11, అక్టోబర్ 2017, బుధవారం

అక్కడే దోబూచి

వసంతసేన, మదనికలు గుబురు చెట్టు వెనక - 
నక్కి ఉన్నారు, గజగజా వణుకుతూ. 
చారుదత్తుడు అప్పటికే తోటలో పని చేస్తున్నాడు.
అతను తమ ఆవరణలోకి - వసంతసేనా ద్వయం - ప్రవేశించడం - గమనించ లేదు.
వసంతసేన చారుదత్తుడిని చూస్తూ, సంతోషంలో మునిగిపోయింది.
"అమ్మా! ఇవాళ మీకు అదృష్ట యోగం పట్టింది. 
మరీ అంత తన్మయంలో మైమరచి పోకండి.
వెదక బోయిన తీగ కాలికి తగిలింది." 
;;;;;;; ;;;;;;; ;;;;;;; ;;;;;;; ;;;;;;; ;;;;;;; ;;;;;;; ;;;;;;; ;;;;;;; 

"రోహణా!"  చారుదత్తుడి పిలుపును ఆలకించి, అతని సుపుత్రుడు బైటికి వస్తున్నాడు. 
"వస్తున్నా, నాన్నగారూ!" 
"ఉసిరిక చెట్లకు పాదులు చేయండి. వచ్చే కార్తీక మాసంలో వన భోజనాలు చేయాలి కదా." 
అందరూ హుషారుగా "హాయ్ హాయ్" అంటూ నవ్వారు.
"వర్ధమానకుడు, మైత్రేయుడు గొప్పులు తవ్వుతున్నారు కదా, 
నీళ్ళు సరిగ్గా పారేటట్లు చూడు రోహణా!" 
"సరే నాన్నగారూ"
ధూతాదేవి అక్కడికి - రదనికతో వచ్చింది.
"వంచిన నడుం ఎత్తకుండా పని చేస్తూనే ఉన్నాను, మీరు కాస్త సేదదీరండి. బడలిక తగ్గుతుంది, ముందీ పానీయాలను అందరూ త్రాగండి."
"తేనె, నిమ్మ రసం కలిపి తయారు చేసాను. తీసుకోండి,యజమానీ!... 
ఓహో,పని దొంగల్లారా!"
"ఎవర్నీ, మమ్మల్నే!" 
"ఆహా, మిమ్మల్నే. తీరుబడి లేనంత పని చేస్తున్నట్లుగా నటించడంలో బహు నిపుణులు."
"ఇక్కడికి వచ్చి ఇవ్వవచ్చునుగా."
"మరే, పాపం. నోటికి అందివ్వమని ఆజ్ఞాపించ లేదు. ఇక్కడ పెట్టేసాను, వేం చేసి గ్రోలండి."
ఆ గ్లాసులను చెట్టు వెనక దాక్కుని ఉన్న వసంతసేన, చెలికత్తె - 
జాగ్రత్తగా తీసేసుకున్నారు, గుట్టుగా త్రాగేసారు. అప్పటికే దాహంతో వాళ్ళ గొంతులు తడారి పోయి ఉన్నవి. 
నెమ్మదిగా తాగి, దాహం తీర్చుకున్నారు.
"వర్ధమానుడా! రదనిక పానీయ చషకములు ఏవీ? రదనిక ఇక్కడే పెట్టానన్నది."
"సరిగా చూడు మైత్రేయా!"
"ఈ మైత్రేయునికి చత్వారం రాలేదులే. 
నువ్వూ కూడా వచ్చి, శ్రద్ధ గా ఇకించు, పర్తిలకించు."
"ఏమైపోయాయబ్బా! ఇది మయసభ కాదు కదా. 
కనికట్టు మటుమాయం అవడానికి."
"రదనిక పరాకున ఇంట్లోకి తీసుకుపోయి ఉంటుంది, గానీ - 
ఇంక పని ఆపి, మీరూ వెళ్ళండి. కాస్త 
విశ్రాంతి తీసుకుని, భోజనాలు చేద్దాం."
అందరూ గృహంలోనికి వెళ్ళారు. 
గృహస్తు చారుదత్తుడు - కాళ్ళు చేతులు శుభ్రం చేసుకున్నాడు.   
లోనికి వెళ్ళబోతూన్న చారుదత్తుడు - 
"ఏదో అలికిడి." అనుకుంటూ పరిశీలనగా చూస్తుండగా - 
అతనికి కనిపించారు, అక్కడే ఉన్న వనితలు.
"ఎవరు మీరు?" ఆశ్చర్యంతో అడిగాడు. 

"మా యజమానిని, ప్రఖ్యాత నర్తకీమణి వసంతసేన."  
మదనిక బెరుకుగానే పరిచయం చేసింది.
;;
12-10-2017 ;-  అధ్యాయ శాఖ ;- 11 ;- అక్కడే దోబూచి  ;- 

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...