం లేని పరిస్థితులలో చోరత్వానికి పాల్పడ్డాను.
దర్దురకుడు ;- వసంతసేన నుండి నీ మగువను తెచ్చుకొని, సుఖంగా ఉండు శర్విలకా, 
ఈ దర్దురకుని మాట వేదవాక్కు.
దూతకరుడు ;- నీ కుశావతిని తెచ్చుకుని, 
పరిణయమాడి, పిల్ల పాపలతో - కుశలముగా జీవించుము - 
ఇది ఈ దూతకరుని దీవెనలు, శర్విలకా, క్షేమంగా వెళ్ళి, లాభంగా మరలుము.
ఇద్దరు ;- 'మీ శర్విలక -  కుశావతి జంట
కలకాలం సుఖంగా సౌఖ్యాల క్రీడలలో ఓలలాడుదురు గాక.
శర్విలక ;- సంతోషం. మీ అశీస్సులు ఫలించాలి. సెలవు, వెళ్తున్నాను.
దూతకర ;- మిత్రమా, దర్దురకా, అటునుండి ఏదో ధ్వని ........
దర్దురకుడు ;- ఔను దూతకరా! చారుదత్తుని ఇంటి నుండి - ఆ సవ్వడి ......... పద, చూద్దాము.
చారుదత్తుడు ;-  మైత్రేయా, మన ఇంటిలో ఏమి మిగిలి ఉంటాయని - 
దొంగ వస్తాడు,  చోర వృత్తి కొత్తగా చేపట్టిన వాడు ఐ ఉంటాడేమో కదా!
మైత్రేయ ;- చిత్తం. కానీ - కించిత్తు అదృష్టం - గుడ్డిలో మెల్ల. -
మిత్ర వర్ధునికి ఇచ్చాను - వర్ధమానా, వసంతా దేవి రత్నాల నగల మూట - 
నీకు ఇచ్చాను కదా, అవి నీ వద్ద భద్రమే కదా.
వర్ధమానకుడు ;- నాకు ఇచ్చావా, ఎప్పుడు, రాత్రి నాకు గాఢ నిద్ర పట్టింది. 
అసలు మెలకువయే రాలేదు .......
చారుదత్త ;- ఆ, ధూతా, రదనికా, ఇంట్లో ఎక్కడైనా పడి పోయాయేమో, వెదకండి.
మైత్రేయ ;- క్షమార్హుడిని కాను - దేవరా! వర్ధమానుడు అనుకుని, 
ఎవరి చేతికో నగల మూటలను ఇచ్చేసాను.
ధూతమాంబ ;- ఏడవకు మైత్రేయా, ఏద్చి ప్రయోజనం ఏముంటుంది!?
రోహణుడు ;-  అమ్మా, ఏం జరిగింది!?
ధూత ;- అయ్యో, నా చిట్టితండ్రికి నిద్రా భంగం కలిగింది. రదనికా, రోహణ బాబును 
లోపలికి తీసుకు వెళ్ళు. ఆర్య చారుదత్తులు, వీటిని గ్రహించండి.
చారుదత్త ;- నీ నగలు వలిచి ఇస్తున్నావా, భార్యగా నీ చేయిని పరిగ్రహించాను. 
చివరికి భర్తగా నా నుండి నీకు లభించిన ప్రతిఫలం ఇంతే కదు!
ధూత ;- స్వామీ, మీ కష్ట సుఖములలో భాగస్వామిని ఐనప్పుడే - 
అర్ధాంగిగా నా బ్రతుకు సార్ధకత, నా మీద కృపతో వీనిని స్వీకరించండి. 
చారుదత్త ;- మైత్రేయా, మీరిద్దరు - ఈ నగలను - ఆమె ఇంటికి వెళ్ళి ఇచ్చివేయండి.  
మైత్రేయ ;- వసంతసేనమ్మకు - పొరపాటు జరిగింది - కనుక 
మా అమ్మగారి నగలను బదులుగా ఇస్తున్నాము. - అని చెప్పి, ఇచ్చి వస్తాము దొరా!
;
*************************************************;
;
అధ్యాయ శాఖ ;- 15 ; - 
పాత్రలు ;- చారుదత్తుడు - ధూతమాంబ -  రోహణుడు ;;;
రదనిక - మైత్రేయ - వర్ధమానుడు ;;;;
శర్విలకుడు - దర్దురకుడు - దూతకరుడు ;;;
[దండనాయకులు ;- చందనకుడు, వీరకుడు ] ;;;
[అధ్యాయ శాఖ ;- 14 ; బౌద్ధ సన్యాసి సంవాహకుడు  - next + ] ;
*************************************************;
;
BHAARATEEYAM ; బుద్ధ భగవానుడి కథలు - బోధనలు ; LINK ;

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...