PUTRDA EKADASHI (5th Jan, 2012) |
కోవెల- ను ఇంగ్లీషులో Temple అని పిలుస్తున్నారు.
ఈ "టెంపుల్" అనే మాట ఎప్పటినుండీ వాడుకలోనికి వచ్చినది?
లాటిన్ పదము "Tempus" అనేది
ధ్వనిపరముగా "టెంపుల్" కు దగ్గరగా ఉన్నది.
ఐతే దాని అర్ధము మాత్రము - మత గృహ, పూజాదులకు కనెక్షన్ లేదు.
లాటిన్ "టెంపస్" కణత, లోపలి కండరములు అని అర్ధము.
టెంపుల్ - భారత దేశములోని అర్చనా ధామములకు- అంటే-
గుడి- కి పర్యాయ పదమై అవతారము దాల్చినది.
Latin- templum ఇండో యూరోపియన్ మూలము (root) - లలో :-
కత్తిరించుట, లేక "విభజించబడిన" అనే భావాలను పొందినవి.
అందరూ తిరుగాడే నేల నుండి-
విడిగా పవిత్రముగా ఎంచబడుతూన్న భూమియే -
టెంపుల్ - అనే పదస్వరూపాన్ని సంతరించుకొని ఉండవచ్చును.
లాటిన్ - లో నుండి -> :- ప్రాచీన ఫ్రెంచ్ భాషలో "టెంపులా" నుండి
ఆంగ్లేయులు తెచ్చిన వర్డ్ యే ఇది!
ప్రప్రథమముగా ఈ English- word-
"Temple" 1310 లో ఉపయోగములోనికి వచ్చినది.
నేడు దేవాలయము, ఆలయము ఇత్యాది భారతీయ పద వల్లరి కన్నా-
ఈ ఆంగ్లేయులు అందించిన "టెంపుల్" అనేదే మెండుగా వాడుకలో ఉన్నది.
అది సరే! ఇవాళ శ్రీక్రిష్ణాష్టమి కదా!
క్రిష్ణా టెంపుల్ కి వెళ్ళి, పూజలు చేసి, ప్రసాదములను తిన్నారా మరి!
ఇక ఇవాళ ఒక కోవెల గురించి తెలుసుకొందామా!!!!!!
**********************,
మూసీ నది, తెలంగాణా, హైదరాబాదువాసులకు ప్రధాన జలవనరులు,
త్రాగునీటికి ముఖ్య ఆధారమైనది.
మూసీ ఎక్కడ పుట్టిందో తెలుసా మీకు?
ఇక్కడి కొండల ఏరు "అనంతగిరి".
("అనంతగిరి" అనగానే
కేరళలోని "అనంతపద్మనాభస్వామి వారు" చప్పున జ్ఞాపకము వచ్చారు కదూ!)
ముచికుందుడు అనే రాజర్షి శ్రీకృష్ణ, బలరాముల చరణారవిందములను కడిగాడు.
అలా పారిన జలములే ముచికుందానది- గా రూపొందినవి.
క్రమేపీ, ముచికుంద- కాస్తా "మూసీ నది"( but- 'ఏరు లాంటి నది ఇది) ఐనది.
ఇక్కడ సాలగ్రామ రూపములు కనువిందు చేస్తూన్నవి.
అనంతపద్మనాభస్వామి- వెలసి, భక్తులకు నయనానందకరము చేస్తున్నాడు.
భాగ్యనగరానికి/ అదే!- మన హైదరాబాదుకు 90 కి.మీ. దూరాన,
వికారాబాదుకు 5 కి.మీ. దవ్వున నెలకొన్న పుణ్యసీమ ఇది.
బాటలో ప్రయాణిస్తూన్నంతసేపూ, చుట్టూ పచ్చని ప్రకృతి ఆహ్లాదాన్ని కలిగిస్తూంటుంది.
తాండూరు- హైదరాబాద్ రూట్ లో బయలుదేరాలి.
శ్రీ మహావిష్ణుపాదపద్మముల వద్ద జనించినది ముచికుందానది.
రంగారెడ్డి జిల్లా, నల్గొండ జిల్లాలలో ప్రవహించినది ఈ చిన్న నది.
అనంతగిరులలో- వికారాబాద్ వద్ద ఉద్భవించిన ముచికుందా ఝరి-
నెమ్మదిగా తూర్పు దిశగా సాగినది.
ఆ మూసీ వాహిని వాడపల్లి వద్ద కృష్ణానదిలో లీనమైనది.
సముద్రమట్టమునకు 2169 అడుగుల ఎతూన ఉండుటచే,
అనంతగిరుల హరిత సౌందర్యాలు, యాత్రికులను ఆకట్టుకుంటాయి.
ఆహ్లాదకర యానము సందర్శకులకు లభిస్తుంది అనడములో సందేహము లేదు.
దారిలో ప్రభుత్వ భోజన హోటల్ ఉన్నది.
కొంచెం కొస మెరుపు:- Temple అనే Wordకు
ఈ వ్యాసములో వాడిన ఇతర పదాలు ఏమిటో గుర్తించగలరా?
సరే! అవి ఇవి!
ఇవిగో చూసి, చదవండి!:-
గుడి; ఆలయము, దేవాలయము; దేవళము; కోవెల;
;
photo astrojmd (link)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి