9, ఆగస్టు 2012, గురువారం

వానరము చేసిన అర్చనలు

Kalika Mata temple in Ratlam,M.P

;  ;











మధ్యప్రదేశ్ రాష్ట్రములో, రత్లామ్ లో 
కాళికా మాత కోవెల ఉన్నది. 

;
ఆ గుడి ప్రాంగణములో (Kalika Mata temple Ratlam,M.P.) 
మహంతీ (= సాధువు) ఉపన్యసిస్తున్నాడు. 
ఆయన ధర్మప్రవచనముల మృదుమధుర వక్కాణములలో శ్రోతలు లీనమైనారు. 
సాధువు రామాయణ గాథను, 
హనుమంతుని మహాకార్యములను విపులీకరిస్తూన్నారు. 
కీర్తనలను, భజనలను మధ్య మధ్యలో పొదుగుతూ, 
రమ్య ప్రవచనములు సాగుతూ ఉన్నవి. 
ఇంతలో అక్కడకు ఒక వానరము (langur) వచ్చింది;
mahantji, దగ్గరగా వచ్చి ఆసీనమైనది. 
ఆ కోతి శ్రద్ధగా అక్కడ పాడుతూన్న కీర్తనలను, వినసాగినది. 
అది మహంత్ జీ మైకు (mic) దగ్గరకు వచ్చి, 
ఆయనవద్ద చనువుగా తిష్ఠ వేసినది. 
            
మహంత్ జీ ఆశీస్సులను ఆ కోతి పొందినది. 
తర్వాత అది- సాధువులకు దీవెనలను ఒసగినది. 
కొన్ని పూలను చేతులలోనికి తీసుకున్నది. 
అచ్చట ఉన్న శ్రీరామచంద్రుల ఫొటోకు పూలను వేసినది. 
సభికులు ఆశ్చర్యపడే రీతిలో - ఆ వానరము- 
సాక్షాత్తూ ఆ హనుమంతుడు కూర్చున్న భంగిమతో- పూలతో పూజలు చేసినది.
~~~~~~  


రత్లామ్, మధ్యప్రదేశ్: జై గురు హనుమాన్
;  
 @@@@@@@@@@@@ 

ఈ విచిత్ర సంఘటన 2011 సంవత్సరములో  సంభవించినది.
 ఏప్రిల్ 25 వ తేదీన (April 25 2011) ఇది జరిగినది.  



రత్లామ్ గుడి (M.P.) లో పూజలు చేస్తూ హనుమాన్లు


[Tags:- Ramayana, "Hanumanji", langur]  


రామ్ రామ్ జై సీతా రామ్! 
 జై బోలో హనూమాన్ జీ!


SUPER MONKEY   (Link 1)
Jai Guru Hanuman 

Bolo Siyavar Ramchandra ki Jai. 
Pavana suta Hanuman ki Jai.

The Monkey God , arunachalagrace

Ratlam, Madhyapradesh, Langur , Vedio (  వీడియో link)
;  

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

I really superb.

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...