11, జులై 2017, మంగళవారం

పౌరాణిక సామెతలు, proverbs - 1

1) ఆలి పంచాయితీ రామాయణం,పాలి పంచాయతీ భారతం. 
2) హనుమంతుని ముందు కుప్పి గంతులా?
3) శ్రీ సీతా రాముల పెళ్ళంట! చూచీ వత్తము ,రా రండి!
4) సీతమ్మ వారి జడ కుప్పెలు.(=ఒక మొక్క పేరు)
5) ఆకాశ రామన్న ఉత్తరములు .(=అజ్ఞాత వ్యక్తి పుకార్లు పుట్టించే మాదిరిగా రహస్యముగా రాసే లేఖలు)
6) హనుమంతుడు సంజీవనీ పర్వతాన్ని పెకలించుకు వచ్చినట్లు.
7) ఊరావలి హనుమాండ్లు./ఊరు అవతలి/ఊరవతలి /.
8) నసీబు నారాయణ.
'''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''
1) పలుకే బంగారమాయెనా!
2) సీతమ్మ మా తల్లి, శ్రీ రాముల మాకు తండ్రి. 
3) శ్రీరామ నవమి చలువ పందిళ్ళు.
4) శ్రీరామ నవమి పానకం.
(మిరియాలు,బెల్లము వేసి చేసే పానకము ,వడ పప్పు ప్రసాదములు)
5) అంకె లేని కోతి లంకంతా చెరచిందంట.
6) రెంటికీ చెడ్డ(చెడిన) రామన్న.
7) హరిశ్చంద్రుడి నోట అబద్ధం రాదు, నీ నోట నిజంరాదు.

8) లంకా దహనం./లంకను కాల్చిన వాడు రాముని లెంక
(= బంటు/ నమ్మిన బంటు).
9) అమరము నెమరుకు వస్తే కావ్యాలెందుకు [ = అక్కర లేదు ] ; 
= amaramu nemaruku wastE kaawyaalemduku
;
; ************************************************************************,
పౌరాణిక సామెతలు, proverbs - 1  ; [ తెలుగు పలుకు బళ్ళు, అవీ ఇవీ  ]
పౌరాణిక సామెతలు, నానుడులు, చాటువులు ;
పౌరాణికముల గాధావళి ఆధారముగా లోకోక్తులు ; 12, డిసెంబర్ 2008, శుక్రవారం ;

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...