FLASH BACK = నేపథ్యం :-
క్రిందటి మాసంలో జరిగింది .......
పౌర్ణమి చేయుటకై వసంతసేన తన దాసి మదనికతో వెళ్ళింది.
;
"అమ్మా! ఇవాళ సరసు ఒడ్డున మీరు నాట్యం అద్భుతంగా చేసారు."
"ప్రతి పౌర్ణమి కదూ - అక్కడ ఉన్న సరస్వతీ దేవి ప్రతిమ ఎదుట నేను నర్తించాలి"
అన్నది వసంతసేన.;
"అవును కదండీ, మీ జన్మ నక్షత్రం ప్రకారం -
ప్రతి పున్నమి రాత్రికి ఈ నర్తన కార్యక్రమం దొడ్డమ్మ గారు,
మీకు విధించిన నియమం కదా!"
ఉద్యానవనములో పున్నమి నాట్యం పూర్తి ఐనది.
నాట్య అభినయ సంపూర్ణం తర్వాత .........
తోట నుండి వసంతసేన, మదనికలు వస్తున్నారు.
;
నందనం ముంగిలి వద్ద భామలు ఇద్దరు ఆగారు.
ఆగి, నిలబడి, తమ శకటం కోసం చుట్టూ చూసారు.
నలు వైపులా పరకాయిస్తూ అన్నది వసంతసేన.
"అరె, మన శకటం ఏది, తుందిలుడు ఏడి, ఎక్కడ?"
"అమ్మా, ఆ అలికిడి, శకారుడు వస్తున్నాడు, పదమ్మా!
స్త్రీలు కంటబడితే వదలని కామాంధుడు. వేగం, వేగం"
ఇద్దరిదీ పరుగు వంటి నడక. శీఘ్ర గమనంసాగిస్తున్నారు.
ఇంతలో శకారుడు వారిని చూడనే చూసాడు.
"భళీ, ఆమె వసంత సేన లా ఉన్నది."
శకారుడి అనుయాయి విటుడు -
వినయంగా తల ఊపుతూ అన్నాడు.
"ఔనౌను దేవరా! ఆమె వసంత సేనయే."
"భళీ, ఇవాళ మన పంట పండింది.
ఓహో వసంత సేనా! నిలు నిలు."
ధాష్ఠికంగా అన్నాడు శకారుడు.
"ఆ జంట ఆగకుండా పరిగెడుతున్నారు, దేవరా"
తాన అంటే తందాన అనే రకం మనిషి విటుడు.
;
"ఇద్దరూ స్త్రీలే ఐనప్పుడు, జంట - అనరు,
ఒక మగ, ఒక ఆడ ఐతేనే అట్లాగ పిలుస్తారు. నీకేమీ తెలీదు.
ఉత్తి మట్టి బుర్రనీది! అనుసరిద్దాం పద! ఓ వసంతసేనా! నిలు నిలు ."
;
అప్పటికే సంజె చీకటి పడుతున్నది.
భీతితో ఉక్కిరిబిక్కిరి ఔతూ, ఇరువురు వనితలు
మసక చీకటిలో - తాము ఎటు పరిగెడుతున్నారో
తెలీని అయోమయ అవస్థలో దౌడు తీస్తున్నారు.
***************************************;
REF : దౌర్జన్య శకార ; అధ్యాయ శాఖ ;- 9 ;
; & ఆర్యకుడు ; in పట్టణంగా మారుతూన్న పల్లెటూరు ;- LINK ;-

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి