కిటికీలో నుండి కోకిల పాట వినిపిస్తుంది. అటు వెళ్ళబోయింది కుశావతి.
"కుశావతీ! ..... " వసంతసేన గొంతు అది.
వసంతసేన ;- ఇక్కడ ఒకతను వచ్చాడు, ఎవరో చూడు.
కుశావతి ;- [సిగ్గు పడుతూ] శర్విలకుడు అమ్మా ......
వసంత సేన ;- గుర్తు పట్టావే. [పకపకా నవ్వుతూ అంటూ ]
శర్విలకా, నీ చేతిలో ఆ మూట ఏమిటి,
ఏదీ, నువ్వు తెచ్చిన మూటను విప్పి, చూపు.
ఏదీ, నువ్వు తెచ్చిన మూటను విప్పి, చూపు.
[చూపుడు వేలుతో సంజ్ఞ చేస్తూ అన్నది వసంత సేన]
శర్విలకుడు ;- సరే [తటపటాయిస్తూ చూపించాడు ]
[రమణులు ఇద్దరు ఉలిక్కిపడ్డారు]
కుశావతి ;- అయ్యో, ఈ నగలు .......
చారుదత్తుల ఇంట్లో నుండి దొంగిలించావా ఏమిటి!?
శర్విలకుడు ;- అబ్బే, అదేం కాదు, కాదు.
కుశావతి ;- కాక, ఇంత విలువైన నగలు .......
ఈ వజ్రాభరణాలు ...... ఈ ఊళ్ళో కొద్దిమందికే ఉన్నవి.
వీటిని స్వయంగా వసంతసేన - వారి ఇంట్లో దాచిపెట్టమని ఇచ్చారు.
నువ్వు, ఇంకా ఏవైనా
కాకమ్మ,
శర్విలకుడు ;- తప్పైపోయింది, గుంజీలు తీస్తాను,
ఇదంతా నీ కోసమే చేసాను కుశావతీ!
కుశావతి
చెప్పుకోవడానికీ, సమర్ధించు కోవడానిన్నీ.
మునుముందు ఇంకా ఏమి అవస్థలు కలుగుతాయో ఏమో .........
పైగా నా కోసం ఇంత నీచం [ఆమె ఎక్కిళ్ళు పెడ్తున్నది]
వసంతసేన ;- ఊరుకో కుశావతీ! ఇంత తెగింపు ప్రేమ నీ కోసమే కదూ!
శర్విలకునికి నీపై అనురాగం మెండు.
[ఇంతలో మైత్రేయుని రాక]
మైత్రేయుడు ;- కుశావతీ! మీ స్వామిని సొమ్ములు మేము
భద్రపరచ లేక పోయాము. కనుక, ఈ నగలను
వసంతసేనకు ఇవ్వమని నన్ను పంపారు చారుదత్తులు.
వసంతసేన ;-ఈ రత్నాభరణములు - ధూతమాంబ ధరించినవి కదూ.
[మనసులో అనుకున్నది]
[మనసులో అనుకున్నది]
వసంతసేన ;- భూమి గుండ్రంగా ఉన్నది - కుశా!
నీ సఖుడు శర్విలకుని వలన అనుకోకుండా మేలు జరిగింది.
కుశావతి ;- సాక్షాత్తు వారివి ఇవి. అర్ధంపర్ధం లేని పనులు చేసాడు శర్వుడు.
వసంతసేన ;- ప్రేమ కోసం, ప్రేమ వలన, ప్రేమ తోటి -
ఇంత సాహసం.
ఎంతైనా అటువంటి ప్రియుడు లభించాడు నీకు.
భాగ్యశాలినివి కుశావతీ! శర్విలకా, మీ ఇద్దరి పెళ్లిని నేను చేస్తాను.
నువ్వు నిశ్చింతగా ఉండు.
కుశావతి ;- అమ్మా, మీ తల్లిగారికి కోపం వస్తుందేమో.
వసంతసేన ;- మా జననికి నేను నచ్చజెబుతాను. మైత్రేయా,
చారుదత్తుల వారికి నా కృతజ్ఞతలు తెలుపు.
మైత్రేయుడు ;- వసంత దేవీ! విధివిలాసం అంటే ఇదే కాబోలు!
మీ ఆభరణాలను మీకు చేర్చాను.
వెళ్ళివస్తాము. పద వర్ధమానకా!
[
మైత్రేయుడు, వర్ధమానకుడు వెళ్లిపోయారు.
శర్విలకుడు ;- జీవితంలో ఒకే ఒక్కసారి - గ్రహపాటు బాగోలేక చేసాను పొరపాటు.
ఇంక ఎన్నడూ చేయను.
భూమి మీద ఒట్టు వేస్తున్నాను.
వసంతసేన ;- అన్నేసి ఒట్లు ఎందుకు. శర్విలక, కుశావతిల
జంట కన్నుల పంట.
పెళ్ళినాటి ప్రమాణాలు మరువక, కట్టుబడి ఉండు, అదే పది వేలు.
శర్విలకుడు ;- పెళ్ళి ముహూర్తాలు పెట్టుకోగానే, మీ వద్దకు మళ్ళీ వస్తాము.
మీ ఆశీస్సులు తీసుకుంటాము.
వసంతసేన ;- శర్విలకుని, కుశావతిల జంట - సంతోషం కలకాలం వర్ధిల్లాలి.
శర్విలకుడు ;- బయట కోలాహలం, అదేమిటి!?
అక్కడ వీరకుడు,
చందనకుడు - పరిగెడుతున్నారు.
[బైట అరుపులు, కేకలు ;-
ప్రజలు యావన్మందికీ హెచ్చరిక.
అందరూ ఈ చాటింపును శ్రద్ధగా వినండి.
ఆందోళనకారుడు ఆర్యకుని చెరసాలలో వేసారు.
కనుక ప్రజలు - తగు జాగ్రత్తల్తో మెలగవలసినదిగా తెలుపుతూ -
టముకు వేస్తున్నాము - ఒహో .... ]
శర్విలకుడు ;- కుశావతీ! నువ్వు మీ కన్నవారి ఇంటికి
వెళ్ళు. నేను నిన్ను ఆనక కలుస్తాను. నా ప్రాణ స్నేహితుడు
ఆర్యకుడు చిక్కుల్లో ఇరుక్కున్నాడు, నిన్ను మళ్ళీ కలుస్తాను.
వసంతసేన ;- తుందిలా! కుశావతిని -ఆమె పుట్టినిల్లు వద్ద దించు.
తుందిలుడు ;- అమ్మా, కుశావతి సోదరుడు రేభిలుడు ఉండే స్థలం నాకు తెలుసు,
అక్కడ ఈమెను అప్పగించి రమ్మంటారా!?
-
కుశావతి ;- కానీ మా అన్న చెప్పా పెట్టకుండా దేశాంతరములకు వెళ్ళాడు .....
శర్విలకుడు ;- రేభిలుడు - నీ సోదరుడా, ఆహా, అతను మంచి గాయకుడు.
ప్రజలలో ఉత్సాహాన్ని నింపుతున్నవి అతని పాటలు.
మా దళమునకు రేభిలుని గానం ద్వారా అత్యంత ఉపకారం చేకూరుస్తున్నాడు.
వసంతసేన ;- మొత్తానికి వెదకబోయిన తీగలు కాలికి తగులుతున్నవి.
శర్విలకుడు ;- ధన్యవాదములు అమ్మా! మీ మేలు ఎప్పటికీ మరువలేను.
ప్రస్తుతం - దేశరక్షణ - తక్షణ కర్తవ్యం నాకు. సెలవు తల్లీ!
;
♣♣♣ ♣♣♣ ♣♣♣ ♣♣♣♣♣♣ ♣♣♣ ♣♣♣ ♣♣♣♣♣♣ ♣♣♣ ♣♣♣
;
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి