21, నవంబర్ 2017, మంగళవారం

కూటమి నడక - కూడలి వైపుకి

మాధురుడు ;- మార్గా, ఓ మార్గుడా;
మార్గుడు ;- ఎవరు? మాధురుడా!?
మాధురు ;- ఆహా, గుర్తు పట్టావు కదా, మీ పల్లెకు పక్కన ఉన్న గ్రామ నివాసిని నేను, 
ఐనా గుర్తించావు, నీ జ్ఞాపక శక్తికి నా జోహార్లు.
మార్గు ;- ఇల్లరికం వెళ్ళావు, మీ అత్తవారింటిలో వైభోగంగా ఉన్నావా!?
మాధురు ;- భోగం, వైభోగం - అదీ మగవానికి అత్తింటిలో ......
 భలే భలే! చెప్పావు మార్గా! 
పురుషునికి ఇల్లరికం - గౌరవ మర్యాదలు ............ 
హు ....... తట్టుకోలేకే - నేను నేడు ఇక్కడ ఉన్నాను.
మార్గు ;- ఓహో, కాస్త అటు ఇటుగా మన అందరి పరిస్థితి ఒకటే లాగ ఉన్నాయన్న మాట 
మాధురు ;- అన్న మాట కాదన్నా - ఉన్న మాటే అది.
మార్గు ;- చారుదత్తుడు అనే మహనీయుని బండిని తోలుతున్నాను, మరి నీవో ........
మాధురు ;- నీకు ఉదాత్త పురుషుడు యజమానిగా లభించాడు, 
నాకు అట్లాంటి మంచి ఆశ్రయం ఏదీ దొరక లేదు. ఒక జూద శాలను పెట్టుకొని, నడుపుకుంటున్నాను.
మార్గు ;- జూదశాల, ఐతే మూడు దమ్మిడీలు, ఆరు వరహాలు ........... 
మాధురు ;- ఆరు వరహాలు, పన్నెండు వజ్రాలున్నూ ...... కాదా మరి.
మార్గు ;- అంత  నిరాశ పడుతున్నావేమిటి?
మాధురు ;- బహిరంగ రహస్యమే, అసమర్ధ ప్రభువు, అతని రాబందు బంధువులూ ......
మార్గు ;- విరాట రాజుకు కీచకునిలా - బావమరిది శకారుడున్నాడు, అతని గురించేనా?
మాధురు ;- బావ, బావమరిది, ఇంకా అతని తోకలు, చాలా చాలా చాలామంది ......
మార్గు ;- ఔనా, ఐతే ఒక చోటికి వెళ్తున్నాను, వస్తావా?
మాధురు ;- ఎక్కడికి?
 మార్గు ;- మన బోటి వారి కూటమి అది. ఒక రహస్య .......
మాధురు ;- రహస్య ......
మార్గు ;- సమావేశం, రాజు గారి కోటలో ...........
మాధురు ;- హమ్మో,  నేరుగా కోటలోనే. 
మార్గు ;- ఆ,  కోటలోనే, చెరసాల వెనుక ఒక చీకటి కొట్టులో సమావేశం.
మాధురు ;- పట్టుబడుతామేమో .......
మార్గు ;- కొందరు సైనికులు, కొందరు కాపలా భటులు సాయపడ్తున్నారు.  
మాధురు ;- ఎట్లా ఎట్లా, అది ఎట్లా?                                                                  మార్గు ;- ఔను మరి, నమ్మితీరాలి - భటుల కుటుంబాలు కూడా  ......... 
అధికార బాధితులే!
రాజు గారి చుట్టాలు, స్నేహితుల స్వార్ధం ఎవ్వరినీ వదల లేదు. 
వీరు అడగానే - వాళ్ళు సమర్పించుకోవాలి ; నోట్లో మాట నోట్లో ఉండగనే ...... ; 
చందనుడు ;- బ్రహ్మ - పిపీలిక పర్యంతం శకారాదులు దేనినీ వదిలిపెట్టరు, 
జుర్రుకుని, పీల్చి పిప్పి చేస్తున్నారు.
మార్గు ;- నిజం చెబ్తున్నాడు సంవాహకుని ఉవాచ -
నూటికి నూరు శాతం సత్యం సత్యం పునః సత్యం. 
మాధురు ;- సింహం జూలు విదిలిస్తే పడేది దుమ్ము, మన మీద. 
ఇక నుండి మీ కూటమిలో నేను కూడా సభ్యుణ్ణి
తుందిలుడు ;- మార్గా! ఓ మార్గా! ఓహో మార్గుడా, ఓహోహో మార్గయ్యా!          
మార్గు ;- ఓహో తుందిలుడా! ఈతను వసంతసేన గారి శకట సారధి, వీరు మాధురులు ;
వీరి నామం చందనుడు - రాజభటుడు.  
మాధురు ;- పరస్పర పరిచయాలు బాగా చేస్తున్నావు, నన్ను కూడా ...... 
ఈ కొత్తవారికి పరిచయాలు చేయండి. 
మార్గుడు ;- సంవాహకా, ఎచ్చటి నుండి రాక ......... 
మాధురు ;- సంవాహకుడు కదూ, మార్గా - 
వీనికి నూత్న పరిచయ అవస్థ - అనవసరం.
సంవాహకుడు ;- అరె, జూదశాల నిర్వాకులు, మాదురుడు - అయ్యా, మన్నించండి - 
మాధురు ;- గుర్తున్నానన్నమాట!!!! హూ ......... జూదశాలకు నిత్య అతిధివి. 
జూద మండపంలో తిష్ఠ వేసి, వినోదం పొందే వాడివి. 
మంటపం అద్దె ఎగకొట్టే చిట్కాలు నీ దగ్గరే అందరూ నేర్చుకోవాలి మరి.
సంవాహకుడు ;- ఏమి చేయగలను? 
జూదంలో గెలుపు అనే దేవత నన్ను కరుణించడం లేదు, 
ఒక్క అవకాశం చాలు, ఒక్క గెలుపు చాలు - 
నీ బాకీ - చిటికెలో తీరుస్తాను కదా, మీ మీద ఒట్టు.
మాధురు ;- సరి, సరి - తిన్నగా నా పైననే, వద్దు, 
ఒట్టు తీసి, గట్టు మీద పెట్టు.
మార్గు ;-  మీ వాదనలు తరువాత - కాస్త, ఈ మార్గుని మాట చెవికి ఎక్కించుకోండి. 
ఇప్పుడు - మన గమ్యస్థానానికి బయలుదేరుదాం. 
మాధురు ;- ఈ మాధురుడు సిద్ధం, ఆర్యక కేంద్రం వద్దకు.
సంవాహకు ;- మా సంవాహక, తుందిలుల జంట కూడా - ఎప్పుడో మీ జతలో చేరాము, 
తుందిలు ;- కదలండి అందరూ, పదండి, ముందుకు పదండి ముందుకు. 
అందరు ;- మును ముందుకు -ముందుకు,  పదండి ముందుకు. ;
*****************************************;
[ previous episode ;-
          అధ్యాయ శాఖ ;- 12 ;- మీ గృహమున మా నగలు మీ భద్రం] ;
 ;- అధ్యాయ శాఖ ;- 13 ;- కూటమి నడక - కూడలి వైపుకి ;-
పాత్రలు ;- మార్గుడు =  చారుదత్తుని cart driver ;  
తుందిలుడు = వసంతసేన గారి శకట సారధి ;  
సంవాహకుడు = సన్యాసం in FUTURE ;  
చందనుడు - రాజభటుడు ;
మాధురుడు = జూదశాల నిర్వాహకుడు;  
REF ;- పదండి ముందుకు ;
**********************;
REF ;- 1. చారుదత్తుడనే బ్రాహ్మడు ఉజ్జయినీ నగరంలో
2. చారుదత్తుడి వద్ద ఒళ్లు పట్టేవాడిగా 
గతంలో పనిచేసిన సంవాహకుడు అనేవాడు .......  ; &
వర్గం "సంస్కృత నాటకాలు" లో వ్యాసాలు ;- 
అభిజ్ఞాన శాకుంతలము ;; [ముద్రారాక్షసమ్ ] ;;
ఉ ;- ఉత్తరరామచరిత్ర ;;; ] న ;- నాగానందము ;;                       
] మ ;- మాళవికాగ్నిమిత్రము ;; ] మృచ్ఛకటికమ్‌ ;;
] వ ; -  విక్రమోర్వశీయము ;; ] వేణీ సంహారము ;; 

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...