11, జులై 2017, మంగళవారం

పౌరాణిక సామెతలు, proverbs - 3

1) కార్తీకంతో వర్షం - కర్ణునితో యుద్ధం ;
] kaarteekamtO warsham - karNunitO yuddham ;
2) మహా భారతంలో "ఆది పర్వతము" అన్నట్లు.
   (ఆది పర్వము,సభా పర్వము మున్నగునవి).
3) బ్రతికిన బ్రతుకుకు భగవద్గీతా పారాయణమొకటి.
4) పంచ పాండవులు ఎందరు?" అంటే, నా కామాత్రం తెలీదా? 

మంచం కోళ్ళలాగా ముగ్గురు, - అని ,
రెండు వ్రేళ్ళు చూపించి, ఒక్క గీతను పలక పైన రాసాడు. 
 - [ హాస్య Humor సామెతలు ]
; &   పౌరాణిక సామెతలు, proverbs - 3 ;-
"రామ లాలీ! మేఘ శ్యామ లాలీ!
  తామరస నయన దశరధ తనయ లాలీ "
********************************************,
1)" శ్రీరామ" చుట్టి, కావ్య రచనకు ఉపక్రమించుట. 
2) శ్రీరామ రక్ష, సర్వ జగద్రక్ష.
3) ఒకటే మాట, ఒకటే బాణము, ఒకే పత్ని.
4) రామబంటు/రాం బంటు (= నమ్మకమైన సేవకుడు).
5) రామ రాజ్యము (సుభిక్షముగా విలసిల్లుతూన్న దేశము). 
&

1) రామాయణమంతా విని, రాముడికి సీత ఏమౌతుందన్నట్లు.
2) ఏదో ఉడతా భక్తిగా కొంచెం సేవ,సాయం." 
3) భరతుడి పట్నం, రాముని రాజ్యము.
4) లక్ష్మణ దేవర నవ్వు.
(అకారణముగా నవ్వితే, అపార్ధాలకు దారి తీసే నవ్వు).
5) ఊర్మిళ నిద్ర.
6)"వాడి వాక్కు రామ బాణమే! తిరుగు లేదు."
7) సుగ్రీవాజ్ఞ (= తిరుగు లేని ఆన,శిరసావహించాల్సినదే! )
8) కుంభ కర్ణుని నిద్ర.(= మొద్దు నిద్దుర)
9) ఆ జంట సాక్షాత్తూ సీతా రాములే! వారిది అన్యోన్య దాంపత్యం. 
10) తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి.
&
జాతీయములు :-
1) రామ ములగ పండు ; సీతా ఫలము ; రామ చిలుక ;
2)"రామ చక్కని బంగారు బొమ్మ ."
3)"శ్రీరాములు నీవే కలవు." 
(అనగా ,సాక్షి సంతకము వలె/ఒట్టు పెట్టు కొని" 
నిజమే చెబుతాను ."అనుట)
4)"రామ లక్ష్మణులు వీరు, భ్రాతృ ప్రేమకు ప్రతి బింబములు."
5) రాముడు లేని అయోధ్య/రాజ్యము.
(= ఆలనా పాలనా లేక ,పరిపాలనా దక్షుడు లేక ,
అవినీతి పేట్రేగి పోయిన దేశము/ ఇల్లు ఇత్యాదులు.)
6) రాముడున్న చోటే అయోధ్య.
(= జనాకర్షణ ఉన్న వ్యక్తి,
ఎక్కడికి వెళ్ళినా జనం రాక పోకలతో సందడి ,
హడావుడి సాక్షాత్కరించుట.)
7) జనకుని రాజ్యం .(పైన 6 వ సామెత లాంటిదే!) 
8) భరతుని పట్నం.( కొత్త మంత్రి గద్దె నెక్కే దాకా ,
   నామ మాత్రపు అధికారాలతో ఏర్పడిన పదవి వంటిది )
9) రామాయణంలో పిడకల వేట.
10) భూదేవంత ఓర్పు.
11) "ఆమె సీతా మహా లక్ష్మి. ఓర్పు, నిదానం ఎక్కువే!" 
12) లంకేశ్వరుడు.(నియంతలా వర్తించే వాడు.)
13) బోయ వాడు రత్నాకరుడు - శ్రీరామభక్తి ద్వారా - 
           వాల్మీకి మునిగా మారినట్లు =
=  bOya wADu ratnaakaruDu - 
Sreeraamabhakti dwaaraa - 
vaalmiiki munigaa maarinaTlu 
;
***********************************************;
;  హాస్య Humor సామెతలు ;  ;  
పౌరాణిక సామెతలు, proverbs - 3  కోణమానిని [ LINK ]  ;

సంపూర్ణ వసంతసేన నాటకము ;- part - 5

అధ్యాయ శాఖ ;- 30 A ;-  తాటాకుల కవిలె కట్ట సేకరణ ;; ;           లేఖక్ 1 ;- ఇందాక వస్తుంటే - వీరకుడు తిట్టుకుంటూ వెళ్తున్నాడు, ఎవరినో!?  ల...